Category: Andhra Pradesh

  • ఏపీలో 20 లక్షల ఉద్యోగాలు: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

    ఏపీలో 20 లక్షల ఉద్యోగాలు: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

    Andhra Pradesh Job Creation: రాష్ట్ర సమగ్రాభివృద్ధికి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడం అత్యంత కీలకమని భావిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆ దిశగా పటిష్టమైన అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా, రాబోయే కాలంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు వీలుగా యువతకు అవసరమైన నైపుణ్య శిక్షణ అందించడానికి తక్షణమే తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ బృహత్తర ప్రణాళికకు సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

    ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం: సాంకేతికత, నైపుణ్యం ప్రధానం

    రాష్ట్ర సచివాలయంలో నైపుణ్యాభివృద్ధి, ఉన్నత విద్యా శాఖలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పలు కీలక సూచనలు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో, దీనికి అనుగుణంగా ఉన్నత విద్యలో కూడా సమూల మార్పులు తీసుకురావాలని నైపుణ్యాభివృద్ధి శాఖకు స్పష్టం చేశారు.

    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత జాబ్ పోర్టల్

    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పరిజ్ఞానాన్ని ఉపయోగించి, రాష్ట్రం, దేశం మరియు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయో తెలుసుకుని, ఆ సమాచారంతో ఒక ప్రత్యేకమైన జాబ్ పోర్టల్‌ను రూపొందించాలని సీఎం సూచించారు. ఈ సమాచారం రాష్ట్రంలోని యువతకు సులభంగా అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. యువత తమ వివరాలను ఈ పోర్టల్‌లో నమోదు చేసుకోగానే, వారి నైపుణ్యాలకు తగిన రెజ్యూమే (Resume) ఆటోమేటిక్‌గా రూపొందేలా పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

    పెట్టుబడులు – ఉద్యోగావకాశాలు – నైపుణ్యాభివృద్ధి ఆవశ్యకత

    రాష్ట్రంలో ఇప్పటికే 9.5 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు వచ్చినట్లు, తద్వారా 8.5 లక్షల ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. అయితే, మారుతున్న కంపెనీల అవసరాలకు అనుగుణంగా యువత కూడా తమ నైపుణ్యాలను నిరంతరం అభివృద్ధి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని నొక్కిచెప్పారు. ఈ దిశగా సంబంధిత శాఖ యువతకు నాణ్యమైన శిక్షణను అందించాలని ఆదేశించారు.

    నైపుణ్యాభివృద్ధి శాఖ పాత్ర – ప్రపంచస్థాయి అవకాశాలపై దృష్టి

    రాష్ట్రంలోని యువతకు ప్రపంచ స్థాయిలో పోటీపడి, ఉత్తమ ఉద్యోగాలు సాధించేలా అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన పూర్తి బాధ్యత నైపుణ్యాభివృద్ధి శాఖదే అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. జర్మనీ, జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో వైద్య, ఐటీ, నిర్మాణ రంగాలతో పాటు ఇతర కీలక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ యువత తమ సత్తా చాటాలని ఆయన ఆకాంక్షించారు.

    విదేశీ భాషా నైపుణ్యం – తప్పనిసరి

    ప్రపంచవ్యాప్త అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే, కేవలం ఇంగ్లీష్ భాషా నైపుణ్యం మాత్రమే సరిపోదని, ఇతర ముఖ్యమైన విదేశీ భాషలను కూడా నేర్చుకోవాలని సీఎం సూచించారు. ఇందుకు అనుగుణంగా, వివిధ దేశాల భాషలను బోధించడానికి అవసరమైన శిక్షణా కార్యక్రమాలను రూపొందించి, అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

    నారా లోకేష్ నివేదిక: నైపుణ్యాభివృద్ధిలో ప్రగతి

    ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్, రాష్ట్రంలో క్లస్టర్ల వారీగా నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో మొత్తం ఐదు క్లస్టర్లలో సమగ్ర నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించడానికి పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. పాలిటెక్నిక్ మరియు ఐటీఐ విద్యార్థులకు ఆయా పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి ప్రముఖ పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు లోకేష్ తెలిపారు.

    ఇప్పటివరకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 1,164 ఉద్యోగమేళాలు నిర్వహించినట్లు, వీటి ద్వారా 61,991 మంది యువతీయువకులు ఉద్యోగాలు పొందినట్లు మంత్రి వివరించారు. అంతే కాకుండా, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ పొందిన వారిలో 74,834 మందికి వివిధ సంస్థల్లో ఉద్యోగాలు లభించాయని తెలిపారు.

