మీకు తెలుసా!.. 2025లో భారత్‌లో లాంచ్ అయ్యే ఎలక్ట్రిక్ కార్లు ఇవే

Upcoming Electric Cars in India: భారతదేశంలో ఇప్పటికే టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా ఎక్స్‌యూవీ300, ఎంజీ విండ్సర్, బీవైడీ సీల్, కియా ఈవీ6 వంటి ఎన్నో ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. కాగా వచ్చే ఏడాది కూడా మార్కెట్లో మరికొన్ని ఎలక్ట్రిక్ కార్లు లాంచ్ కావడానికి సిద్ధమవుతున్నాయి. ఈ జాబితాలో హ్యుందాయ్ క్రెటా ఈవీ, మారుతి సుజుకి ఈ-వితారా, మహీంద్రా బీఈ 6ఈ, మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ, టయోటా అర్బన్ ఎలక్ట్రిక్, టాటా హారియార్ ఈవీ మరియు టాటా సఫారీ ఈవీ వంటివి ఉన్నాయి. ఈ కార్ల గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

హ్యుందాయ్ క్రెటా ఈవీ (Hyundai Creta EV)

2025లో భారతీయ మార్కెట్లో లాంచ్ కానున్న ఎలక్ట్రిక్ కార్లలో ‘హ్యుందాయ్ క్రెటా ఈవీ’ ఒకటి. ఇది స్టాండర్డ్ హ్యుందాయ్ క్రెటా కంటే భిన్నంగా ఉంటుంది. క్లోజ్డ్ ఆఫ్ గ్రిల్, కొత్త అల్లాయ్ వీల్స్ వంటివి క్రెటా ఈవీలో ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఈ కారు 45 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ద్వారా 450 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఇది 138 బీహెచ్‌పీ పవర్ మరియు 255 న్యూటన్ మీటర్ టార్క్ అందించే ఎలక్ట్రిక్ మోటారును పొందుతుంది. క్రెటా ఈవీ దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన తరువాత టాటా కర్వ్ ఈవీ, మారుతి ఈ-వితారా, టాటా హారియార్ ఈవీ మరియు బీవైడీ ఆట్టో 3 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండనుంది.

మారుతి సుజుకి ఈ-వితారా (Maruti Suzuki E-Vitara)

దేశీయ మార్కెట్లో లాంచ్ కావడానికి సిద్దమవుతున్న మరో ఎలక్ట్రిక్ కారు మారుతి సుజుకి ఈ-వితారా. ఇది 2025 మార్చిలో లాంచ్ అవుతుందని సమాచారం. ఈ-వితారా హార్ట్ టెక్ స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు 49 కిలోవాట్ మరియు 61 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇవి రెండూ వరుసగా 450 కిమీ నుంచి 500 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క ధరలు మరియు ఇతర వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

మహీంద్రా బీఈ 6ఈ (Mahindra BE 6E)

దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా నవంబర్ 26న తన ‘బీఈ 6ఈ’ ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయనుంది. ఇది స్ప్లిట్ హెడ్‌లైట్ సెటప్, ఏరో బ్లేడ్ స్టైల్ అల్లాయ్ వీల్స్ మరియు కాక్‌పిట్ వంటి ఇంటీరియర్ పొందుతుంది. పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే.. ఇందులో 60 కిలోవాట్ బ్యాటరీ మరియు 79 కిలోవాట్ బ్యాటరీ ఫ్యాక్స్ ఉంటాయి. ఇది ఒక ఛార్జీతో 450 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఈ కారు ధరలకు సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడికాలేదు.

మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ (Mahindra XEV 9E)

2025లో మార్కెట్లో లాంచ్ కానున్న ఎలక్ట్రిక్ కార్లలో మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ కూడా ఒకటి. ఇది కూపే మాదిరిగా ఉన్న ఏటవాలుగా ఉన్న రూఫ్, సి-షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ హెడ్‌లైట్, ప్లష్ డోర్ హ్యాండిల్స్ మరియు ఏరో బ్లేడ్ స్టైల్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క బ్యాటరీ మరియు రేంజ్ వంటి వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. దీనికి సంబంధించిన చాలా వివరాలు నవంబర్ 26న జరగనున్న మహీంద్రా అన్‌లిమిట్ ఈవెంట్‌లో వెల్లడయ్యే అవకాశం ఉంది.

టయోటా అర్బన్ ఎలక్ట్రిక్ (Toyota Urban Electric)

మారుతి సుజుకి మరియు టయోటా వ్యూహాత్మక భాగస్వామ్యంతో ఎలక్ట్రిక్ కారు లాంచ్ కావడానికి సిద్ధమవుతోంది. ఇది పూర్తిగా భిన్నమైన డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. ఇది మారుతి ఈ-వితారా మాదిరిగానే ఉంటుందని తెలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కారు 2025 మొదటి త్రైమాసికంలో లాంచ్ అవుతుందని సమాచారం. అయితే కంపెనీ లాంచ్ చేయనున్న ఈ ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన చాలా వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

టాటా హారియార్ ఈవీ (Tata Harrier EV)

దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ తన హారియార్ కారును ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ కారు 2025 ప్రారంభంలోనే మార్కెట్లో అధికారికంగా లాంచ్ అవుతుందని సమాచారం. ఇది ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం పొందుతుందని తెలుస్తోంది. యాక్టి.ఈవీ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడిన ఈ కొత్త కారు 60 కిలోవాట్ బ్యాటరీ, 80 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది సింగిల్ ఛార్జీతో 500 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది కూడా 2025 మార్చిలో లాంచ్ అవుతుందని సమాచారం.

Don’t Miss: 2024 మారుతి డిజైర్ లాంచ్ ఈ రోజే: ధర ఎంతంటే?

టాటా సఫారీ ఈవీ (Tata Safari EV)

వచ్చే ఏడాది ఇండియన్ మార్కెట్లో లాంచ్ కానున్న మరో టాటా ఎలక్ట్రిక్ కారు సఫారీ ఈవీ. ఇది యాంత్రికంగా హారియార్ ఎలక్ట్రిక్ కారుకు సమానంగా ఉంటుంది. ఇది 2025 మార్చిలో అధికారికంగా లాంచ్ అవుతుందని సమాచారం. మార్కెట్లో టాటా సఫారీ ఈవీ లాంచ్ అయిన తరువాత మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ, ఎక్స్‌యూవీ.ఈ8 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండనుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ధరలను కంపెనీ లాంచ్ సమయంలో వెల్లడయ్యేరు అవకాశం ఉంది.