Upcoming Toyota Cars in India 2025: 2024లో లెక్కకు మించిన వాహనాలను లాంచ్ చేసిన వాహన తయారీ సంస్థ ‘టయోటా’ (Toyota) ఈ ఏడాది మరో నాలుగు కొత్త కార్లను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇందులో అర్బన్ క్రూయిజర్ ఈవీ, హైరైడర్ 7 సీటర్, ఫార్చ్యూనర్ ఎంహెచ్ఈవీ మరియు ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో ఉన్నాయి. ఈ కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
టయోటా అర్బన్ క్రూయిజర్ ఈవీ (Toyota Urban Cruiser EV)
ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. టయోటా కంపెనీ తన అర్బన్ క్రూయిజర్ కారును.. ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. దీని ఉత్పత్తి ఈ ఏడాది రెండో అర్థ భాగంలో.. పండుగ సీజన్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇది త్వరలో మార్కెట్లో లాంచ్ అయ్యే ఈవిటారా ఆధారంగా రూపొందించబడే అవకాశం ఉంది.
టయోటా అర్బన్ క్రూయిజర్ ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్స్ (49 కిలోవాట్ మరియు 61 కిలోవాట్) పొందనుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్లు ముందు ఇరుసుపై ఫిక్స్ చేయబడి ఉంటాయి. వేరియంట్‌ను బట్టి పవర్ డెలివరీ మారుతూ ఉంటుంది. ఈ కారు ఒక సింగిల్ ఛార్జితో 500 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది.
డిజైన్ విషయానికి వస్తే.. టయోటా అర్బన్ క్రూయిజర్ ఈవీ, గ్రాండ్ విటారాకు భిన్నంగా ఉంటుంది. క్రోమ్ బార్‌ను కనెక్ట్ చేసే సన్నని హెడ్‌ల్యాంప్, అందంగా కనిపించే గ్రిల్, రెండు వర్టికల్ ఎయిర్ వెంట్‌లతో కూడిన బంపర్ ఇందులో చూడవచ్చు. ఇంటీరియర్ మరియు ఫీచర్స్ గురించి అధికారికంగా వెల్లడికావాల్సి వుంది. అయితే ఇందులో 10.1 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం మరియు టూ స్పోక్ ప్లేట్ బాటమ్ స్టీరింగ్ వీల్, 10 వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వెంటిలేషన్ సీట్లు, లెవెల్ ఏడీఏఎస్ మరియు 7 ఎయిర్‌బ్యాగ్‌లు వంటివి ఉండనున్నాయి.
టయోటా హైరైడర్ 7 సీటర్ (Toyota Hyryder 7 Seater)
ఈ ఏడాది ఇండియన్ మార్కెట్లో లాంచ్ కానున్న కార్లలో టయోటా హైరైడర్ 7 సీటర్ కూడా ఉంది. కంపెనీ ఇప్పటికే ఈ వెర్షన్‌ను అభివృద్ధి చేసేపనిలో ఉంది. అయితే ఇది ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయం వెల్లడికాలేదు. బహుశా 2025 చివరి నాటికి మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
టయోటా హైరైడర్ 7 సీటర్ డిజైన్.. దాదాపు దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ, పరిమాణంలో కొంత పెద్దదిగా ఉంటుంది. ఇంటీరియర్ కూడా దాదాపు స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. కాబట్టి ఇందులో ఏడీఏఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం మొదలైనవి ఉంటాయి.
ఇంజిన్ వివరాలను కూడా కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఇది కూడా సాధారణ మోడల్ యొక్క అదే ఇంజిన్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. కాబట్టి ఇందులో 1.5 లీటర్ 3 సిలిండర్ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమాటిక్ గేర్‌బాక్డ్ పొందనుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ ఈ-సీవీటీ ట్రాన్స్‌మిషన్‌ను పొందనున్నట్లు సమాచారం.
టయోటా ఫార్చ్యూనర్ ఎంహెచ్ఈవీ (Toyota Fortuner MHEV)
కంపెనీ లాంచ్ చేయనున్న మరో కారు టయోటా ఫార్చ్యూనర్ ఎంహెచ్ఈవీ. ఇది ఇటీవలే మైల్డ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్ పొందుతుంది. కాగా ఇప్పుడు మైల్డ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ రూపంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది 2025 చివరి నాటికి లేదా 2026 ప్రారంభంలో మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
ఈ కారు 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్.. హైబ్రిడ్ వెర్షన్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 48 వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టం ద్వారా.. 16 Bhp పవర్, 42 Nm టార్క్ అందిస్తుందని సమాచారం. డీజిల్ ఇంజిన్ మరియు హైబ్రిడ్ సిస్టం ద్వారా.. 201 హార్స్ పవర్, 500 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. 2 వీల్ డ్రైవ్ మరియు 4 వీల్ డ్రైవ్ ఆప్షన్స్ ఇందులో ఉండే అవకాశం ఉందని సమాచారం. ఇందులోని ఐడిల్ స్టార్ట్ – స్టాప్ ఫీచర్ వల్ల కొంత ఇంధనం పొదుపు అవుతుంది. ఈ కారులో కూడా ఏడీఏఎస్ మరియు 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్స్ అన్నీ ఉన్నాయి.
Also Read: రూ.300 కోట్ల ఇల్లు.. రూ.3 కోట్ల కారు: ఈ ఆర్ఆర్ఆర్ బ్యూటీ ఎవరో తెలుసా?
టయోటా ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో (Toyota Land Cruiser Prado)
కంపెనీ లాంచ్ చేయనున్న కార్లలో మరొకటి ‘టయోటా ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో’. దీనిని 2025 చివరిలో లాంచ్ చేసే అవకాశం ఉంది. దీనిని కంప్లీట్ బిల్డ్ యూనిట్ (CBU)గా దిగుమతి చేసుకుంటారు. కాబట్టి దీని ధర ఎక్కువగానే ఉంటుంది. ఇది టయోటా పోర్ట్‌ఫోలియోలో ల్యాండ్ క్రూయిజర్ ఎల్‌సీ300 కింద ఉంటుంది. కాగా ల్యాండ్ రోవర్ డిఫెండర్‌కు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.
టయోటా.. కంపెనీ లాంచ్ చేయనున్న ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో యొక్క స్పెసిఫికేషన్స్ గురించి ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు . అయితే ఇందులో 2.8 లీటర్ ఇంజిన్ పొందనుంది. ఈ కారులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సిగ్నేచర్ మోనికర్‌తో కొత్త స్టీరింగ్ వీల్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, రెండవ మరియు మూడవ వరుసలలో ఏసీ వెంట్స్ మొదలైనవి ఉన్నాయి.