    ‘స్వర్ణాంధ్ర 2047’ విజన్ – భవిష్యత్ కార్యాచరణ

    రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘స్వర్ణాంధ్ర 2047’ విజన్ ప్రణాళికలో భాగంగా, రాష్ట్రంలోని యువతకు సమగ్ర శిక్షణ అందించాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు. ఆరవ తరగతి నుంచి పీజీ స్థాయి వరకు విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను పాఠ్యాంశాలలో భాగంగా చేయాలని సూచించారు. విద్యాసంస్థలతో పరిశ్రమలను అనుసంధానం చేసి, ఆచరణాత్మక నైపుణ్య శిక్షణపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు.

    ఈ ఏడాది ప్రతి నియోజకవర్గంలో కనీసం 1,500 మందికి ఉద్యోగాలు లభించేలా అధికారులు కృషి చేయాలని సీఎం చంద్రబాబు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ లక్ష్య సాధనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.

  • ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాల జోరు: తల్లికి వందనంపై కీలక అప్‌డేట్

    ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాల జోరు: తల్లికి వందనంపై కీలక అప్‌డేట్

    Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తమదైన రీతిలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూనే.. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటోంది. ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటిన్, మెగా డీఎస్సీ, దీపం – 2 వంటివి ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసింది. కాగా మిగిలిన పథకాలు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయనేది ఈ కథనంలో వివరంగా చూద్దాం.

    ప్రజలకు అండగా ప్రభుత్వ హామీలు: ఉచిత బస్సు ప్రయాణం మరియు తల్లికి వందనం

    2025 ఆగష్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు, విద్యార్థుల తల్లులకు అండగా నిలిచే “తల్లికి వందనం” పథకం గురించి కీలక ప్రకటన వెలువడింది. పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి శ్రీ నారా లోకేష్ (Nara Lokesh) స్పష్టం చేశారు.

    తల్లికి వందనం పథకం: పూర్తి వివరాలు

    కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తికానున్న సందర్భంగా, “తల్లికి వందనం” పథకంపై మంత్రి నారా లోకేష్ మరిన్ని వివరాలు వెల్లడించారు. ఈ పథకం కింద, అర్హులైన ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో రూ. 15,000 జమ చేయనున్నారు. వేసవి సెలవులు ముగిసిన అనంతరం ఈ ఆర్థిక సహాయం తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని ఆయన తెలిపారు.

    లబ్ధిదారుల సంఖ్య మరియు ప్రభుత్వ కేటాయింపులు

    ఎన్నికల సమయంలో ఇచ్చిన “సూపర్ 6” హామీల అమలుకు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆమోదముద్ర వేశారు. ఇందులో భాగంగా, ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నా, వారందరికీ “తల్లికి వందనం” పథకం వర్తిస్తుంది. ఈ ఏడాది, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 67,27,164 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో మొత్తం రూ. 8,745 కోట్లను ప్రభుత్వం జమ చేయనుంది. ఒకటవ తరగతిలో ప్రవేశం పొందిన విద్యార్థుల నుండి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదివే విద్యార్థుల వరకు ఈ పథకం ప్రయోజనాలు అందుతాయి.

    విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి మరిన్ని పథకాలు

    “తల్లికి వందనం” పథకంతో పాటు, విద్యార్థుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం మరికొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను అమలు చేస్తోంది. వీటిలో “డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం” మరియు “సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర” పథకం ద్వారా యూనిఫామ్, పుస్తకాలు, బూట్లు వంటివి అందించడం జరుగుతుంది. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ పథకాలు తెలియజేస్తున్నాయి.

    తల్లికి వందనం పథకానికి అర్హత మరియు ముఖ్యమైన సూచనలు

    ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే వారు ఈ క్రింది ముఖ్యమైన సూచనలను గమనించాలి:

    • హౌస్ డేటా బేస్: తల్లులు మరియు వారి పిల్లల వివరాలు తప్పనిసరిగా హౌస్ డేటా బేస్‌లో నమోదు అయి ఉండాలి.
    • ఈకేవైసీ (eKYC): హౌస్ హోల్డ్ మొత్తానికి ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసి ఉండాలి.
    • ఆధార్ లింకింగ్: బ్యాంకు ఖాతాకు ఆధార్ నెంబర్ తప్పనిసరిగా అనుసంధానం చేసి ఉండాలి.
    • NPCI లింకింగ్: బ్యాంకు ఖాతాకు NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) మ్యాపింగ్ కూడా అవసరం.

