Maruti Swift Launched in India: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మారుతి సుజుకి నాల్గవ తరం ‘మారుతి స్విఫ్ట్’ భారతీయ మార్కెట్లో అరంగేట్రం చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ అప్డేటెడ్ హ్యాచ్‌బ్యాక్ ధర ఎంత? ఫీచర్స్ ఎలా ఉన్నాయి. ఇంజిన్ డీటైల్స్ మరియు మైలేజ్ వంటి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
వేరియంట్స్ & ధరలు
కొత్త మారుతి స్విఫ్ట్ మొత్తం ఐదు వేరియంట్లలో లభిస్తుంది. అవి LXi, VXi, VXi (O), ZXi మరియు ZXi+ వేరియంట్లు. స్విఫ్ట్ బేస్ వేరియంట్ ధర రూ. 6.49 లక్షలు కాగా టాప్ వేరియంట్ ధర రూ. 9.50 లక్షలు (ఎక్స్ షోరూమ్). అయితే డ్యూయెల్ టోన్ కలర్ వేరియంట్ ఎంచుకుంటే రూ. 15000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి టాప్ వేరియంట్ కొనుగోలు కోసం రూ. 9.65 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. మారుతి సుజుకి ధరలు దాని అవుట్‌గోయింగ్ కంటే రూ. 25000 నుంచి రూ. 37000 ఎక్కువ.
ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న టాటా టియాగో (రూ. 5.65 లక్షలు) మరియు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ (రూ. 5.92 లక్షలు) ప్రారంభ ధరల కంటే కూడా కొత్త స్విఫ్ట్ ధర కొంత ఎక్కువ. అయితే ఇందులో అప్డేటెడ్ ఫీచర్స్ ఉండటం గమనించవచ్చు. స్విఫ్ట్ ధర కొంత ఎక్కువైనప్పటికీ మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము.
డిజైన్
కొత్త మారుతి స్విఫ్ట్ చూడటానికి దాదాపు దాని అవుట్‌గోయింగ్ మోడల్‌తో సమానంగా ఉంటుంది. కానీ ఇందులో కొన్ని కొత్త అప్డేట్స్ స్పష్టంగా కనిపిస్తాయి. ఇందులో కొత్త ఫ్రంట్ బంపర్, రీడిజైన్ చేయబడిన రేడియేటర్ గ్రిల్, అప్డేటెడ్ హెడ్‌లైట్స్ మరియు ఫాగ్ లైట్స్, రియర్ డోర్ హ్యాండిల్స్, కొత్త అల్లవ్ వీల్ డిజైన్, సీ ఆకారంలో ఉన్న కొత్త టెయిల్ ల్యాంప్స్ ఇందులో గమనించవచ్చు.
పరిమాణం పరంగా కూడా కొత్త మారుతి స్విఫ్ట్ చాలా అనుకూలంగా ఉంటుంది. స్విఫ్ట్ వీల్‌బేస్ 2450 మిమీ వద్ద దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉన్నప్పటికీ.. పొడవు మరియు వెడల్పు కొంత పెరిగి ఉండటం చూడవచ్చు. ఇది వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.
కలర్ ఆప్షన్స్
దేశీయ విఫణిలో లాంచ్ అయిన మారుతి స్విఫ్ట్ మొత్తం 9 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో ఆరు సింగిల్ టోన్ కలర్స్ (లస్టర్ బ్లూ, నావెల్ ఆరెంజ్, సిజ్లింగ్ రెడ్, పెర్ల్ ఆర్కిటిక్ వైట్, మాగ్మా గ్రే మరియు స్ప్లెండిడ్ సిల్వర్).. మూడు డ్యూయెల్ టోన్ ఆప్షన్స్ (మిడ్‌నైట్ బ్లాక్ రూఫ్‌తో లస్టర్ బ్లూ, మిడ్‌నైట్ బ్లాక్ రూఫ్‌తో సిజ్లింగ్ రెడ్, మిడ్‌నైట్ బ్లాక్ రూఫ్‌తో పెర్ల్ ఆర్కిటిక్ వైట్). ఇవన్నీ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.
ఫీచర్స్
నాల్గవ తరం మారుతి స్విఫ్ట్ ఇంటీరియర్ బాలెనొ మరియు ఫ్రాంక్స్‌లను పోలి ఉంటుంది. అయితే క్యాబిన్ దాని అవుట్‌గోయింగ్ మోడల్ కంటే ప్రీమియమ్‌గా కనిపిస్తుంది. ఇందులో 9 ఇంచెస్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ ఉంటుంది. 3 స్పోక్ స్టీరింగ్ వీల్ చూడవచ్చు. అంతే కాకుండా ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, వైర్‌లెస్ ఛార్జర్ హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, ఎలక్ట్రిక్ ORVM మరియు ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.
ఇంజిన్
2024 మారుతి స్విఫ్ట్ జెడ్ సిరీస్ 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 5700 rpm వద్ద 80 Bhp పవర్ మరియు 4300 rpm వద్ద 112 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.
మారుతి స్విఫ్ట్ కారులోని ఇంజిన్ దాని మునుపటి మోడల్ కంటే కూడా ఎక్కువ ఇంధన సామర్థ్యాన్ని అందిస్తాయి. స్విఫ్ట్ మాన్యువల్ వేరియంట్ 24.80 కిమీ/లీ మైలేజ్ అందిస్తే.. ఆటోమాటిక్ వేరియంట్ 25.75 కిమీ/లీ మైలేజ్ అందిస్తుందని ARAI ద్వారా ధృవీకరించబడింది.
Don’t Miss: రోల్స్ రాయిస్ కల్లినన్ ఇప్పుడు మరింత కొత్తగా.. పూర్తి వివరాలు
సేఫ్టీ ఫీచర్స్
కొత్త మారుతి స్విఫ్ట్ మంచి డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాకుండా అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, అన్ని సీట్లకు సీట్‌బెల్ట్ రిమైండర్‌లతో కూడిన 3 పాయింట్ సీట్‌బెల్ట్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, రియర్ వ్యూ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.