తరాలు మారినా.. చరిత్రలో నిలిచిపోయే బైకులు ఇవే!.. ఒక్కొక్కటి ఓ అద్బుతం

Popular Iconic Motorcycles in Indian Market: ఆధునిక భారతదేశంలో కవాసకి, డుకాటీ, ట్రయంఫ్, హయబుసా మొదలైన బైకుల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కానీ ఒకప్పుడు మార్కెట్లో ఈ బైకులు లేదు, అసలు ఈ పేర్లే ఎవరికీ తెలియదు. కానీ మన దేశంలో ఒకప్పుడు అమ్మకాల్లో చరిత్ర సృష్టించిన బైకులు చాలానే ఉన్నాయి. ఈ కథనంలో అలాంటి బైకులు ఏవి? వాటి హిస్టరీ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350

ఈ రోజు కుర్రకారు నుంచి పెద్దవారి వరకు అందరూ ఇష్టపడే బైక్ బ్రాండ్లలో ఒకటి ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ (Royal Enfield). నిజానికి ఈ కంపెనీకి దశాబ్దాల చరిత్ర ఉంది. 1948 నుంచి కంపెనీ బుల్లెట్ 350 బైకును తయారు చేసి విక్రయిస్తోంది. ఇది ఒకప్పుడు భారతీయ మార్కెట్లో సంచలన అమ్మకాలు పొంది, ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇచ్చింది. ప్రస్తుతం క్లాసిక్ 350 పేరు మీద కంపెనీ బైకులను విక్రయిస్తోంది. అయితే ఇప్పటికి కూడా భారతీయ రోడ్ల మీద అక్కడక్కడా బుల్లెట్ బైకులు కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఈ బైకులను ఇప్పటికీ ఇష్టపడే వారు ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది.

జావా 350 ట్విన్

ఇండియాలో జావా బ్రాండ్ గురించి తెలిసిన చాలామందికి కూడా ఈ 350 ట్విన్ బైకుల గురించి తెలియకపోవచ్చు. నిజానికి కంపెనీ ఈ బైకులను భారతదేశంలో తయారు చేయలేదు. దీనికి బదులుగా దిగుమతి చేసుకుని ఇండియన్ మార్కెట్లో విక్రయించేది. డిజైన్ పరంగా అద్భుతంగా ఉండే ఈ బైకులు ఓ రాయల్ లుక్ అందించేవి. వీటి పర్ఫామెన్స్ మాత్రం వేరే లెవెల్ అనే చెప్పాలి. ప్రస్తుతం జావా కంపెనీ ఆధునిక ఉత్పత్తులను మార్కెట్లో లాంచ్ చేసిన మంచి ఆదరణ పొందుతోంది.

యమహా ఆర్‌డీ 350

అత్యంత స్టైలిష్ బైకులను మార్కెట్లో విక్రయిస్తున్న యమహా.. 1983 నుంచి 1989 వరకు ‘ఆర్‌డీ 350’ బైకును తయారు చేసింది. దీన్నే రాజ్‌దూత్ 350 అని కూడా పిలుస్తారు. చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ.. పనితీరు మాత్రం అద్భుతంగా ఉండేది ఈ కారణంగానే భారతీయ విఫణిలో అమ్మకాల్లో ఓ సంచలనం సృష్టించింది. ట్విన్ సిలిండర్ 2 స్ట్రోకర్ కలిగిన ఈ బైక్ అత్యంత వేగవంతమైన బైకుగా అప్పట్లో రికార్డ్ క్రియేట్ చేసింది. కొన్ని సంవత్సరాలు తిరుగులేని సేల్స్ కైవసం చేసుకున్న ఈ బైక్ ఆ తరువాత కాలగర్భంలో కలిసి పోయింది. కానీ ఇప్పుడు కూడా అక్కడక్కడా చాలా అరుదుగా ఈ బైకులు దర్శనమిస్తూ ఉంటాయి.

యమహా ఆర్ఎక్స్100

1996 కంటే ముందు మార్కెట్లో ఓ మెరుపు మెరిసిన యమహా కంపెనీ యొక్క ‘ఆర్ఎక్స్100’ ఉత్పత్తి ఆ తరువాత పూర్తిగా నిలిచిపోయింది. అయితే ఆర్ఎక్స్100 సినిమా వచ్చిన తరువాత ఈ బైక్ మళ్ళీ తెరమీదకు వచ్చింది. మరుగున పడిన బైకులను కూడా బయటకు తీసి మోడిఫైడ్ చేయించి మరీ వినియోగిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే దశాబ్దాల క్రితం మాత్రమే కాదు 21వ శతాబ్దంలో కూడా ఈ బైక్ క్రేజు ఏ మాత్రం తగ్గలేదని స్పష్టంగా తెలుస్తోంది.

భారతీయ మార్కెట్లో సుమారు 27 సంవత్సరాలు తిరుగులేని అమ్మకాలను పొందుతూ.. ఇండియన్ మార్కెట్‌ను శాసించిన ఈ బైక్ ఉత్పత్తి ఎప్పుడో నిలిచిపోయింది. కొంతమంది కస్టమర్లు ఈ బైకును మళ్ళీ ఉపయోగించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ బైక్ ఉత్పత్తిని మళ్ళీ ప్రారంభించే అవకాశం ఉందనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలు వెల్లడి కాలేదు.