    గమనిక: పైన తెలిపిన ప్రక్రియలన్నీ ఇప్పటికే పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏదైనా ప్రక్రియ పెండింగ్‌లో ఉంటే, వెంటనే పూర్తి చేసుకోవడం మంచిది. ఈకేవైసీ పూర్తి కాకపోయినా లేదా బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ లేకపోయినా “తల్లికి వందనం” పథకం ప్రయోజనాలు అందకపోవచ్చు. కావున, అర్హులైన లబ్ధిదారులు ఈ విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి.

  • 10వేల మందికి ఏఐ నైపుణ్య శిక్షణ: ఎన్విడియాతో ఒప్పందం

    10వేల మందికి ఏఐ నైపుణ్య శిక్షణ: ఎన్విడియాతో ఒప్పందం

    AP Signs MoU with NVIDIA For AI: ఈ రోజు టెక్నాలజీ అంటే.. ముందుగా వినిపిస్తున్న పేరు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్). ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో AI టెక్నాలజీ గణనీయంగా అభివృద్ధి చెందుతోంది. అన్ని రంగాల్లోనూ ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. అలాంటి టెక్నాలజీని రాష్ట్రంలో (ఆంధ్రప్రదేశ్) కూడా ప్రవేశపెట్టాలని.. ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగానే ఏఐ యూనివర్సిటీకి ఎన్వీడియా కంపెనీ సహకారం అందించడానికి ముందుకు వచ్చింది.

    రాష్ట్రంలో ఏఐ నైపుణ్యాభివృద్ధికి ఎన్విడియాతో కీలక ఒప్పందం

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్రంలోని సుమారు 10వేలమంది విద్యార్థులకు ఏఐలో శిక్షణ ఇవ్వడానికి, మరో 500 స్టార్టప్‌ల అభివృద్ధికి ఎన్వీడియా కంపెనీతో శుక్రవారం ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ఉండవల్లిలోని నివాసంలో విద్యాశాఖా మంత్రి ‘నారా లోకేష్’ సమక్షంలో ఉన్నత విద్యాశాఖ అధికారులు, కంపెనీ ప్రతినిధుల సమక్షంలో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు.

    ఎన్విడియా సహకారం – మంత్రి నారా లోకేష్ చొరవ

    రాష్ట్రంలోని సుమారు 10వేలమంది విద్యార్థులకు ఏఐలో ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు.. ఏఐ యూనివర్సిటీ అభివృద్ధికి కూడా ఎన్వీడియా తన సహకారం అందించనుంది. అక్టోబర్ 2024లో మంత్రి నారా లోకేష్ ముంబైలో ఎన్వీడియా సీఈఓ ‘జెన్సన్ హుయాంగ్’ను కలిశారు. ఆ సమయంలో ఏపీలోని అమరావతిలో ఏర్పాటు చేయనున్న ఏఐ యూనివర్సిటీకి సహకారం అందించాలని కోరారు. లోకేష్ ప్రతిపాదనకు హుయాంగ్ సానుకూలంగా స్పందించారు. ఆ తరువాత ఇప్పటికే ఎన్వీడియా కంపెనీతో ఒప్పందం జరిగింది.

    ఏపీని ఏఐ రీసెర్చ్ హబ్‌గా మార్చే ప్రభుత్వ లక్ష్యం

    భారతదేశంలో ఏపీని ఏఐ రీసర్చ్ హబ్ చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే దిగ్గజ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఒప్పందం వల్ల రాష్ట్రంలోని ఇంజినీరింగ్ విద్యార్థులకు ఏఐ మీద శిక్షణ ఇవ్వనున్నారు.

    ప్రభుత్వ మద్దతు మరియు వనరులు

    ఏఐ యూనివర్సిటీకి కావాల్సిన పరికరాలు (కంప్యూటింగ్ వనరులు, సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్స్ మరియు హార్డ్‌వేర్ సామర్త్యలు) ప్రభుత్వం అందిస్తుంది. అంతే కాకుండా.. ప్రభుత్వమే విద్యార్థులకు పరిశోధనావకాశాలను, ఉద్యోగావకాశాలను కల్పించనుంది.

