Mahindra December Discount On Thar: భారతదేశంలో ఎక్కువమంది ఇష్టపడి కొనుగోలు చేస్తున్న ఆఫ్ రోడర్ కారు ఏదంటే.. టక్కున వచ్చే సమాధానం మహీంద్రా కంపెనీ యొక్క థార్ (Mahindra Thar). అలాంటి మహీంద్రా థార్ కొనుగోలుపైనా కంపెనీ అద్భుతమైన డిస్కౌంట్ గరిష్టంగా రూ. 3 లక్షల వరకు అందిస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
2024 ముగుస్తున్న తరుణం మాత్రమే కాకుండా.. థార్ 5 డోర్ అమ్మకాలను పెంచుకునే దిశగా మహీంద్రా కంపెనీ అడుగులు వేస్తూ ఈ గొప్ప డిస్కౌంట్ ప్రకటించినట్లు అర్థమవుతోంది. ప్రారంభం నుంచి మంచి అమాంకాలతో దూసుకెళ్తున్న మహీంద్రా థార్ మొత్తం మూడు ఇంజిన్ ఆప్షన్‌లలో లభిస్తుంది. అవి 152 హార్స్ పవర్ అందించే 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 132 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేసే 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్.. మూడోది 119 హార్స్ పవర్ అందించే 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్.
మహీంద్రా థార్ 4డబ్ల్యుడీ (Mahindra Thar 4WD)
థార్ ఎర్త్ ఎడిషన్ యొక్క డబ్ల్యుడీ వేరియంట్ కొనుగోలుపైన ఏకంగా 3.06 లక్షల డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కారు కొనుగోలు చేసేవారు రూ. 3 లక్షల కంటే ఎక్కువ సేవ్ చేయవచ్చు. ఈ కారు స్పెషల్ కలర్ ఆప్షన్ పొందుతుంది. దీనిని కంపెనీ ‘డెసర్ట్ ఫ్యూరీ’ అని పిలుస్తుంది.
కొత్త మహీంద్రా థార్ ఎర్త్ ఎడిషన్ యొక్క బి పిల్లర్స్ మీద మరియు రియర్ ఫెండర్ మీద ఎర్త్ ఎడిషన్ బ్యాడ్జ్‌లు ఉండటం చూడవచ్చు. అయితే ఇందులోని లెదర్ అపోల్స్ట్రే లేత గోధుమ రంగు మరియు నలుపు రంగులలో (డ్యూయెల్ టోన్) ఉండటం చూడవచ్చు. ఈ ఎర్త్ ఎడిషన్ ధర మార్కెట్లో రూ. 15.40 లక్షల నుంచి రూ. 17.60 లక్షల మధ్య ఉంది.
మహీంద్రా థార్ 2డబ్ల్యుడీ (Mahindra Thar 2WD)
కంపెనీ ఇప్పుడు మహీంద్రా థార్ 2డబ్ల్యుడీ కొనుగోలుపైన కొనుగోలుదారులు రూ. 1.31 లక్షల వరకు తగ్గింపును పొందవచ్చు. ఇది 3 డోర్ మోడల్ మరియు పెట్రోల్ బేస్డ్ వెర్షన్. మార్కెట్లో ఈ కారు ధర రూ. 11.35 లక్షల నుంచి రూ. 14.10 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ప్రస్తుతం మహీంద్రా కంపెనీ ప్రకటించిన డిస్కౌంట్స్.. గతంలో కంటే చాలా ఎక్కువని తెలుస్తోంది. ఇది కూడా చూడటానికి స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే ఇందులో కొన్ని చేంజస్ గమనించవచ్చు.
గమనిక: డిస్కౌంట్ అనేది నగరాన్ని బట్టి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా కంపెనీ అందించే డిస్కౌంట్ స్టాక్ లభ్యతకు లోబడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితమైన డిస్కౌంట్స్ లేదా తగ్గింపులు గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలంటే.. సమీపంలోని బ్రాండ్ యొక్క అధికారిక డీలర్షిప్ వద్ద తెలుసుకోవాలి.
మహీంద్రా థార్ రోక్స్ (Mahindra Thar Roxx)
భారతదేశంలో ప్రారంభం నుంచి గొప్ప అమ్మకాలను పొందిన మహీంద్రా థార్ ఇప్పుడు 5 డోర్ వెర్సన్ రూపంలో కూడా అందుబాటులో ఉంది. దీని పేరు రోక్స్. ఈ థార్ 5 డోర్ మోడల్ ప్రారంభ ధర రూ. 12.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది స్టాండర్డ్ మోడల్ కంటే కూడా పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది. ఇది 5 డోర్ మోడల్ కాబట్టి.. థార్ 3 డోర్ మోడల్ కంటే విశాలంగా ఉండటం చూడవచ్చు.
Also Read: 2024లోనే కారును ఎందుకు కొనాలి.. 2025లో కొంటే వచ్చే నష్టాలు తెలుసా?
మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ థార్ మంచి డిజైన్, వాహన వినియోగదారులకు అవసరమైనన్ని ఫీచర్స్ పొందుతుంది. ఇందులోని 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ 152 హార్స్ పవర్, 330 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. అదే విధంగా ఇందులోని 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 162 హార్స్ పవర్ మరియు 330 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు మాన్యువల్ మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. కాబట్టి అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. కంపెనీ ఈ కారు కొనుగోలుపై ఎలాంటి డిస్కౌంట్స్ లేదా తగ్గింపులను అందించడం లేదు.