TVS Launches New Affordable iQube Base Variant: అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ‘టీవీఎస్ మోటార్స్’ (TVS Motors) యొక్క ‘ఐక్యూబ్’ (iQube) ఇప్పుడు కొత్త వేరియంట్‌లో లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త బైక్ ఇప్పటికే అందుబాటులో ఉన్న అన్ని ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల కంటే తక్కువ ధర వద్ద అందుబాటులో ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ధర
టీవీఎస్ కంపెనీ లాంచ్ చేసిన కొత్త ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ‘బేస్ వేరియంట్’. దీని ధర రూ. 94,999 (ఎక్స్ షోరూమ్). ఈ ధర జూన్ 30 వరకు మాత్రమే ఉంటుందని సమాచారం. ఆ తరువాత ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఎంత పెరుగుతుందనే విషయం మాత్రం ఖచ్చితంగా తెలియాల్సి ఉంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ చిన్న 2.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది.
ఐదు వేరియంట్లు
నిజానికి కంపెనీ ఇప్పటికే మార్కెట్లో స్టాండర్డ్ (3.4 కిలోవాట్ బ్యాటరీ), ఐక్యూబ్ ఎస్, ఐక్యూబ్ ఎస్‌టీ (3.4 కిలోవాట్ బ్యాటరీ), ఐక్యూబ్ ఎస్‌టీ (5.1 కిలోవాట్ బ్యాటరీ) అనే వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 1.47 లక్షలు, రూ. 1.57 లక్షలు, రూ. 1.55 లక్షలు మరియు రూ. 1.85 లక్షలు.
పైన వెల్లడించిన ధరలను బట్టి చూస్తే.. టీవీఎస్ కంపెనీ ఇప్పుడు లాంచ్ చేసిన బేస్ వేరియంట్ ధర అన్నింటి కంటే తక్కువ అని తెలుస్తోంది. ఇప్పటికే టాప్ స్పెక్ వేరియంట్స్ అన్నీ కూడా అమ్మకానికి మార్కెట్లో ఉన్నాయి. కాగా టీవీఎస్ ఐక్యూబ్ ఇప్పుడు ఐదు వేరియంట్లలో లభిస్తుంది. ఇవన్నీ కూడా దేశంలో ఉన్న 434 నగరాల్లో విక్రయానికి అందుబాటులో ఉంటాయి.
బ్యాటరీ, రేంజ్ మరియు ఛార్జింగ్
టీవీఎస్ ఐక్యూబ్ బేస్ వేరియంట్ 4.4 kW హబ్ మౌంటెడ్ BLDC మోటార్ పొందుతుంది. ఇది 140 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులోని 2.2 కిలోవాట్ బ్యాటరీ సింగిల్ చార్జితో గరిష్టంగా 75 కిమీ (ఎకో మోడ్) అందిస్తుంది. అయితే ఈ స్కూటర్ పవర్ మోడ్‌లో 60 కిమీ రేంజ్ మాత్రమే అందిస్తుంది.
ఛార్జింగ్ విషయానికి వస్తే.. టీవీఎస్ ఐక్యూబ్ బేస్ వేరియంట్ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం రెండు గంటల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకుంటుంది. కాబట్టి ఛార్జింగ్ పరంగా కూడా ఇది వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుందని స్పష్టమవుతోంది.
కలర్ ఆప్షన్స్
ఐక్యూబ్ బేస్ వేరియంట్ రెండు కలర్ ఆప్షన్లలో మాత్రమే లభిస్తుంది. అవి వాల్‌నట్ బ్రౌన్ మరియు పెర్ల్ వైట్ కలర్స్. ఇవి రెండూ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. డిజైన్ మరియు ఫీచర్స్ అన్నీ కూడా దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటాయి.
ఫీచర్స్
కొత్త టీవీఎస్ ఐక్యూబ్ బేస్ వేరియంట్ 5 ఇంచెస్ కలర్‌ఫుల్ టీఎఫ్‌టీ స్క్రీన్ పొందుతుంది. ఇది ఛార్జింగ్, వెహికల్స్ క్రాష్ అనే టో అలర్ట్ మరియు టర్న్ బై టర్న్ న్యావిగేషన్, డిస్టెన్స్ టు ఎంప్టీ వంటి వాటిని ప్రదర్శిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 30 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ పొందుతుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.
టీవీఎస్ ఐక్యూబ్ ఎస్‌టీ
ఐక్యూబ్ ఎస్‌టీ విషయానికి వస్తే.. ఇది 3.4 కిలోవాట్ బ్యాటరీ మరియు 5.1 కిలోవాట్ బ్యాటరీ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు రూ. 1.55 లక్షలు, రూ. 1.85 లక్షలు (ఎక్స్ షోరూమ్ బెంగళూరు). 3.4 కిలోవాట్ బ్యాటరీ వేరియంట్ ఒక సింగిల్ చార్జితో 100 కిమీ రేంజ్ (70 కిమీ/గణ్ స్పీడ్) అందిస్తుంది. కాగా 5.1 కిలోవాట్ బ్యాటరీ వేరియంట్ రూ. గంటకు 82 కిమీ వేగంతో 150 కిమీ రేంజ్ అందిస్తుంది.
Don’t Miss: స్పెషల్ ఎడిషన్స్ లాంచ్ చేసిన ఎంజీ మోటార్స్.. ఫిదా చేస్తున్న కలర్ ఆప్షన్!
టీవీఎస్ ఐక్యూబ్ ఎస్‌టీ 7 ఇంచెస్ స్క్రీన్ పొందుతుంది. ఇందులో 118 కంటే ఎక్కువ కనెక్టెడ్ ఫీచర్స్ ఉంటాయి. అలెక్సా ద్వారా వాయిస్ అసిస్ట్, డిజిటల్ డాక్యుమెంట్ స్టోరేజ్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం వంటి ఆధునిక ఫీచర్స్ ఇందులో ఉంటాయి. ఇది కాపర్ బ్రాంజ్ మ్యాట్, కోరల్ సాండ్ శాటిన్, టైటానియం గ్రే మ్యాట్ మరియు స్టార్‌లైట్ బ్లూ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.