    ఒప్పంద కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు

    రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం కార్యక్రమంలో పాల్గొన్నారు:

    • మంత్రి నారా లోకేష్
    • ఎన్వీడియా సౌత్ ఇండియా ఎండీ దూపర్
    • గణేష్ మహబాల
    • ఉన్నత విద్యా కార్యదర్శి
    • ఉన్నత విద్యామండలి చైర్మన్ మధుమూర్తి

    ఏఐ టెక్నాలజీ: ప్రపంచవ్యాప్త ప్రభావం మరియు భవిష్యత్ దిశ

    ఒక్క భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని చాలా దేశాల్లో దిగ్గజ కంపెనీలు సైతం ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాయి. ఈ రోజు భారతదేశం ఏఐ టెక్నాలజీలో వేగంగా ముందుకు సాగుతోంది. ఈ కారణంగానే.. పలు కంపెనీలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీ మరిన్ని రంగాలకు విస్తరిస్తుందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు.

    వివిధ రంగాల్లో ఏఐ అనువర్తనాలు, ఉద్యోగాలపై ప్రభావం

    ఏఐ టెక్నాలజీ ఒక్క ఐటీ రంగంలో మాత్రమే కాకుండా.. ఎడ్యుకేషన్, మీడియా, టెలి కమ్యూనికేషన్ మరియు ఆటోమొబైల్ రంగాల్లో కూడా విస్తరించి ఉంది. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయని చాలామంది గతంలోనూ.. ఇప్పుడు కూడా భయపడుతున్నారు. అయితే ఏఐ వల్ల ఉద్యోగాలు పోవు, ఏఐ టెక్నాలజీ పనిని వేగవంతం చేయడానికి పనికొస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే ఉద్యోగులు లేదా ఉద్యోగార్థులు మారుతున్న ప్రపంచంలో.. వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని నేర్చుకోవడం ఉత్తమం.

  • సాగరతీరంలో యోగా.. హాజరుకానున్న మోదీ: జూన్ 21 నుంచి..

    సాగరతీరంలో యోగా.. హాజరుకానున్న మోదీ: జూన్ 21 నుంచి..

    Yogandra 2025: ప్రపంచ దేశాలకు భారతదేశం గురువు అని ఎన్నో గ్రంధాలు పేర్కొన్నాయి. సంస్కృతి, సంప్రదాయాలను మాత్రమే కాకుండా, యోగ వంటి గొప్ప విధానాలతో భాసిల్లుతున్న భారత్, గొప్ప తాత్విక వేత్తలకు, గురువులకు నిలయంగా భాసిల్లుతోంది. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న యోగాను దేశం మొత్తం అవలంబించేలా ప్రధాని మోదీ చర్య తీసుకున్నారు. ఈ మార్గంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా నడవడానికి సిద్ధమయ్యారు. రాబోయే యోగ దినోత్సవాన్ని కనీవినీ ఎరుగని విధంగా నిర్వహించడానికి కంకణం కట్టుకున్నారు.

    యోగాంధ్ర 2025: నెల రోజుల యోగా మహోత్సవం

    జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నెల రోజులపాటు (జూన్ 21 నుంచి) నిరవహించే ఈ కార్యక్రమాన్ని ‘యోగాంధ్ర 2025’ (Yogandra 2025) పేరుతో చేపడతామని ఆయన అన్నారు. యోగా దినోత్సవం నాడు ప్రధానమంత్రి పాల్గొనే ఈ కార్యక్రమానికి ఐదు లక్షల మంది హాజరవుతారని ఆయన అన్నారు. ఈ ఏడాది జరిగే యోగా దినోత్సవాన్ని ‘యోగా ఫర్ వన్ ఎర్త్.. వన్ హెల్త్’ నినాదంతో, ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను చెరిపేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

    విశాఖలో భారీ యోగా ప్రదర్శన: లక్షలాది మంది భాగస్వామ్యం

    విశాఖ సాగరతీరంలోని ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు లక్షలాదిమంది యోగాసనాలు వేయనున్నారు. దీనికి ప్రముఖ యోగ గురువులు హాజరవుతారు. వీరందరిని సీఎం చంద్రబాబు స్వయంగా ఆహ్వానించనున్నట్లు పేర్కొన్నారు. విశాఖలో మాత్రమే కాకుండా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కూడా యోగా నిర్వహించడానికి కావలసిన ఏర్పాట్లు చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు తెలియజేసారు.

    పది లక్షల మందికి యోగా శిక్షణ, పోటీలు

    జూన్ 21 నుంచి నిర్వహించనున్న నెల రోజుల యోగా కార్యక్రమాల్లో భాగంగానే సుమారు 10 లక్షల మందికి యోగా నేర్పించడమే కాకుండా, వారికి సర్టిఫికెట్స్ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. వీరందరినీ యోగా దినోత్సవం రోజున రాష్ట్రంలో జరిగే కార్యక్రమాలకు నాయకత్వం వహించేలా చేస్తామని సీఎం అన్నారు. నెలరోజుల పాటు యోగాకు సంబంధించిన పాటలు, వ్యాసరచన, చిత్రలేఖనం వంటి పోటీలు నిర్వహించి, విశాఖలో జరిగే కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు.

