వైయస్‌ఆర్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం: జగన్ భావోద్వేగ పోస్ట్ వైరల్

YSRCP Party Formation Day Jagan Tweet Viral: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్‌ఆర్‌సీపీ (YSRCP) పార్టీ ఆవిర్భవించి.. 15 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ‘వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి’ (YS Jagan Mohan Reddy) భావోద్వేగానికి గురయ్యారు. ఓ సందేశాన్ని సైతం తన అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. దీనికి సంబందించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..

నాన్నగారు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ ‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి’ ఆశయ సాధన కోసం ఆవిర్భవించిన వైయస్‌ఆర్‌సీపీ పార్టీ నేటికీ 15 సంవత్సరాలు పూర్తయింది. పార్టీ ఆవిర్భవించిన రోజు నుంచి ఇప్పటి వరకు.. పార్టీని తమ భుజస్కందాలపై మోస్తున్న కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, నాయకులందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.

నా ఒక్కడితో మొదలై.. ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని, ప్రజల ఆశీస్సులతో బలమైన రాజకీయ పార్టీగా అవతరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. నీటికి 15వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఇన్ని సంవత్సరాల కాలం ఈ పార్టీ.. నిరంతరం ప్రజలతోనే, ప్రజల కోసం ఉంది. అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో.. దేశ రాజకీయ చరిత్రలోనే ఏ పార్టీ చేయని సంక్షేమ కార్యక్రమాలు చేయగలిగాము. రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించాము. ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం, సుస్థిరమైన ఆర్ధిక వృద్ధిని సాధించడం, దేశంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా ముందుకు సాగింది.

విలువలతో.. విశ్వసనీయతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచినా వైయస్‌ఆర్‌సీపీ పార్టీ పార్టీ పట్ల, నా పట్ల నమ్మకంతో.. నాతో నడుస్తున్న పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మరియు శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు అంటూ.. వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ.. తమ సపోర్ట్ తెలియజేస్తున్నారు.

రాబోయే రోజుల్లో..

వైఎస్ జగన్.. పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పడంతో పాటు, ఈ రోజు తన తండ్రికి పుష్పాంజలి ఘటించిన ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ కార్యక్రమానికి ఎంతోమంది కార్యకర్తలు, పార్టీ పెద్దలు, ఎంఎల్ఏలు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. వారినందరిని ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. రాబోయే రోజుల్లో మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. కార్యకర్తలు రాష్ట్రంలో పలు చోట్ల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తూ.. తమ అభిమానం చాటుకుంటున్నారు.

Also Read: పెట్రోల్, డీజిల్ కార్లు మాయం!.. ఈవీ పాలసీ 2.0 గురించి తెలుసా?

పార్టీ ఆవిర్భావం

2009లో హెలికాఫ్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసువులు బాసారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అండగా నిలబడలేదు. ఆ తరువాత ప్రజలకోసం యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఆవిర్భవించింది. ఆ తరువాత ఓదార్పు యాత్ర ప్రారంభించిన జగన్ మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. దేశంలోనే 5వ అతిపెద్ద రాజకీయ పార్టీగా వైఎస్ఆర్సీపీ అవతరించింది. అయితే గత ఎన్నికల్లో పార్టీ 11 సీట్లకు మాత్రమేపరిమితమైంది. కాగా వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా.. ఇప్పటి నుంచే పార్టీ నాయకులకు.. వైయస్‌ఆర్‌సీపీ అధినేత జగన్ దిశా నిర్దేశం చేస్తున్నారు.

Leave a Comment