HBD Chiranjeevi: కార్ల వినియోగంలో కూడా మెగాస్టారే.. చిరంజీవి గ్యారేజిలోని కార్లు చూశారా?

Megastar Chiranjeevi Expensive Car Collection: ముందుగా పాఠకుల తరపున మరియు ‘మార్థా తెలుగు’ తరపున ”చిరంజీవి” గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఒక్క తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే కాకుండా యావత్ సినీ లోకానికి బాగా పరిచయమున్న పేరు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi). కొణిదెల శివశంకర్ వరప్రసాద్ (చిరంజీవి) ఎంతో కస్టపడి మెగాస్టార్ అయిన తీరు దాదాపు అందరికీ తెలిసిందే. ప్రాణం ఖరీదు అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన చిరంజీవి ఎన్నో గొప్ప రికార్డులను కైవసం చేసుకున్నారు. నేడు తెలుసు సినిమా ఇండస్ట్రీకే పెద్దదిక్కుగా నిలిచారు.

1955 ఆగష్టు 22న జన్మించిన చిరంజీవి.. ఇప్పటికే 150 కంటే ఎక్కువ సినిమాల్లో నటించి ఓ సరికొత్త రికార్డును సృష్టించారు. సినిమా ప్రపంచంలో చిరంజీవి చేసిన కృషికి భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ మరియు పద్మ భూషణ్ అవార్డులతో సత్కరించింది. సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా ఖరీదైన మరియు అన్యదేశ్య కార్లను ఉపయోగించడం కూడా చిరంజీవికి చాలా ఇష్టం.

మెగాస్టార్ కార్ కలెక్షన్ (Megastar Car Collection)
రోల్స్ రాయిస్ ఫాంటమ్ (Rolls Royce Phantom)

చిరంజీవి గ్యారేజిలోని అత్యంత ఖరీదైన మరియు విలాసవంతమైన కారు రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన ఫాంటమ్. ఈ కారు ధర సుమారు రూ. 10 కోట్ల నుంచి రూ. 11 కోట్లు. ఎంతోమంది ప్రముఖులకు ఇష్టమైన ఈ కారును చిరంజీవి కూడా చాలా ముచ్చటపడి కొనుగోలు చేశారు. విలాసవంతమైన డిజైన్, అత్యాధునిక ఫీచర్స్ కలిగిన ఈ రోల్స్ రాయిస్ కారు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇందులో 6.8 లీటర్ వీ12 ఇంజిన్ 460 బీహెచ్‌పీ పవర్ అందిస్తుంది.

టయోటా ల్యాండ్ క్రూయిజర్ (Toyota Land Cruiser)

భారతదేశంలో అత్యంత ఖరీదైన మరియు చాలామంది సెలబ్రిటీలకు ఇష్టమైన కార్లలో టయోటా యొక్క ల్యాండ్ క్రూయిజర్ కూడా ఒకటి. ఈ కారు చిరంజీవి గ్యారేజిలో ఉంది. సుమారు రూ. 1కోటి రూపాయల ఖరీదైన ఈ కారును చిరంజీవి 59వ పుట్టిన రోజు సందర్భంగా రామ్ చరణ్ తేజ్ గిఫ్ట్ ఇచ్చారు. దేశంలోని చాలామంది రాజకీయ ప్రముఖులు ఈ కారును విరివిగా ఉపయోగిస్తున్నారు. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు అత్యంత దృఢంగా ఉంటుంది. ఇది ఆఫ్-రోడింగ్ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది.

మెర్సిడెస్ బెంజ్ జీ63 ఏఎంజీ (Mercedes Benz G63 AMG)

జర్మన్ కార్ల తయారీ సంస్థ అయిన మెర్సిడెస్ బెంజ్ యొక్క జీ63 ఏఎంజీ కారు కూడా మెగాస్టార్ ఉపయోగించే కార్ల జాబితాలో ఒకటని సమాచారం. దీని ధర సుమారు రూ. 2 కోట్లు కంటే ఎక్కువే. ల్యాడర్ ఫ్రేమ్ ఛాసిస్ మీద నిర్మించబడిన ఈ కారు శక్తివంతమైన 5.5 లీటర్ వీ8 ఇంజిన్ పొందుతుంది. తద్వారా ఇది అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. ఎంతోమంది సెలబ్రిటీలకు ఇష్టమైన కార్లలో ఈ జీ63 ఏఎంజీ కూడా ఒకటి.

ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ (Land Rover Range Rover Autobiography)

ఎక్కువమంది సెలబ్రిటీలు ఇష్టపడి కొనుగోలు చేసే కార్ల జాబితాలో చెప్పుకోదగ్గ బ్రాండ్ ల్యాండ్ రోవర్. ఇందులో ఆటోబయోగ్రఫీ మోడల్ చిరంజీవి గ్యారేజిలో ఉంది. దీని ధర రూ. 2.75 కోట్లు అని తెలుస్తోంది. రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ మోడల్ కారు ఇప్పటికే విక్కీ కౌశల్, రణబీర్ కపూర్ వంటి ఎంతోమంది సినీ ప్రముఖుల గ్యారేజిలో ఉంది. దృడంగా కనిపించే ఈ కారు అత్యుత్తమ ఆఫ్-రోడింగ్ కెపాసిటీని కూడా కలిగి ఉంటుంది.

రేంజ్ రోవర్ వోగ్ (Range Rover Vouge)

రూ. 1కోటి కంటే ఎక్కువ ఖరీదైన రేంజ్ రోవర్ వోగ్ కారు కూడా మెగాస్టార్ చిరంజీవి గ్యారేజిలో ఉంది. ఇది చిరంజీవి కార్ కలెక్షన్‌లో మొదటి కారు అని తెలుస్తుంది. కాబట్టి ఈ కారు ప్రస్తుత తరం కంటే కూడా చాలా దృఢమైన కారు అని తెలుస్తోంది. ఇది మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి వాహన వినియోగదారులకు అద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

Don’t Miss: తండ్రీకొడుకుల అరుదైన దృశ్యం.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్

మెగాస్టార్ చిరంజీవి సినీరంగంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న తరువాత రాజకీయ రంగ ప్రవేశం చేశారు. పర్యాటక మంత్రిగా పని చేసిన చిరంజీవి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. సమాజ సేవలో చిరంజీవి తనదైన రీతిలో ముందుకు సాగుతూ ఉంటారు. ఇందులో భాగంగానే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వంటి వాటిని స్థాపించారు.