    విద్యా వ్యవస్థలో, దైనందిన జీవితంలో యోగా

    వేసవి సెలవులు ముగిసిన తరువాత జూన్ 21 వరకు ఉదయం ఒక గంటసేపు పిల్లలకు యోగా తరగతులు బోధించాలని సీఎం చంద్రబాబు చెప్పారు. రాబోయే రోజుల్లో యోగాను పాఠ్యపుస్తకాల్లో కూడా చేర్చనున్నట్లు ఆయన అన్నారు. అంతే కాకుండా రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలు, పార్యటక స్థలాల్లో కూడా యోగా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పెద్ద హోటళ్లలో కూడా యోగా కోసం స్థలాన్ని కేటాయించేలా ప్రోత్సహించాలని ఆయన అన్నారు.

    యోగా ప్రాముఖ్యత – ప్రధాని మోదీ చొరవ

    భారతదేశంలో యోగాకు ఎనలేని చరిత్ర ఉన్నప్పటికీ, దేశ ప్రధాని నరేంద్ర మోదీ వల్ల వెలుగులోకి వచ్చింది. యోగా అనేది ఒక కులానికి లేదా మతానికి మాత్రమే పరిమితం కాదు. యోగా అనేది సైన్స్, మనిషి జీవితంలో యోగా ఒక భాగమైనప్పుడే ఆరోగ్యం సాధ్యమవుతుంది. మోదీ ప్రతి ఏటా యోగా దినోత్సవం రోజు తానే స్వయంగా యోగా చేస్తూ, ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి 2014లో ప్రకటించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు యోగా దినోత్సవం జరుగుతూనే ఉంది.

  • మహిళలకు శుభవార్త: ఫ్రీ బస్ సర్వీస్ & తల్లికి వందనం ఎప్పుడంటే?

    మహిళలకు శుభవార్త: ఫ్రీ బస్ సర్వీస్ & తల్లికి వందనం ఎప్పుడంటే?

    Free Bus Service in Andhra Pradesh: ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలను అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం వంటి పథకాల అమలుకు సంబంధించిన విషయాలను కర్నూలులో జరిగిన ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.

    ‘సూపర్ సిక్స్’ హామీలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు

    కర్నూలు వేదికగా జరిగిన ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు కీలక హామీల అమలుపై స్పష్టత ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని ఆయన పునరుద్ఘాటించారు.

    మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటినుంచి?

    మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి మాట్లాడుతూ.. 2025 ఆగష్టు 15 (స్వాతంత్య్ర దినోత్సవం) నుంచి రాష్ట్రంలోని అందరి మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇది మహిళా సాధికారతకు, వారి ఆర్థిక స్వేచ్ఛకు దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

    తల్లికి వందనం పథకం అమలు

    అంతే కాకుండా.. వేసివి సెలవులు పూర్తయిన తరువాత, అంటే వచ్చే అకడమిక్ ఇయర్ ప్రారంభమయ్యే సమయానికి తల్లికి వందనం పథకం కింద.. ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ డబ్బు వేస్తామని అన్నారు. తల్లుల ప్రోత్సాహంతో విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరాలన్నదే ఈ పథకం లక్ష్యమని తెలిపారు.

    చెత్త రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు

    అక్టోబర్ 2 నాటికి చెత్త రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించాలని చంద్రబాబు పేర్కొన్నారు. జపాన్ వంటి దేశాల్లో రోడ్డుపై చెత్తవేయడాన్ని అవమానంగా భావిస్తారని, ఎక్కడైనా చెత్త కనిపిస్తే.. దాన్ని చెత్తబుట్టలో వేస్తారని ఆయన అన్నారు. ప్రజలందరూ చెత్త రహిత రాష్ట్రం కోసం తమవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇంట్లోని తడి చెత్తను మిద్దె తోటలకు ఉపయోగించుకోవాలని సూచించారు.

    ఇతర ముఖ్య సంక్షేమ పథకాలు మరియు హామీలు

    దీపం 2 పథకం: నేరుగా ఖాతాల్లోకి నగదు

    దీపం 2 కింద ఉచిత సిలిండర్ల పథకంలో భాగంగా నాలుగు నెలలకు ఒకసారి నేరుగా ఖాతాల్లోనే డబ్బు జమ చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇది పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని ఆయన అన్నారు.

