2024 Hero Destini 125 Unveiled: ఆధునిక భారతదేశంలో ఆటోమొబైల్ రంగం సరికొత్త రంగులను పులుముకుంటోంది. ఈ నేపథ్యంలో కొత్త లేదా అప్డేటెడ్ వాహనాలు మార్కెట్లో లాంచ్ అవుతున్నాయి. ఇందులో భాగంగానే ‘హీరో డెస్టినీ 125’ స్పెషల్ ఎడిషన్స్ మరియు ఇతర వేరియంట్స్ అన్నీ కూడా అప్డేట్స్ అందుకున్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం..
వేరియంట్స్
సుమారు ఆరు సంవత్సరాల తరువాత హీరో డెస్టినీ 125 స్కూటర్.. ప్రస్తుత తరానికి కావలసిన విధంగా అప్డేట్ అయింది. అయితే ధరలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంటుంది. 2024 డెస్టినీ 125 స్కూటర్ వీఎక్స్, కాస్ట్ డిస్క్, జెడ్ఎక్స్ మరియు జెడ్ఎక్స్ ప్లస్ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది.
కలర్ ఆప్షన్స్
2024 హీరో డెస్టినీ స్కూటర్ యొక్క బేస్ వేరియంట్ మూడు కలర్ ఆప్షన్లలో మాత్రమే లభిస్తుంది. అవి ఎటర్నల్ వైట్, రీగల్ బ్లాక్ మరియు గ్రూవీ రెడ్ కలర్స్. హై-ఎండ్ మోడల్స్ అయిన జెడ్ఎక్స్ మరియు జెడ్ఎక్స్ ప్లస్ వేరియంట్స్ మిస్టిక్ మెజెంటా (పింక్), కాస్మిక్ బ్లూ, ఎటర్నల్ వైట్, మరియు రీగల్ బ్లాక్ అనే నాలుగు రంగుల్లో లభిస్తుంది. ఇక్కడ గమనించాల్సిన మరో అంశం ఏమిటంటే.. జెడ్ఎక్స్ మరియు జెడ్ఎక్స్ ప్లస్ స్కూటర్‌లలోని చాలా భాగాలు కాపర్ టోన్డ్ క్రోమ్ హైలెట్స్ చూడవచ్చు.
డిజైన్
కొత్త హీరో డెస్టినీ 125 స్కూటర్ సిగ్నేచర్ హెచ్-షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్ మరియు టెయిల్ లాంప్ వంటివి పొందుతుంది. ఇండికేటర్స్ ఫ్రంట్ ఆప్రాన్‌లో ఉంటాయి. ఫ్యూయెల్ ట్యాంక్ అనేది సీటు కింద ఉంటుంది. పరిమాణం పరంగా కూడా హీరో డెస్టినీ 125 స్కూటర్ కొంత పెద్దగా మారింది. సీటు 785 మిమీ, వీల్‌బేస్ 57 మిమీ వరకు విస్తరించబడింది. అండర్ సీటు స్టోరేజ్ 19 లీటర్లు కాగా.. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 5 లీటర్లు మాత్రమే.
ఫీచర్స్
2024 హీరో డెస్టినీ 125 యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే.. ఈ స్కూటర్ యొక్క బేస్ వేరియంట్ ప్రొజెక్టర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, డీఆర్ఎల్, ఫ్రంట్ డ్రమ్ బ్రేక్, టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్, చిన్న ఎల్సీడీ ఇన్‌సెట్‌తో కూడిన అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు బూట్ లాంప్ వంటివి పొందుతుంది. ఈ వేరియంట్ యొక్క వెనుక బ్రేక్ లివర్ మీద పార్కింగ్ బ్రేక్ లాక్ కూడా ఉంది. అయితే ఈ ఫీచర్ హై వేరియంట్‌లో లేదు.
ఇక హై-ఎండ్ వేరియంట్స్ జెడ్ఎక్స్ మరియు జెడ్ఎక్స్ ప్లస్ వేరియంట్స్ విషయానికి వస్తే.. ఇందులో ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ స్పీడోమీటర్, టర్న్ బై టర్న్ న్యావిగేషన్, డిస్‌ప్లే కోడం 5 స్టెప్ బ్రైట్‌నెస్ కంట్రోల్.. హీరో యొక్క ఐ3ఎస్ స్టార్ట్ / స్టాప్ టెక్నాలజీ, బ్యాక్‌రెస్ట్ వంటి మరెన్నో ఫీచర్స్ లభిస్తాయి.
పవర్‌ట్రెయిన్
హీరో డెస్టినీ 125 యొక్క పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే.. ఈ స్కూటర్ అదే 124.6 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 9 Bhp పవర్ మరియు 10.4 Nm టార్క్ అందిస్తుంది. అప్డేటెడ్ మోడల్ 59 కిమీ / లీటర్ మైలేజ్ అందిస్తుందని సమాచారం. దీనికి సంబంధించిన వివరాలు లాంచ్ తరువాత తెలుస్తాయి. అయితే ఇది రోజువారీ వినియోగానికి చాలా అనుకూలంగా ఉంటుందని మాత్రం స్పష్టమవుతోంది.
ధరలు
ఇప్పుడు ఖచ్చితంగా తెలుసుకోవలసిన అంశం ధరలు. 2024 హీరో డెస్టినీ 125 స్కూటర్ యొక్క ఎల్ఎక్స్ వేరియంట్ ధర రూ. 80048మరియు ఎక్స్‌టెక్ వేరియంట్ ధర రూ. 86538 వరకు ఉంటుందని అంచనా. మొత్తం మీద త్వరలో లాంచ్ కావడానికి సిద్దమవుతున్న సెకండ్ జనరేషన్ హీరో డెస్టినీ 125 స్కూటర్ దాని మునుపటి మోడల్ కంటే కూడా కొంత ఎక్కువ ధర వద్ద లభిస్తుందని సమాచారం. అయితే ధరలు అధికారికంగా లాంచ్ సమయంలో వెల్లడవుతాయి.
Don’t Miss: గణేష్ చతుర్థి ఆఫర్: ఈ స్కూటర్‌లపై భారీ డిస్కౌంట్స్.. ఇంకా ప్రయోజనాలెన్నో
ప్రత్యర్థులు
దేశీయ మార్కెట్లో లాంచ్ కానున్న కొత్త 2024 హీరో డెస్టినీ 125 స్కూటర్.. ఇప్పటికే అమ్మకానికి ఉన్న హోండా యాక్టివా 125, టీవీఎస్ జుపీటర్ 125 మరియు సుజుకి యాక్సెస్ 125 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అమ్మకాల పరంగా డెస్టినీ 125 స్కూటర్ కొంత పోటీ ఎదుర్కోవాల్సి వస్తుందని భావిస్తున్నాము.