Woman Shares Heartfelt Post Thanking Parents: బిడ్డ సంతోషం కోసం.. తమ జీవితాలను త్యాగం చేసే గొప్ప వ్యక్తులు కేవలం తల్లిదండ్రులు మాత్రమే. నిస్వార్థమైన ప్రేమతో కంటికిరెప్పలా కాపాడుతుకుంటూ.. అడిగింది కొనిచ్చే తల్లిదండ్రులు కోకొల్లలు. గతంలో మనం చాలా కథనాల్లో.. తల్లిండ్రులు పిల్లలకు ఇష్టమైన గిఫ్ట్స్ ఇచ్చిన సంతోషపెట్టినట్లు తెలుసుకున్నాం. ఇప్పుడు తాజాగా అలాంటి సంఘటనే ఇప్పుడు మరొకటి వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ ఈ కథనంలో తెలుసుకుందాం.
అద్రాజా శివరాజ్ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో గమనిస్తే.. తల్లిదండ్రులు తమ బిడ్డకు (యువతి) హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ గిఫ్ట్ ఇవ్వడం చూడవచ్చు. అమ్మానాన్నలు ఇచ్చిన గిఫ్ట్ చూసి ఆ యువతి తెగ సంతోషపడిపోయింది. తల్లిదండ్రులు.. బిడ్డతో కలిసి కేక్ కట్ చేసిన తరువాత.. కారు కీ తీసుకుని అందిస్తారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
జీవితంలో కొన్ని క్షణాలు గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. నాకు ఇది అలాంటి క్షణమే. నా తల్లిదండ్రులు అతిపెద్ద గిఫ్ట్ ఇచ్చి నన్ను ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు ఇది నా సొంత ఐ20 ఎన్ల లైన్ ఎన్8. ఈ కారును చూసిన క్షణం నా హృదయం ఎలా వేగంగా కొట్టుకుంటుందో.. నా కళ్ళు ఎలా ఉప్పొంగిపోయాయో.. నాకు ఇప్పటికీ గుర్తుంది.
ఎప్పుడూ నా సంతోషాన్నే, వారి సంతోషంగా భావిస్తూ.. నా ఎదుగుదలను చూడటానికి వారు ఎంత కష్టపడ్డారో.. నా కలలు నిజం చేయడానికి, వారు ఎన్ని కలలను వాయిదా వేసుకున్నారో నాకు తెలుసు. ఇది కేవలం కారు కాదు, వారికి (నా తలిదండ్రులకు) నాపై ఉన్న ప్రేమ, నమ్మకం.. నాకు అన్నింటిలోనూ ఉత్తమమైన వాటిని ఇవ్వడానికి వారు అంతులేని ప్రయత్నాల ప్రతిబింబం అని ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఆ యువతి వెల్లడించింది.
హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కారక జాబితాలో హ్యుందాయ్ కంపెనీకి చెందిన ‘ఐ20 ఎన్ లైన్’ (Hyundai i20 N Line) ఒకటి. ఈ కారు ధరలు రూ. 9.99 లక్షల నుంచి రూ. 12.56 లక్షల (అన్ని ధరలు, ఎక్స్ షోరూమ్) వరకు ఉన్నాయి. అయితే ఇక్కడ యువతికి.. ఆమె తల్లిందండ్రులు ఇచ్చిన కారు ఎన్8 వేరియంట్, కాబట్టి దీని ధర రూ. 12.41 లక్షలు (ఎక్స్ షోరూమ్) అని తెలుస్తుంది.
చూడటానికి స్టాండర్డ్ ఐ20 మాదిరిగా కనిపించే.. ఎన్ లైన్ అప్డేటెడ్ గ్రిల్, అల్లాయ్ వీల్స్, ఇన్సర్ట్స్ వంటివి పొందుతుంది. అంతే కాకుండా బ్లాక్ అవుట్ హెడ్‌ల్యాంప్, ఫెండర్లపై ఎన్ లైన్ బ్యాడ్జ్, రెడ్ కలర్ ఇన్సర్ట్లతో గ్లోస్ బ్లాక్ లోయర్ లిప్, ఫాగ్ లాంప్స్ చుట్టూ డార్క్ క్రోమ్ గార్నిష్, సైడ్ స్టిక్కరింగ్, నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేక్స్, రెడ్ కలర్ బ్రేక్ కాలిపర్స్ కూడా ఈ కారులో గమనించవచ్చు.
ఇంటీరియర్ కూడా ఎక్కువ భాగం రెడ్ కలర్ హైలెట్స్ చూడవచ్చు. ఏసీ వెంట్స్, ఏసీ బటన్స్, డోర్ ట్రిమ్స్, గేర్ నాబ్ వంటివాటి మీద రెడ్ కలర్ యాక్సెంట్స్ కనిపిస్తాయి. సీట్లు ఎరుపు రంగు పైపింగ్, స్టిచింగ్‌తో పాటు.. ఎన్ బ్యాడ్జ్ కలిగి ఉంటాయి. ఇవి కాకూండా టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి కూడా ఇందులో ఉన్నాయి.
Also Read: సరికొత్త 2025 స్కోడా కొడియాక్ ఇదే: ఈ కారు రేటెంతో తెలుసా?
హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్.. 1.0 లీటర్ త్రీ సిలిండర్ టర్బో ఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 120 పీఎస్ పవర్, 172 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. కాబట్టి ఇది అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. వాహన వినియోగదారులకు అత్యుత్తమ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.