2024 Force Gurkha Launched In India: భారతదేశంలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫోర్స్ కంపెనీకి చెందిన గూర్ఖా ఎట్టకేలకు 5 డోర్స్ రూపంలో అధికారికంగా లాంచ్ అయింది. సంస్థ లాంచ్ చేసిన ఈ కొత్త కారు ధరలు, డిజైన్ మరియు ఫీచర్స్ వంటి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ధర, బుకింగ్స్ మరియు డెలివరీలు
దేశీయ విఫణిలో అడుగుపెట్టిన ఫోర్స్ గూర్ఖా 5 డోర్ వెర్షన్ రూ. 18 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఈ ఆఫ్ రోడర్ కోసం కస్టమర్లు రూ. 25000 మొత్తం చెల్లించి ముందస్తు బుకింగ్స్ ప్రారంభించింది. అయితే డెలివరీలు ఈ నెల మధ్యలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే అంతకంటే ముందు కంపెనీ ఈ కార్లను ఈ వారంలోనే డీలర్‌లకు పంపించనుంది. ఆ తరువాత టెస్ట్ డ్రైవ్స్ ప్రారంభమవుతాయి.
అయితే కంపెనీ యొక్క అప్డేటెడ్ 3 డోర్ ఫోర్స్ గూర్ఖా ధర రూ. 16.75 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఈ లెక్కన 3 డోర్స్ గూర్ఖా కంటే 5 డోర్స్ గూర్ఖా ధర రూ. 1.25 లక్షలు ఎక్కువని తెలుస్తోంది. 5 డోర్స్ వెర్షన్.. 3 డోర్స్ వెర్షన్ కంటే కూడా పెద్దదిగా ఉంటుంది. అయితే చూడటానికి రెండూ ఒకేలాగా ఉన్నట్లు తెలుస్తోంది.
అప్డేటెడ్ 3 డోర్స్ గూర్ఖా కంటే.. మహీంద్రా థార్ AX ఆప్షనల్ 4 వీల్ డ్రైవ్ ధర రూ. 1.75 లక్షలు తక్కువ. అయితే ప్రస్తుతం ఫోర్స్ గూర్ఖా 5 డోర్ వెర్షన్‌కు దేశీయ మార్కెట్లో ప్రధాన ప్రత్యర్థులు లేదు. అయితే రాబోయే రోజుల్లో మహీంద్రా థార్ 5 డోర్ వెర్షన్ లాంచ్ అయితే.. గూర్ఖా 5 డోర్ కారుకు ప్రత్యర్థిగా ఉంటుంది.
డిజైన్ మరియు కలర్ ఆప్షన్స్
2024 ఫోర్స్ గూర్ఖాలో గమనించదగ్గ అప్డేట్ రివైజ్డ్ హానీకూంబ్ నోస్ ముందు భాగంలో గ్రిల్. ఇది కాకుండా ఇందులో చెప్పుకోదగ్గ మార్పులు పెద్దగా లేదనే తెలుస్తోంది. అంతే కాకుండా ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు, 5 స్పోక్ 18 ఇంచెస్ డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్, చుక్కలతో కూడిన ఎల్ఈడీ డీఆర్ఎల్‍లతో రౌండ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ ఉన్నాయి. కార్నరింగ్ ఫంక్షన్, స్నార్కెల్, సైడ్ స్టెప్స్ మరియు రూప్ ర్యాక్‌తో కూడిన ఎల్ఈడీ ఫాగ్‌ల్యాంప్‌లు ఉన్నాయి.
కొత్త ఫోర్స్ గూర్ఖా 5 డోర్స్ వెర్షన్ పొడవు మరియు వెడల్పు కొంత ఎక్కువగా ఉండటం చూడవచ్చు. అప్డేటెడ్ గూర్ఖా మోడల్స్ రెడ్, గ్రీన్, వైట్ మరియు బ్లాక్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇవన్నీ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కాబట్టి కస్టమర్లు ఇందులో తమకు నచ్చిన కలర్ ఆప్షన్ ఎంచుకోవచ్చు.
ఫీచర్స్
కొత్త 2024 ఫోర్స్ గూర్ఖా ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం ఉంటుంది. ఇది ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఇందులో టైల్డ్ అండ్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్‌వీఎమ్, ఆటో స్టార్ట్ అండ్ స్టాప్ సిస్టం, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ షిఫ్ట్ ఆన్ ఫ్లై ఫోర్ వీల్ డ్రైవ్ సెలెక్టర్ వంటివి ఇందులో ఉన్నాయి.
2024 ఫోర్స్ గూర్ఖా మంచి డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా అధునాతన సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. కాబట్టి ఇందులో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, రియర్ కెమెరా మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం వంటివి ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇవి ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తాయి.
Don’t Miss: మారుతి ప్రియులకు గుడ్ న్యూస్.. మొదలైన కొత్త ‘స్విఫ్ట్’ బుకింగ్స్
ఇంజిన్
కొత్త ఫోర్స్ గూర్ఖా మెర్సిడెస్ బెంజ్ నుంచి తీసుకున్న 2.6 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 138 Bhp పవర్ మరియు 320 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇందులో ఎకో మరియు పవర్ అనే రెండు డ్రైవ్ మోడ్‌లు ఉన్నాయి. ఇది థార్ కంటే శక్తివంతమైనదని తెలుస్తోంది.