2024 TVS Apache RR 310 Launched in India: భారతదేశంలో ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థగా విరాజిల్లుతున్న ‘టీవీఎస్ మోటార్’ (TVS Motor) కంపెనీ ఎట్టకేలకు తన 2024 అపాచీ ఆర్ఆర్ 310 (2024 Apache RR 310) బైక్ లాంచ్ చేసింది. ఇది దాని మునుపటి అన్ని మోడల్స్ కంటే కూడా కొంత అప్డేటెడ్ డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది.
ప్రైస్
కొత్త టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 బైక్ ప్రారంభా ధర రూ. 2.75 లక్షలు.. కాగా టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 2.97 లక్షలు (ధరలు ఎక్స్ షోరూమ్, ఇండియా). ఈ బైక్ కొనుగోలు చేసేవారు ‘బిల్డ్ టు ఆర్డర్’ (BTO) ప్రోగ్రాం కింద డైనమిక్, డైనమిక్ ప్రో మరియు రేస్ రెపికా ఎంచుకోవచ్చు. ఇవి బైకును మరింత హుందాగా చేస్తాయి. బైక్ ధరలు మీరు ఎంచుకునే రంగును బట్టి మారుతూ ఉంటాయి.
- రెడ్ (క్విక్‌షిఫ్టర్ లేకుండా): రూ. 275000
- రెడ్ (క్విక్‌షిఫ్టర్‌తో): రూ. 292000
- బాంబర్ గ్రే: రూ. 297000
బీటీఓ కిట్ ధరలు
- డైనమిక్ కిట్: రూ. 18000
- డైనమిక్ ప్రో కిట్: రూ. 16000
- రేస్ రెప్లికా కలర్: రూ. 7000
డిజైన్
ప్రారంభంలో చెప్పుకున్నట్లుగానే.. కొత్త టీవీఎస్ అపాచీ ఆర్ఆర్310 బైక్ స్పోర్టీ లుక్ పొందుతుంది. ఏరో డైనమిక్ వింగ్‌లెట్స్, మెకానికల్స్ వంటి వాటిని బహిర్గతం చేసే పారదర్శక క్లచ్ కవర్స్ పొందుతుంది. ఫ్రంట్ డిజైన్ దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగానే అనిపిస్తుంది. మొత్తం మీద డిజైన్ బైక్ ప్రేమికులను ఒక్క చూపుతో ఆకర్శించేలా ఉంది.
ఫీచర్స్
2024 అపాచీ ఆర్ఆర్ 310 బైక్ టీఎఫ్‌టీ కలర్ ఇన్‌స్ట్రుమెంటేషన్ స్క్రీన్ పొందుతుంది. నాలుగు రైడింగ్ మోడ్స్ కలిగిన ఈ బైక్ టర్న్ బై టర్న్ నావిగేషన్‌తో బ్లూటూత్ కనెక్టివిటీని కూడా పొందుతుంది. అంతే కాకుండా క్రూయిజ్ కంట్రోల్స్, రేస్ ట్యూన్డ్ లీనియర్ స్టెబిలిటీ కంట్రోల్ (RT-DSE) మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం కూడా ఇందులో ఉన్నాయి.
కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్ మరియు విలీ కంట్రోల్‌తో రైడర్ ఎయిడ్‌లను మరింత మెరుగుపరుస్తుంది. క్విక్ గేర్ షిఫ్ట్ కోసం బై-డైరెక్షన్ క్విక్‌షిఫ్టర్ ఎంచుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ బైక్ రైడర్లకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.
ఇంజిన్ వివరాలు
2024 టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 బైక్ 312.2 సీసీ సింగిల్ సిలిండర్ రివర్స్ ఇంక్లైన్డ్ లిక్విడ్ కూల్డ్ మోటార్ ఉంటుంది.ఇది 37.48 Bhp పవర్ మరియు 29 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ సిక్స్ స్పీడ్ మెష్ గేర్‌బాక్స్‌తో స్లిప్పర్ క్లచ్‌తో జతచేయబడుతుంది. ఈ బైక్ గంటకు 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతం కావడానికి 2.82 సెకన్ల సమయం మాత్రమే పడుతుంది. అయితే 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం కావడానికి పట్టే సమయం 6.74 సెకన్లు. దీని టాప్ స్పీడ్ గంటకు 164 కిమీ (స్పోర్ట్ అండ్ ట్రాక్ మోడ్‌లో)
కొత్త అపాచీ ఆర్ఆర్ 310 బైక్ యొక్క ముందు భాగంలో USD ఫోర్క్ సెటప్, వెనుక ఫ్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ పొందుతుంది. కస్టమర్లు బీటీఓ ఎంచుకోవడం ద్వారా అడ్జస్టబుల్ సెటప్ ఎంచుకోవచ్చు. ఈ బైక్ యొక్క రెండు చివర్లలో డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ కూడా ప్రామాణికంగా లభిస్తుంది.
బుకింగ్స్ అండ్ డెలివరీలు
2024 టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 బైక్ కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కాబట్టి ఆసక్తికలిగిన కస్టమర్లు కంపెనీ అధీకృత డీలర్షిప్ వద్ద లేకుండా అధికారిక వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. అయితే ఎప్పుడు ప్రారంభమవుతాయి అనేది తెలియాల్సి ఉంది.
Don’t Miss: దుమ్ములేపే దమ్ముతో వచ్చేసింది.. ‘హ్యుందాయ్ వెన్యూ అడ్వెంచర్ ఎడిషన్’: ధర ఎంతంటే..
ప్రత్యర్థులు
దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త బైకులు లాంచ్ అవుతూనే ఉన్నాయి. కాబట్టి అమ్మకాల పరంగా ఏ కొత్త బైక్ అయిన కొంత పోటీ ఎదుర్కోక తప్పదు. కాబట్టి టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 బైక్ కూడా.. ఇప్పటికే దేశీయ మార్కెట్లో అమ్మకానికి ఉన్న కేటీఎమ్ ఆర్సీ390, ఏప్రిలియా ఆర్ఎస్ 457, యమహా వైజెడ్ఎఫ్ ఆర్3, కవాసకి నింజా 300, కీవే కే300ఆర్ మరియు బీఎండబ్ల్యూ జీ 310 ఆర్ఆర్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే ఈ కొత్త అపాచీ బైక్ అమ్మకాల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుస్తోంది.