    రాయలసీమ అభివృద్ధి – ఉద్యానవన పంటల ప్రోత్సాహం

    రాయల సీమను రతనాల సీమగా మార్చే బాధ్యత మాదని అన్నారు. ఉద్యానవన పంటలను ప్రోత్సహించడానికి కావలసిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. దీని ద్వారా రైతుల ఆదాయం పెరుగుతుందని, ప్రాంతీయ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.

    పేదలకు ఉచిత విద్యుత్ మరియు సౌర విద్యుత్

    పేదలకు ఉచిత కరెంట్ అందించడంతో పాటు.. సౌర విద్యుత్ ప్లాంట్స్ ఏర్పాటుకు సహాయం చేస్తున్నామని పేర్కొన్నారు. ఇది పర్యావరణ హితమైన ఇంధన వాడకాన్ని ప్రోత్సహిస్తుందని తెలిపారు.

    ఉచిత బస్సు ప్రయాణం – వివరాలు

    ఆగష్టు 15 నుంచి ప్రారంభం కానున్న ఉచిత బస్సు సర్వీస్ ద్వారా.. ప్రభుత్వం రూ. 3182 కోట్ల భారాన్ని భరించాల్సి ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సీ 69 శాతం ఉండగా.. ఉచిత బస్సు సర్వీస్ ప్రారంభమైన తరువాత అది 94 శాతానికి చేరుతుందని భావిస్తున్నాము. ఆర్టీసీలో ప్రస్తుతం 11,216 బస్సులు ఉన్నాయి. ఇందులోని 8193 బస్సులలో మాత్రమే ఈ పథకం అమలు చేయనున్నట్లు సమాచారం. ఉచిత బస్సు ప్రయాణ సమయంలో మహిళా ప్రయాణికులకు జీరో టికెట్ జారీ చేయడం జరుగుతుంది.

  • టీటీడీ గొప్ప అవకాశం: VIP దర్శనం ఉచితంగా పొందండిలా..

    టీటీడీ గొప్ప అవకాశం: VIP దర్శనం ఉచితంగా పొందండిలా..

    TTD Govinda Koti Scheme: యువతలో రోజురోజుకి ఆధ్యాత్మిక చింతన కనుమరుగైపోతోంది. దీనిని మెరుగుపరచడానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వారు వినూత్న పద్దతిని అమలులోకి తీసుకొచ్చారు. ఎవరైతే గోవింద కోటి రాస్తారో.. వారికి ఉచితంగా వీఐపీ దర్శనం కల్పిస్తారు. దీని గురించి మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం.

    గోవింద కోటి అంటే ఏమిటి? TTD వినూత్న పథకం

    నిజానికి చాలామందికి రామకోటి మాత్రమే తెలుసు. ఈ తరహాలోనే టీటీడీ యాజమాన్యం గోవింద కోటి తీసుకొచ్చించి. ఈ పథకం ద్వారా యువతలో భక్తి భావాన్ని పెంపొందించడమే ముఖ్య ఉద్దేశ్యం.

    VIP దర్శనం పొందే విధానాలు:

    • కుటుంబంతో సహా VIP దర్శనం: 25 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయసున్న యువత గోవింద కోటి (కోటిసార్లు గోవింద నామం) రాస్తారో.. అలాంటి వారికి, వారి ఫ్యామిలీతో సహా వీఐపీ దర్శనం చేసుకునే అవకాశం లభిస్తుంది.
    • వ్యక్తిగత VIP బ్రేక్ దర్శనం: ఎవరైనా 10,01,116 (పది లక్షల వెయ్యి నూట పదహారు) సార్లు గోవింద నామం రాస్తారో.. అలాంటి వారికి (రాసిన వ్యక్తికి మాత్రమే) వీఐపీ బ్రేక్ దర్శనం లభిస్తుంది.

    గోవింద కోటి పుస్తకాలు మరియు నియమాలు

    పుస్తకాలు ఎక్కడ లభిస్తాయి?

    గోవింద కోటి రాయాలనుకునే వారికోసం కావాల్సిన పుస్తకాలు.. టీటీడీ సమాచార కేంద్రాలు, పుస్తక విక్రయ కేంద్రాలు, టీటీడీ అధికారిక వెబ్‌సైట్ లేదా ఆన్‌లైన్‌లో లభిస్తాయి.

    పుస్తకాల వివరాలు మరియు పూర్తి చేయడానికి పట్టే సమయం:

    ఒక్కో పుస్తకంలో 200 పేజీలు ఉంటాయి. ఇలాంటి ఒక పుస్తకంలో 39,600 నామాలు రాయవచ్చు.

