Upcoming Kia Cars In India 2024: సౌత్ కొరియా కార్ల తయారీ సంస్థ ‘కియా మోటార్స్’ (Kia Motors) భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన విషయం తెలిసిందే. సెల్టోస్, కారెన్స్, సోనెట్ మొదలైన కార్లను విడుదల చేసి మంచి అమ్మకాలను పొందుతున్న కంపెనీ వచ్చే ఏడాది మరిన్ని కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఈ కథనంలో దేశీయ విఫణిలో విడుదలకానున్న కొత్త కియా కార్లను గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ (Kia Sonet Facelift)
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కియా సోనెట్ వచ్చే ఏడాది ప్రారంభంలో.. అంటే 2024 జనవరి నెలలో ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదలకానుంది. రూ. 8 లక్షల నుంచి రూ. 15 లక్షల మధ్య ధర వద్ద ఈ ఫేస్‌లిఫ్ట్ అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. కంపెనీ ఈ కారు కోసం ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభించింది, ఆసక్తికలిగిన ప్రజలు రూ. 25వేలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు లాంచ్ అయిన తరువాత మొదలవుతాయి.
కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ మొత్తం ఏడు వేరియంట్లలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అంతే కాకుండా 10 కలర్ ఆప్షన్లలో లభించనున్నట్లు సమాచారం. ఇంజిన్ విషయానికి వస్తే ఇందులో 1.2 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్, 1.0 లీటర్ త్రీ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మంచి పర్ఫామెన్స్ అందిస్తాయి. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
కియా ఈవీ9 (Kia EV9)
ఇప్పటికే మార్కెట్లో అద్భుతమైన అమ్మకాలు పొందుతున్న కియా ఈవీ6 మాదిరిగానే కంపెనీ మరో ఎలక్ట్రిక్ కారుని ఈవీ9 రూపంలో విడుదల చేయడానికి సన్నద్ధమైంది. ఇది 2024 ఏప్రిల్ – మే మధ్యలో విడుదలయ్యే అవకాశం ఉంది. దీని ధర రూ. కోటి వరకు ఉండవచ్చు.
నిజానికి 2023 ఆటో ఎక్స్‌పోలో కనిపించిన ఈ లేటెస్ట్ మోడల్ 77.4 కిలోవాట్ మరియు 99.8 కిలోవాట్ కెపాసిటీ కలిగిన బ్యాటరీ ప్యాక్ పొందనున్నట్లు సమాచారం. ఇది ఒక సింగిల్ చార్జితో సుమారు 563 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది ఈ ఎలక్ట్రిక్ కారు రియర్ వీల్ డ్రైవ్ లేదా ఆల్ వీల్ డ్రైవ్ ఎంపికలో రానున్నట్లు సమాచారం.
కియా కార్నివాల్ (Kia Carnival)
బిఎస్6 2.0 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ పొందకపోవడం వల్ల కియా కార్నివాల్ ఈ ఏడాది మార్కెట్లో నిలిపివేయబడింది. అయితే కంపెనీ దీనినే నిర్దిష్ట షరతులకు అనుగుణంగా 2024 మధ్యలో రూ. 25 లక్షల నుంచి రూ. 26 లక్షల ధర మధ్య ‘కియా కేఏ4’ (Kia KA4) రూపంలో లాంచ్ చేయడానికి సిద్ధమైంది.
కంపెనీ లాంచ్ చేయనున్న ఈ కారులో 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉండనున్నట్లు సమాచారం. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ఉత్తమంగా ఉండే ఈ కారు రెండు 12.3 ఇంచెస్ డిస్‌ప్లేల వంటి వాటితో అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఈ మోడల్ గ్లోబల్ మార్కెట్లో 7 సీటర్, 9 సీటర్ మరియు 11 సీటర్ కాన్ఫిగరేషన్‌లలో లభించనున్నట్లు సమాచారం.
Don’t Miss: షాట్‌గన్ 650 లాంచ్ చేసిన Royal Enfield – ఇక ప్రత్యర్థులకు చుక్కలే..
కియా క్లావిస్ – ఏవై (Kia Clavis – AY)
దేశీయ మార్కెట్లో కియా మోటార్స్ లాంచ్ చేయనున్న సరి కొత్త మోడల్ ‘కియా క్లావిస్-ఏవై’ దీని ధర రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షల మధ్య ఉండనున్నట్లు సమాచారం. ఈ కారు 2024 చివరలో లేదా 2025 ప్రారంభంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
భారతీయ విఫణిలో అడుగుపెట్టనున్న ఈ కారు సోనెట్ మరియు సెల్టోస్ మధ్యలో ఉండనుంది. కియా క్లావిస్ – ఏవై కారు డిజైన్ మరియు ఫీచర్స్ గురించి కంపెనీ మరిన్ని వివరాలు వెల్లడించాల్సి ఉంది. అయితే ఇది 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగి మంచి పనితీరుని అందించేలా కంపెనీ తాయారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.