US President Donald Trump Buys Tesla Car: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk), అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బంధం గురించి దాదాపు అందరికీ తెలుసు. నేడు ట్రంప్ అధ్యక్ష స్థానంలో ఉన్నారు అంటే.. దానికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా మస్క్ కృషి చాలా ఉంది. అమెరికా ఎన్నికలు పూర్తయిన తరువాత మస్క్‌కు డీఓజీఈ (DOGE) బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ మధ్య కాలంలో మస్క్ షేర్స్ గణనీయంగా పడిపోవడంతో.. ఆయన సంపద అమాంతం ఆవిరవుతూ ఉంది. ఈ క్రమంలో మస్క్ కోసం ట్రంప్ చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
అమెరికా ఎన్నికల తరువాత మస్క్ సంపద ఏకంగా రూ. 32 లక్షల కోట్లు దాటేసింది. కాగా గత వారం రోజులుగా మస్క్ సంపద 120 బిలియన్ డాలర్లు (రూ. 10 లక్షల కోట్ల కంటే ఎక్కువ) తగ్గింది. ప్రస్తుతం మస్క్ సంపద 324.3 బిలియన్ డాలర్ల వద్ద ఉంది. ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే.. మస్క్ సంపద భారీగా తగ్గిపోయినప్పటికీ.. ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నారు.
మస్క్ సంపద తగ్గడానికి కారణం
ఎలాన్ మస్క్ సంపద భారీగా తగ్గిపోవడానికి కారణం టెస్లా అమ్మకాలు పడిపోవడం అనే తెలుస్తోంది. అమ్మకాలు పడిపోవడంతో.. కంపెనీ షేర్స్ కూడా పడిపోయాయి. గత నెలలో 30 శాతం షేర్స్ పడిపోయాయి. సోమవారం (మార్చి 11) కూడా మస్క్ షేర్స్ 15 శాతం తగ్గాయి. ఈ రోజు 5 శాతం పెరుగుదల నమోదైంది.
డొనాల్డ్ ట్రంప్ కొత్త కారు
ఎలాన్ మస్క్ షేర్స్ గణనీయంగా తగ్గుతున్న తరుణంలో.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఓ కొత్త టెస్లా కారును కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైట్ హౌస్ దగ్గర.. ట్రంప్ కొనుగోలు చేసిన రెడ్ కలర్ ‘మోడల్ ఎక్స్’ (Model X) చూడవచ్చు. మస్క్ యొక్క టెస్లా కంపెనీకి మద్దతుగా నిలబడటానికే ట్రంప్ టెస్లా కారును కొనుగోలు చేశారు.
కారును కొనుగోలు చేసిన తరువాత.. వావ్ ఇది చాలా బాగుందని డ్రైవర్ సీటులోకి వెల్తూ ట్రంప్ ప్రశంసించారు. కో ప్యాసింజర్ సీటులో మస్క్ కూర్చుకున్నాడు. ఈ కారు కోసం 80000 డాలర్లు (రూ. 69.77 లక్షలు) చెల్లించినట్లు ట్రంప్ చెప్పారు. అడిగితే మస్క్ డిస్కౌంట్స్ ఇస్తాడు. డిస్కౌంట్స్ తీసుకుంటే.. ఇతర ప్రయోజనాలు పొందుతున్నట్లు విమర్శలు వస్తాయని అన్నారు.
Also Read: పెట్రోల్, డీజిల్ కార్లు మాయం!.. ఈవీ పాలసీ 2.0 గురించి తెలుసా?
మస్క్ దేశభక్తుడు, ఆయన ఎలాంటి మనిషో నాకు బాగా తెలుసు. ఆయన ఆలోచనలు కూడా గొప్ప పనులను చేస్తాయని ట్రంప్ కొనియాడారు. ప్రస్తుతం ట్రంప్ పాలనలో.. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్మమెంట్ ఎఫిషియన్సీ (DOGE) విభాగంలో మస్క్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో భాగంగా మస్క్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు.. పెద్ద విమర్శలకు దారి తీసింది. దీంతో టెస్లా షేర్స్ అమాంతం పడిపోయాయి.
టెస్లా మోడల్ ఎక్స్
గ్లోబల్ మార్కెట్లో ఎంతోమందికి ఇష్టమైన టెస్లా కార్లలో మోడల్ ఎక్స్ అనేది ఒకటి. ఇది మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి.. అత్యంత సురక్షితమైన భద్రతను అందిస్తుంది. ఈ కారణంగానే దీనిని ఎక్కువమంది ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు. ఇకపోతే.. మస్క్ యొక్క టెస్లా భారతదేశంలో అడుగుపెట్టడానికి సిద్ధమైంది. దీనికోసం డీలర్షిప్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ పూర్తయిన తరువాత టెస్లా కార్లు ఇండియాలో కూడా అందుబాటులో ఉంటాయి. అమ్మకాలు మాత్రమే.. ఉత్పత్తి ఇండియాలో ఉండే అవకాశం లేదు. రాబోయే రోజుల్లో ఉత్పత్తి ఇండియాలో జరుగుతుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
Get in, patriots—we have a country to save.🇺🇸@ElonMusk helps President Trump pick his new @Tesla! pic.twitter.com/VxdKMsOBjW
— The White House (@WhiteHouse) March 11, 2025