TVS Apache RTR 160 Black Edition Launched: భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ ”టీవీఎస్ మోటార్” (TVS Motor) ఎట్టకేలకు ‘అపాచీ ఆర్‌టీఆర్ 160 4వీ’ (Apache RTR 160 4V) కొత్త వేరియంట్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ లేటెస్ట్ బైక్ ధర, డిజైన్ మరియు ఇవుతర వివరాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
దేశీయ విఫణిలో అడుగుపెట్టిన కొత్త టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 160 4వీ డార్క్ ఎడిషన్ వేరియంట్‌ల రూపంలో విడుదలయ్యాయి. కాబట్టి ఇవి ఆల్ బ్లాక్ ఫినిషింగ్ పొందుతాయి. ఇది ‘అపాచీ ఆర్‌టీఆర్ 160’ మరియు ‘అపాచీ ఆర్‌టీఆర్ 160 4వీ’ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది.
ధర
దేశీయ మార్కెట్లో విడుదలైన లేటెస్ట్ అపాచీ ఆర్‌టీఆర్ ధరలు వరుసగా రూ. 1.20 లక్షలు (అపాచీ ఆర్‌టీఆర్ 160), రూ. 1.23 లక్షలు (అపాచీ ఆర్‌టీఆర్ 160 4వీ) అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఢిల్లీ. ఈ రెండు బైకుల డిజైన్ కాకుండా.. ఎటువంటి మెకానికల్ అప్డేట్స్ లేదని తెలుస్తోంది.
డిజైన్
కొత్త అపాచీ ఆర్‌టీఆర్ డార్క్ ఎడిషన్ బ్లాక్ అవుట్ ఎగ్జాస్ట్ మరియు ట్యాంక్ మీద ఎంబోస్ చేయబడిన టీవీఎస్ లోగో వంటివి ఉన్నాయి. చూటడానికి మునుపటి మోడల్స్ మాదిరిగా ఉన్న ఈ బైకులలో ఆశించదగ్గ డిజైన్ అప్డేట్స్ లేవని తెలుస్తోంది. కాబట్టి అదే ఎల్ఈడీ హెడ్‌లాంప్, టెయిల్‌లాంప్, టర్న్ ఇండికేటర్స్ మొదలైనవన్నీ స్టాండర్డ్ బైకులలో ఉండేలా ఉంటాయి.
ఫీచర్స్
లేటెస్ట్ అపాచీ ఆర్‌టీఆర్ డార్క్ ఎడిషన్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో టీవీఎస్ స్మార్ట్‌కనెక్ట్ సిస్టమ్‌తో కూడిన వాయిస్ అసిస్ట్ ఫీచర్ ఉంటుంది. స్టాండర్డ్ బైకులో ఉన్న మిగిలిన అన్ని ఫీచర్స్ ఇందులో కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. తద్వారా ఉత్తమ రైడింగ్ అనుభూతిని పొందవచ్చు.
ఇంజిన్
ఆర్‌టీఆర్ 160 బైక్ 159.7 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8750 rpm వద్ద 16.04 Bhp పవర్ మరియు 7000 rpm వద్ద 13.85 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో రెయిన్, అర్బన్ మరియు స్పోర్ట్స్ అనే మూడు రైడింగ్ మోడ్స్ లభిస్తాయి. పవర్ మరియు టార్క్ అనేవి ఎంచుకునే రైడింగ్ మోడ్‌ను బట్టి మారుతూ ఉంటాయి. ఈ బైక్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 97 కిమీ కావడం గమనార్హం.
ఇక ఆర్‌టీఆర్ 160 4వీ బైక్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే.. ఇది 160 సీసీ సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 9250 rpm వద్ద 17.35 bhp పవర్ మరియు 7250 rpm వద్ద 14.73 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇందులో కూడా అదే రెయిన్, అర్బన్ మరియు స్పోర్ట్స్ అనే మూడు రైడింగ్ మోడ్స్ లభిస్తాయి. ఇంజిన్ ఐదు స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.
టీవీఎస్ కంపెనీ యొక్క బైకులకు మరియు స్కూటర్లకు భారతదేశంలో మంచి డిమాండ్ ఉంది. అయితే సంస్థ ఎప్పటికప్పుడు తన కస్టమర్ల కోసం ఆధునిక ఉత్పత్తులను లాంచ్ చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు అపాచీ న్యూ వేరియంట్ లాంచ్ చేసింది. ఇది తప్పకుండా బైక్ ప్రియులను ఆకర్షిస్తుందని భావిస్తున్నాము.
టీవీఎస్ కంపెనీ సాధారణ బైకులను మాత్రమే కాకుండా.. ఎలక్ట్రిక్ స్కూటర్ (ఐక్యూబ్) కూడా విక్రయిస్తోంది. ఇది మార్కెట్లో ఉత్తమ అమ్మకాలను పొందుతూ.. దేశీయ విఫణిలో దూసుకెళ్తోంది. రాబోయే రోజుల్లో కంపెనీ మరిన్ని కొత్త ఉత్పత్తులను లాంచ్ చేస్తుందని భావిస్తున్నాము.
Don’t Miss: మార్కెట్లో లాంచ్ అయిన కొత్త టీవీఎస్ ఐక్యూబ్.. ధర రూ. లక్ష కంటే తక్కువే
టీవీఎస్ కంపెనీకి చెందిన ‘రైడర్ 125’ దేశీయ మార్కెట్లో గత నెలలో ఉత్తమ అమ్మకాలను పొందింది. గత నెలలో ఏకంగా 50000 యూనిట్ల అమ్మకాలను పొందింది. దీన్ని బట్టి చూస్తే టీవీఎస్ బైకులకు దేశీయ మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో ఇట్టే అర్థమైపోతుంది. టీవీఎస్ కంపెనీ భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచ మార్కెట్లో సుమారు 80 దేశాల్లో తన ఉనికిని చాటుకుంటోంది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.