Upcoming Cars and SUV Launches in 2025 March: 2025 ప్రారంభం నుంచి మార్కెట్లో కొత్త కార్లు లేదా అప్డేటెడ్ కార్లు లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఈ ఏడాది మూడో నెల కూడా ప్రారంభమైపోయింది. మార్చి 2025లో దేశీయ విఫణిలో లాంచ్ కానున్న కొత్త కార్లను గురించి వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.
వోల్వో ఎక్స్‌సీ90 ఫేస్‌లిఫ్ట్ (Volvo XC90 Facelift)
స్వీడిష్ కార్ల తయారీ సంస్థ వోల్వో.. మార్చి 4న తన ఎక్స్‌సీ90 ఫేస్‌లిఫ్ట్ కారును లాంచ్ చేయనుంది. 2016లో మొదటిసారిగా మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కారు, ఆ తరువాత కాలంలో అనేక అప్డేట్స్ పొందింది. ఇప్పుడు ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ కావడానికి సిద్ధమైంది. ఈ కొత్త కారు చూడటానికి కొంత.. స్టాండర్డ్ మోడల్ మాదిరిగా అనిపించినప్పటికీ.. కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ గమనించవచ్చు.
కొత్త వోల్వో ఎక్స్‌సీ90 ఫేస్‌లిఫ్ట్ కారులో.. మోడిఫైడ్ గ్రిల్, సన్నని హెడ్‌లైట్స్, రిఫ్రెష్ చేయబడిన గ్రిల్, టెయిల్ ల్యాంప్, కొత్త అల్లాయ్ వీల్స్ అన్నీ కూడా ఇందులో చూడవచ్చు. కంపెనీ ఈ కారు ధరలను అధికారికంగా వెల్లడించలేదు. అయితే దీని ధర దాని మునుపటి మోడల్ కంటే కొంత ఎక్కువే అని తెలుస్తోంది. ఇది బీఎండబ్ల్యూ ఎక్స్5, మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ మరియు ఆడి క్యూ7 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.
వోల్వో ఎక్స్‌సీ90 ఫేస్‌లిఫ్ట్ యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇందులో 11.2 ఇంచెస్ గూగుల్ బేస్డ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం.. ఓవర్ ది ఎయిర్ అప్‌డేట్‌లను పొందుతోంది. ఇది 2.0 లీటర్ టర్బో పెట్రోల్ మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ద్వారా.. 250 హార్స్ పవర్, 360 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి పనితీరు పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుందని తెలుస్తోంది.
మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్ఎల్ 680 మోనోగ్రామ్ సిరీస్ (Mercedes Maybach SL 680 Monogram Series)
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ దేశీయ విఫణిలో సరికొత్త.. ‘మేబ్యాచ్ ఎస్ఎల్ 680 మోనోగ్రామ్ సిరీస్’ లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. దీనిని కంపెనీ మార్చి 17న అధికారికంగా లాంచ్ చేయనుంది. ఈ కారును కంపెనీ గత ఏడాది.. గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఇప్పుడు తాజాగా ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయడానికి తయారవుతోంది.
మేబ్యాచ్ ఎస్ఎల్ 680 మోనోగ్రామ్ డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్ పొందుతుందని తెలుస్తోంది. నిలువుగా ఉండే స్లాట్‌లు, మల్టీ స్పోక్ వీల్స్‌తో కూడిన కోట్ గ్రిల్ వంటివి ఇందులో కనిపిస్తాయి. ఈ కారు ధరలను కంపెనీ ప్రకటించలేదు, కానీ ఇది ఎస్ఎల్ 55 రోడ్‌స్టర్ (రూ. 2.35 కోట్లు) కంటే కొంత ఎక్కువ ధర వద్ద లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
ఇంటీరియర్ విషయానికి వస్తే.. లోపలి భాగంలో నప్పా లెదర్ సీట్లు, వైట్ డాష్‌బోర్డ్, శాటిన్ సిల్వర్ కలర్ స్టీరింగ్ వీల్ చూడవచ్చు. అంతే కాకుండా ఎస్ఎల్ రోడ్‌స్టర్ కంటే అద్భుతమైన ఎగ్జాస్ట్ సిస్టం ఈ కారు పొందుతుంది. ఇది 4.0 లీటర్ ట్విన్ టర్బో వీ8 ఇంజిన్ పొందుతుంది. ఈ ఇంజిన్ 585 హార్స్ పవర్, 800 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 9 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ పొందుతుంది. ఈ కారు 4.1 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. కాబట్టి ఇది వాహన వినియోగదారులకు అద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.
మారుతి సుజుకి ఈ విటారా (Maruti Suzuki e Vitara)
కంపెనీ తన మొట్ట మొదటి ఈ విటారా ఎలక్ట్రిక్ కారును దేశీయ మార్కెట్లో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. దీనిని ఈ నెలలోనే (2025 మార్చి) విడుదల చేస్తుందని సమాచారం. అయితే డేట్, టైమ్ వంటి విషయాలను సంస్థ వెల్లడించలేదు. ఇది కంపనీ యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు. ఇది చూడటానికి కొంత ఈవీఎక్స్ మాదిరిగా ఉంటుంది. అయితే ఇందులో పెద్ద ఎల్ఈడీ హెడ్‌లైట్స్, చుట్టూ చంకీ క్లాడింగ్, 18 ఇంచెస్ వీల్స్ వంటి వాటితో పాటు వెనుక భాగంలో ఎల్ఈడీ లైట్ బార్ వంటివి ఉన్నాయి.
మారుతి సుజుకి ఈ విటారా.. ప్లోటింగ్ 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, 10.1 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఫిక్స్‌డ్ పనోరమిక్ సన్‌రూఫ్, 10 వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు మొదలైనవి ఉన్నాయి.
Also Read: కామెట్ ఈవీ స్పెషల్ ఎడిషన్.. మునుపటి కంటే మరింత కొత్తగా: రేటెంతో తెలుసా?
సేఫ్టీ ఫీచర్స్ కూడా ఈ కారులో ఎక్కువగానే ఉన్నాయి. ఇందులో ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ డిస్క్ బ్రేక్స్, బ్లైండ్ స్పాట్ మానిటర్, లెవెల్ 2 ఏడీఏఎస్ సిస్టం, 360 డిగ్రీ కెమెరా మరియు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు భద్రతను అందిస్తాయి.
మారుతి ఈ విటారా.. రెండు ఎల్ఎఫ్పీ బ్యాటరీ ఫ్యాక్స్ పొందుతుంది. అవి 49 కిలోవాట్ బ్యాటరీ మరియు 61 కిలోవాట్ బ్యాటరీ. టార్క్ అవుట్‌పుట్ రెండింటికీ.. 192.5 ఎన్ఎమ్ వద్ద ఒకేలా ఉంటాయి. కానీ చిన్న బ్యాటరీ 143 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తే.. పెద్ద బ్యాటరీ ప్యాక్ 173 హార్స్ పవర్ అందిస్తుంది. పెద్ద బ్యాటరీ 500 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ కారు ధరలు రూ. 20 లక్షల నుంచి రూ. 30 లక్షల మధ్య ఉంటుంది. ఇది ఎంజీ జెడ్ఎస్ ఈవీ, టాటా కర్వ్ ఈవీ మరియు మహీంద్రా బీఈ 6 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.