హీరో హోండా సీడీ 100

ఈ రోజు కూడా ఎక్కువ మైలేజ్ అందించే బైక్ కొనాలనేవారు తప్పకుండా హీరో హోండా బైకునే ఎంపిక చేసుకుంటారు. మైలేజ్ రారాజుగా కీర్తించబడని ఈ బైక్ భారతదేశంలో దశాబ్దాల చరిత్రను మూటగట్టుకున్న పాపులర్ మోడల్. ఇది కమ్యూటర్ క్లాస్ 4 స్ట్రోక్ మోటార్‌సైకిల్. ఈ బైక్ మార్కెట్లో ప్రారంభమైనప్పుడు ‘ఫిల్ ఇట్, షట్ ఇట్, ఫర్గెట్ ఇట్’ అనే నినాదంతో వచ్చింది. ఆ తరువాత ఎంతోమంది బైక్ ప్రేమికులను ఆకర్శించడంలో సక్సెస్ సాధించింది. ఎప్పుడో దశాబ్దాల క్రితం మార్కెట్లో లాంచ్ అయిన ఈ బైక్ ఈ రోజుకు కూడా భారతీయుల గుండెల్లో నిలిచిపోయింది.

బజాజ్ పల్సర్

దేశీయ విఫణిలో ఎక్కువ సంఖ్యలో అమ్ముడవుతున్న బజాజ్ పల్సర్ గురించి అందరికి బాగా తెలుసు. కానీ ఈ బైక్ సుమారు 10 సంవత్సరాల కంటే ముందే ఈ బైక్ ఉత్పత్తి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆధునిక అప్డేట్స్ పొందుతున్న ఈ బైక్ యొక్క అమ్మకాలు మాత్రం అస్సలు తగ్గడం లేదు. అద్భుతమైన డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఈ బైక్.. ఈ రోజు కూడా విజయవంతమైన బైకుల జాబితాలో ఒకటిగా ఉంది.

హీరో హోండా సీబీజెడ్

భారతదేశంలో ఒకప్పుడు మంచి అమ్మకాలు పొందిన ‘హీరో హోండా సీబీజెడ్’ అతి తక్కువ కాలంలోనే ఆదరణ కోల్పోయింది. దీంతో ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. కానీ ఈ రోజుకి కూడా హీరో హోండా సీబీజెడ్ అంటే చాలామందికి తెలుసు. ఉన్న కొన్ని రోజుల్లోనే వాహన ప్రేమికుల హృదయాల్లో నిలిచిపోయింది. నిజానికి 150 సీసీ విభాగానికి పునాది వేసిన చరిత్ర హీరో హోండా సీబీజెడ్ సొంతమనే చెప్పాలి. అంతే కాకుండా డిస్క్ బ్రేక్, ఎలక్ట్రిక్ స్టార్ట్ కలిగిం మొదటి బైక్ కూడా ఇదే కావడం గమనార్హం. మైలేజ్ పరంగా కూడా ఇది గొప్ప బైక్.

యమహా వైజెడ్ఎఫ్-ఆర్15

లిక్సిడ్ కూలింగ్ ప్రోగ్రామ్డ్ ఫ్యూయెల్ ఇంజెక్షన్, స్పోర్ట్ డిజైన్ కలిగి ఎక్కువ మంది బైక్ ప్రేమికుల మనసు దోచిన ఈ బైక్ అధునాతన ఫీచర్లతో ప్రారంభమైంది. ఇది ఆటోమొబైల్ చరిత్రకు సరికొత్త నాంది పలికింది. అద్భుతమైన స్టైలింగ్ పొందిన ఈ బైక్ ఇప్పటి వరకు కూడా విజయవంతమైన బైక్ మోడళ్లలో ఒకటిగా ఉంది. ప్రస్తుతం ఈ బైక్ యొక్క నాల్గవ తరం జనరేషన్ సాగుతున్నట్లు తెలుస్తోంది.

కేటీఎమ్ 390 డ్యూక్

ఎక్కువమంది యువకులకు ఇష్టమైన బైక్ బ్రాండ్‌గా ప్రసిద్ధి చెందిన కేటీఎమ్.. ఎప్పటికప్పుడు కొత్త బైకులను లాంచ్ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే మార్కెట్లో అడుగుపెట్టిన బైకులలో 390 డ్యూక్ కూడా ఒకటి. ఒక్క చూపుతోనే చూపరులను కట్టిపడేసే డిజైన్ ఈ బైక్ సొంతం. ఇది రైడర్లకు అద్భుతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇప్పుడు కూడా మార్కెట్లో ఇది గొప్ప అమాంకాలను పొందుతూ ముందుకు దూసుకెళ్తోంది.

Don’t Miss: ఇవి కదా ఎలక్ట్రిక్ బైక్స్ అంటే!.. ఇండియాలో లాంచ్ ఎప్పుడో తెలుసా?

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350

ఆధునిక భారతదేశంలో రాయల్ బండిగా ప్రసిద్ధి చెందిన బైక్ ఏదైనా ఉంది అంటే.. అది ఖచ్చితంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 అనే చెప్పాలి. దశాబ్దాల చరిత్ర కలిగిన కంపెనీ రూపొందించిన ఈ బైక్ ఎంతోమంది బైక్ ప్రేమికులను ఆకట్టుకుంటోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా కంపెనీ ఎప్పటికప్పుడు తమ ఉత్పత్తులను అప్డేట్ చేస్తూ.. తన ఉనికిని చాటుకోవడం మాత్రమే కాకుండా.. ప్రత్యర్థులకు కూడా గట్టి పోటీ ఇస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350.. కంపెనీ ఎదుగుదలకు నిలువెత్తు నిదర్శనం అనే చెప్పాలి.