    • 10,01,116 నామాలు రాయడానికి సుమారు 26 పుస్తకాలు అవసరమవుతాయి. ఈ పుస్తకాలను రాయడానికి కనీసం మూడేళ్ల సమయం పడుతుంది.
    • కోటి నామాలు రాయడానికి 252 కంటే ఎక్కువ పుస్తకాలు కావాల్సి ఉంటుంది, దీనికి మరింత ఎక్కువ సమయం పడుతుంది.

    గోవిండ కోటి పూర్తి చేశాక VIP దర్శనం పొందడం ఎలా?

    ఎవరైతే గోవింద కోటి పూర్తి చేస్తారో.. అలాంటి వారు తాము రాసిన పుస్తకాలను తిరుమలలోని పేష్కార్ కార్యాలయంలో సమర్పిస్తే.. వారికి ఆ మరుసటిరోజే వీఐపీ దర్శనం చేసుకునే ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా ఉచితంగానే శ్రీవారి వీఐపీ దర్శనం చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని లేదా పద్దతిని టీటీడీ యాజమాన్యం ఎప్పుడో ప్రవేశపెట్టింది.

    గోవింద కోటి ద్వారా లబ్ధి పొందిన వారు

    ఇప్పటి వరకు గోవింద కోటి రాసి ఉచిత వీఐపీ దర్శనం చేసుకున్నవారు కేవలం ముగ్గురు మాత్రమే అని తెలుస్తోంది. ఇందులో మొదటి వ్యక్తి బెంగళూరుకు చెందిన కీర్తన అనే యువతి. ఇంటర్ పూర్తిచేసిన ఈ యువతి 10,01,116 సార్లు గోవింద నామం రాసి టీటీడీ యాజమాన్యానికి సమర్పించింది. యాజమాన్యం ఈమెకు ఉచిత వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించింది. ఆ తరువాత మరో ఇద్దరు యువత కూడా 10,01,116 సార్లు గోవింద నామం రాసి ఉచిత వీఐపీ దర్శనం చేసుకున్నట్లు సమాచారం.

    గోవింద కోటి వల్ల కలిగే ప్రయోజనాలు

    యువతలో ఆధ్యాత్మిక చింతన పెంపొందించడానికి టీటీడీ తీసుకున్న గొప్ప నిర్ణయం ఈ గోవింద కోటి. దీనివల్ల భక్తి భావం పెరుగుతుంది. తద్వారా మనసులో చెడు ఆలోచనలు తొలగిపోతాయి. ఏకాగ్రత పెరిగి, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదుగుతారు. ఇది కేవలం వారి కుటుంబానికి మాత్రమే కాకుండా.. సమాజానికి కూడా ఉపయోగపడుతుంది.

  • కాణిపాకం ఆలయంలో కొత్త నియమాలు: వారికి టికెట్లు తప్పనిసరి

    కాణిపాకం ఆలయంలో కొత్త నియమాలు: వారికి టికెట్లు తప్పనిసరి

    Kanipakam Temple Rules: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో ఒకటైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దర్శనానికి ప్రతిరోజూ లెక్కకు మించిన భక్తులు వెళ్తూనే ఉంటారు. అయితే దేవాలయ అధికారులు తాజాగా కొన్ని కీలక నియమాలను వెల్లడించారు. ఈ కొత్త నిబంధనలను కాణిపాకం సందర్శనకు విచ్చేసే భక్తులు తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది.

    కాణిపాకం ఆలయంలో కొత్త దర్శన నియమాలు

    శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ఈవో ‘పెంచల కిశోర్’ వెల్లడించిన వివరాల ప్రకారం, ఇకపై కాణిపాకం వచ్చే ప్రోటోకాల్, ఉభయదారులు, వారి కుటుంబ సభ్యులు మినహా సిఫార్సులపై వచ్చే ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శనానికి టికెట్స్ తీసుకోవాల్సిందే. ఇదివరకు సిఫార్సు లేఖలపై వచ్చే భక్తులు స్వామివారి దర్శనానికి ఉచితంగా వెళ్లే వెసులుబాటు ఉండేది, కానీ ఆ విధానానికి స్వస్తి పలికారు.

    ఆలయ సిబ్బంది బంధువులకూ టికెట్ తప్పనిసరి

    ఆలయ ఉద్యోగులకు సంబంధించినవారు ఎవరైనా దర్శనానికి వచ్చినా, వారు కూడా తప్పనిసరిగా టికెట్ కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. వేసవి సెలవులు కావడంతో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కొత్త నియమాలను ప్రవేశపెట్టారు.

