Yamaha New RayZR Street Rally 125 Fi Launched in India: ఇండియన్ మార్కెట్లో యమహా టూ వీలర్లకు ఉన్న క్రేజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బైక్ ప్రేమికులను ఒక్క చూపుతోనే కట్టిపడేసే డిజైన్ కలిగిన బైకులను, స్కూటర్లను లాంచ్ చేస్తున్న యమహా దేశీయ విఫణిలో మరో స్కూటర్ లాంచ్ చేసింది. ఈ స్కూటర్ ఇప్పటి వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న దాదాపు అన్ని స్కూటర్ల కంటే కూడా భిన్నంగా ఉందని స్పష్టంగా తెలుస్తోంది.
యమహా కంపెనీ దేశీయ మార్కెట్లో లాంచ్ చేసిన కొత్త స్కూటర్ ‘రేజెడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ 125 ఎఫ్ఐ’ (RayZR Street Rally 125 Fi)). ఇది చాలా వరకు అప్డేటెడ్ డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. సరికొత్త డిజైన్ కలిగిన ఈ స్కూటర్ దాని పాత మోడల్ కంటే రూ. 2000 ఎక్కువ ధర వద్ద లభిస్తోంది. కాబట్టి ఈ స్కూటర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే..
ప్రైస్
యమహా లాంచ్ చేసిన కొత్త రేజెడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ 125 ఎఫ్ఐ ధర రూ. 98130 (ఎక్స్ షోరూమ్). అంటే దీని ధర దాని స్టాండర్డ్ వెర్షన్ కంటే కూడా రూ. 2000 ఎక్కువ. ధర కొంచెం ఎక్కువైనా.. దానికి తగిన ఫీచర్స్ మాత్రం ఇందులో తప్పకుండా పొందవచ్చు.
డిజైన్ మరియు ఫీచర్స్
ప్రారంభంలో చెప్పుకున్నట్లుగానే కొత్త యమహా రేజెడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ 125 ఎఫ్ఐ స్కూటర్ మంచి డిజైన్ పొందుతుంది. ఇందులో ఎల్ఈడీ డీఆర్ఎల్ చూడవచ్చు. ఇది నెంబర్ ప్లేట్ పైభాగంలో కనిపిస్తుంది. కలర్ స్కీమ్ కూడా కొంత అప్డేట్ చేయబడి ఉంది. కాబట్టి ఇది ఇప్పుడు సైబర్ గ్రీన్ అనే కొత్త రంగులో లభిస్తుంది. ఇది మాత్రమే కాకుండా ఐస్ ఫ్లూ వెర్మిలియన్, స్పెషల్ బ్లూ మరియు బ్లాక్ మ్యాట్ బ్లాక్ కలర్స్ ఆప్షన్లలో లభిస్తుంది.
ఇక ఫీచర్స్ విషయానికి వస్తే.. రేజెడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ 125 ఎఫ్ఐ స్కూటర్ ఆన్సర్ బ్యాక్ ఫీచర్ పొందుతుంది. రద్దీగా ఉన్న ప్రదేశాల్లో స్కూటర్‌ను గుర్తించడంలో ఇది ఉపయోగపడుతుంది. ఇది ఆధునిక కాలంలో చాలా గొప్పగా ఉపయోగపడే ఫీచర్ అనే చెప్పాలి. దీనిని స్మార్ట్‌ఫోన్‌లోని వై కనెక్ట్ యాప్ ద్వారా యాక్సెస్ చెయ్యవచ్చు.
ఇంజిన్ వివరాలు
అప్డేటెడ్ డిజైన్ మరియు కొత్త ఫీచర్స్ కలిగిన యమహా రేజెడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ 125 ఎఫ్ఐ స్కూటర్ అదే ఇంజిన్ పొందుతుంది. కాబట్టి ఇది 125 సీసీ పెట్రోల్ ఇంజిన్ ద్వారా 5000 ఆర్పీఎం వద్ద 10.2 న్యూటన్ మీటర్ టార్క్ మరియు 6500 ఆర్పీఎం వద్ద 8.2 బీహెచ్‌పీ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.
కొత్త యమహా రేజెడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ స్కూటర్ 21 లీటర్ల అండర్ సీట్ స్టోరేజిని పొందుతుంది. ఈ స్కూటర్ యొక్క ముందు భాగంలో టెలిస్కోపిక్ పోర్క్ మరియు వెనుక మోనో షాక్ సస్పెన్షన్ ఉన్నాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ముందు భాగంలో ఫ్రంట్ డిస్క్, వెనుక డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి. ఇవన్నీ చాలా అద్భుతంగా పనిచేస్తాయి.
ప్రత్యర్థులు
ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త యమహా రేజెడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ స్కూటర్.. ఇప్పటికే ఉత్తమ అమ్మకాలను పొందుతున్న హోండా డియో 125, సుజుకి అవెనిస్ 125 మరియు టీవీఎస్ ఎన్‌టార్క్ 125 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి ఇది అమ్మకాల పరంగా కొంత పోటీ ఇవ్వాల్సి ఉంటుంది.
దసరా, దీపావళి పండుగలు మొదలవుతున్నాయి. ఈ సమయంలో కొత్త బైక్ కొనాలనుకునేవారికి యమహా యొక్క కొత్త రేజెడ్ఆర్ స్కూటర్ తప్పకుండా మంచి ఎంపిక అవుతుందని భావిస్తున్నాము. అయితే ఇది ఎలాంటి అమ్మకాలను పొందుతుంది? ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తుందా? లేదా? అనే విషయాలు త్వరలోనే తెలుస్తాయి.
Don’t Miss: ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై ఇంకోలెక్క!.. వచ్చేసింది నెక్సాన్ సీఎన్‌జీ
మార్కెట్లోని యమహా బైకులు
భారతదేశంలో యమహా బైకులు మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీ దేశీయ మార్కెట్లో యమహా ఆర్3, యమహా ఆర్15ఎం, యమహా ఎమ్‌టీ 03, యమహా ఆర్15 వీ4, యమహా ఆర్15ఎస్, యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్, యమహా ఎఫ్‌జెడ్-ఎఫ్ఐ వంటి బైకులు మాత్రమే కాకుండా ఏరోక్స్ 155, రేజెడ్ఆర్ 125 ఎఫ్ఐ, ఫాసినో 125 ఎఫ్ఐ మొదలైన స్కూటర్లు ఉన్నాయి.