2025 ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ లాంచ్: ఇప్పుడు సరికొత్త అప్‌డేట్‌తో..

ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్.. అప్డేటెడ్ ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ లాంచ్ చేసింది. ఇది చూడటానికి సాధారణ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. ఒక గొప్ప అప్డేట్ పొందింది. కాబట్టి ధరల్లో కూడా వ్యత్యాసం ఏర్పడింది. ఈ లేటెస్ట్ 2025 బైక్ గురించి మరిన్ని వివరాలు.. ఇక్కడ మీకోసం!

వేరియంట్స్.. ధరలు

హీరో మోటోకార్ప్ ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ బైక్ మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అయితే టాప్ ఎండ్ వేరియంట్ మాత్రమే ప్రధాన అప్డేట్ డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ పొందుతుంది. కాబట్టి దీని ధర రూ. 1.04 లక్షలు (ఎక్స్ షోరూమ్).

  • ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్: రూ. 1,40,500
  • ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ ఏబీఎస్ సింగిల్ సీట్: రూ. 92,500
  • ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ ఏబీఎస్ ఓబీడీ2బీ: రూ. 92,500
  • ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ ఐబీఎస్ ఓబీడీ2బీ: రూ. 89000 (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్).

ప్రధాన అప్డేట్ & ఫీచర్స్

కొత్త హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ బైక్.. ప్రధానంగా డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ పొందుతుంది. ఇది క్రూయిజ్ కంట్రోల్, రైడ్ బై వైర్ థ్రోటిల్‌తో పాటు.. మూడు రైడింగ్ మోడ్స్ పొందుతుంది. ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీడీ డిస్‌ప్లే కూడా ఇందులో కనిపిస్తుంది. మొత్తం మీద ఇది ప్రీమియం బైకు మాదిరిగా కనిపిస్తుంది. కాబట్టి రైడర్లను ఆకట్టుకోవడంలో ఇది సక్సెస్ సాదిస్తుందని భావిస్తున్నాము.

కలర్ ఆప్షన్స్ & ఇంజిన్ వివరాలు

బ్లాక్ పెర్ల్ రెడ్, బ్లాక్ మ్యాట్ షాడో గ్రే, బ్లాక్ లీఫ్ గ్రీన్ అనే మూడు కొత్త రంగుల్లో లభించే ఈ బైక్.. 124.7 సీసీ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 11.4 బీహెచ్పీ పవర్, 10.5 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఈ బైక్ 5.9 సెకన్లలో 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇది 66 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.

మెకానికల్ అప్డేట్స్

2025 హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ బైక్.. ఛాసిస్ సెటప్ ఎలాంటి మార్పు పొందలేదు. కాగా ఈ బైక్ ముందు భాగంలో 37 మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో డ్యూయెల్ హైడ్రాలిక్ షాక్ పొందుతుంది. బ్రేకింగ్ అప్డేట్ పొందింది. కాబట్టి ఇది 276 మిమీ ఫ్రంట్ డిస్క్, వెనుక 130 మిమీ డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి. అంతే కాకుండా.. ఈ బైక్ ముందు భాగంలో 90/90, వెనుక భాగంలో 120/80 ట్యూబ్‌లెస్ టైర్‌లతో 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 125 అప్డేట్ బైక్.. 794 మిమీ ఎత్తైన సీటును పొందుతుంది. గ్రౌండ్ క్లియరెన్స్ 180 మిమీ. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్లు. అంటే ఒకసారి ఫుల్ ట్యాంక్ చేస్తే.. సుమారు 600 కిమీ కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది తెలుస్తోంది. ఈ బైక్ కర్బ్ వెయిట్ 136 కేజీలు మాత్రమే. కాబట్టి రైడింగ్ చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 2025 ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ బైక్ చెప్పుకోదగ్గ స్థాయిలో పెద్ద అప్డేట్స్ పొందలేదు. కానీ డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ ప్రవేశపెట్టడం చాలా గొప్ప విషయం. ఇది రైడర్ల భద్రతను నిర్థారిస్తుంది. రోడ్డుపై బైక్ స్కిడ్ అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.