Upcoming Bikes Arriving in India 2024 August: 2024 మొదలై దాదాపు ఏడు నెలలు కావొస్తోంది. ఎట్టకేలకు ఎనిమిదో నెల కూడా వచ్చేసింది. ఈ ఏడాది ప్రారంభమ నుంచి అనేక బైకులు, కార్లు దేశీయ విఫణిలో లాంచ్ అయ్యాయి. ఈ నెలలో కూడా ఇండియన్ మార్కెట్లో లాంచ్ కావడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, ఓలా ఎలక్ట్రిక్ బైక్, బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 మరియు ట్రయంఫ్ డేటోనా 660 వంటివి ఉన్నాయి.
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 (Royal Enfield Classic 350)
భారతదేశంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ నెలలో (2024 ఆగష్టు) అప్డేటెడ్ క్లాసిక్ 350 బైక్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇది ఆగష్టు 12న అధికారికంగా లాంచ్ అవుతుందని సమాచారం. ప్రస్తుతం ఈ బైక్ టెస్టింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బైక్ కొత్త కలర్ ఆప్షన్స్, అప్డేటెడ్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందనున్నట్లు భావిస్తున్నారు. స్టాండర్డ్ బైకులో ఉన్న అదే ఇంజిన్ ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి ఇది 349 సీసీ సింగిల్ సిలిండర్ జే సిరీస్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ ఇప్పటికే బ్రాండ్ యొక్క హంటర్ 350, బుల్లెట్ 350 మరియు మీటియోర్ 350 వంటి వాటిలో కూడా ఉంటుంది. ఇంజిన్ 6100 ఆర్‌పీఎమ్ వద్ద 20.2 బీహెచ్‌పీ పవర్ & 4000 ఆర్‌పీఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.
బీఎస్ఏ గోల్డ్ స్టార్ (BSA Gold Star)
ఈ నెలలో లాంచ్ అయ్యే బైకుల జాబితాలో చెప్పుకోదగ్గ మోడల్ బీఎస్ఏ గోల్డ్ స్టార్. ఇది ఆగస్టు 15న.. అంటే భారత స్వాతంత్య్ర దినోత్సవం నాడు అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది 652 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ కలిగి 45 బీహెచ్‌పీ పవర్ మరియు 55 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.
1990లలో దేశీయ మార్కెట్ల ఎంతో ప్రజాదరణ పొందిన ఈ బైక్ లేటెస్ట్ రెట్రోల్ డిజైన్ పొందుతుంది. అంతే కాకుండా ఇది పీరియడ్ కరెక్ట్ పెయింట్ మరియు క్రోమ్ బిట్స్ పొందుతుంది. మొత్తం మీద ఇది చాలా అద్భుతంగా.. రైడర్ల రోజువారీ వినియోగానికి అనుకూలంగా ఉంటుంది. ఈ బైక్ ధరలు త్వరలోనే అధికారికంగా వెల్లడవుతాయి.
ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ పోర్క్, వెనుక ట్విన్ స్ప్రింగ్ స్వింగ్ ఫ్రేమ్ ఉంటాయి. ఈ బైక్ వైర్ స్పోక్ వీల్స్ కలిగి ఉంటుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ఇందులో యొక్క రెండు చివర్లలో ఒకే డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఏబీఎస్ అనేది ప్రామాణికంగా అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ. 3 లక్షల నుంచి రూ. 3.3 లక్షల మధ్యలో ఉంటుందని భావిస్తున్నాము.
ఓలా ఎలక్ట్రిక్ బైక్ (Ola Electric Bike)
ఇప్పటి వరకు ఓలా ఎలక్ట్రిక్ కేవలం ఎలక్ట్రిక్ స్కూటర్లను మాత్రమే లాంచ్ చేసింది. కానీ మొదటిసారి దేశీయ విఫణిలో ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేయడానికి సన్నద్ధమైంది. ఇప్పటికే కంపెనీ పలు బైకులను పరిచయం చేసింది, కానీ ఇందులో ఒకటి మాత్రమే ఆగష్టు 15న లాంచ్ అవుతుంది. ఈ విషయాన్ని కంపెనీని సీఈఓ భవిష్ అగర్వాల్ పేర్కొన్నారు.
ఓలా ఎలక్ట్రిక్ ప్రతి ఏటా ఆగష్టు 15న ఏదో ఒక ఉత్పత్తిని లాంచ్ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఈ ఏట సరికొత్త మోటార్‌సైకిల్ లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ బైక్ టెస్టింగ్ దశలో ఉన్నట్లు సమాచారం. ఇది 100 సీసీ నుంచి 125 సీసీ మధ్య విభాగంలో లాంచ్ అవుతుందని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ట్రయంఫ్ డేటోనా 660 (Triumph Daytona 650)
ఆగష్టు 2024లో లాంచ్ అయ్యే మరో బైక్ ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ యొక్క డేటోనా 660. నిజానికి ఈ బైక్ దేశీయ మార్కెట్లో రెండు నెలల క్రితమే లాంచ్ అయి ఉండాలి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల లాంచ్ ఈ నెలకు మార్చడం జరిగింది. కాబట్టి ఈ బైక్ ఈ నెలలోనే అధికారికంగా లాంచ్ అవుతుందని భావిస్తున్నాము. ఈ బైక్ కోసం బుకింగ్స్ కూడా ఇప్పటికే ప్రారంభమైనట్లు సమాచారం.
Don’t Miss: ఫాస్ట్‌ట్యాగ్ కొత్త రూల్స్ తెలుసా? ఇవి పాటించకుంటే ఇబ్బందులు తప్పవు
కొత్త డేటోనా 660 బైక్ ట్రైడెంట్ 660 ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది స్పోర్టీ డిజైన్, మంచి రైడింగ్ పొజిషన్ కలిగి ఉంటుంది. ఈ బైక్ 660 సీసీ ఇంజిన్ కలిగి 11250 rpm వద్ద 95 Bhp పవర్ మరియు 8250 rpm వద్ద 69 Nm టార్క్ అందిస్తుంది. ఈ బైక్ ధర రూ. 10 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) ఉంటుందని సమాచారం. అయితే అధికారికంగా ధరలు వెల్లడికావాల్సి ఉంది.