    8 మంది ఆలయ ఉద్యోగుల తొలగింపు

    ఇదిలా ఉండగా, కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో పనిచేసే ఎనిమిదిమంది ఉద్యోగులను తొలగించినట్లు దేవాదాయ శాఖ అధికారికంగా ప్రకటించింది. 2021 ఫిబ్రవరి 6న అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఆలయంలో తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో కొందరు ఉద్యోగులు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు, లెక్కకు మించి ఎక్కువ డబ్బులు తమ వద్ద ఉంచుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

    ఈ అవినీతి ఆరోపణల నేపథ్యంలోనే సదరు ఉద్యోగులపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. తొలగించబడిన వారిలో ఆలయ అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ మరియు తాత్కాలిక బ్యాంక్ ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం.

    కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయ విశిష్టత

    కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి గొప్ప చారిత్రక నేపథ్యం ఉంది. ఇక్కడ వెలసిన స్వామివారు స్వయంభువుగా వెలిసినట్లు పురాణాలు మరియు స్థల గ్రంధాలు వెల్లడిస్తున్నాయి. కాణిపాకంలో భక్తులు తమ కోరికలను స్వామివారికి విన్నవించుకుంటే అవి తప్పక నెరవేరతాయని ప్రగాఢంగా విశ్వసిస్తారు. అంతే కాకుండా, ఈ పవిత్ర స్థలంలో ఎవరైనా అసత్య ప్రమాణాలు చేస్తే, దానికి తగిన పరిణామాలను వారు ఎదుర్కొంటారని కూడా స్థానికులు మరియు భక్తులు చెప్పుకుంటారు. ఈ కారణంగానే ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తూ ఉంటారు.

    వార్షిక బ్రహ్మోత్సవాలు

    ప్రతి ఏటా వినాయక చవితి సందర్భంగా కాణిపాకంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. సుమారు ఇరవై ఒక్క రోజులకు పైగా ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ సమయంలో స్వామివారు మూషికాది వివిధ వాహనాలపై కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తారు. విఘ్నాధిపతి అయిన వినాయకుడిని కొలిచేవారికి సకల శుభాలు కలుగుతాయని, ఆటంకాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.

  • విజయవాడ హైవేపై శాటిలైట్ టోల్ కలెక్షన్ షురూ!

    విజయవాడ హైవేపై శాటిలైట్ టోల్ కలెక్షన్ షురూ!

    Satellite Toll Collection: భారతదేశంలో రోడ్డు రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నేషనల్ హైవేల నిర్మాణాలను వేగవంతం చేయడమే కాకుండా, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి, టోల్ వసూళ్ల ప్రక్రియను సులభతరం చేయడానికి ఎప్పటికప్పుడు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలో, 2019 డిసెంబర్ 15న ప్రవేశపెట్టిన ఫాస్ట్‌ట్యాగ్ (FASTag) విధానం టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయాన్ని గణనీయంగా తగ్గించింది. ఇప్పుడు, ఈ ఫాస్ట్‌ట్యాగ్ స్థానంలో మరింత ఆధునికమైన శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు విధానం అమలులోకి రానుంది.

    శాటిలైట్ టోల్ విధానం అంటే ఏమిటి?

    శాటిలైట్ టోల్ విధానం అనేది గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (GPS) ఆధారంగా పనిచేస్తుంది. ఈ విధానం ద్వారా వాహనదారులు టోల్ చెల్లించడానికి ప్రత్యేకంగా టోల్ ప్లాజా దగ్గర ఆగాల్సిన అవసరం ఉండదు. వాహనం ప్రయాణించిన దూరం ఆధారంగా ఆటోమేటిక్‌గా టోల్ రుసుము వసూలు చేయబడుతుంది.

    తెలుగు రాష్ట్రాల్లో శాటిలైట్ టోల్ ట్రయల్స్

    కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇప్పటికే పలుమార్లు వెల్లడించినట్లుగా, దేశంలోని పలు ప్రధాన నగరాల్లోని జాతీయ రహదారులపై శాటిలైట్ టోల్ కలెక్షన్ విధానం టెస్టింగ్ దశలో ఉంది. తాజాగా ఈ ప్రయోగాత్మక విధానం మన తెలుగు రాష్ట్రాల్లోకి కూడా ప్రవేశించింది. ముఖ్యంగా, హైదరాబాద్ – విజయవాడ నేషనల్ హైవే మీద పంతంగి, కొర్లపహాడ్ (తెలంగాణ) మరియు చిల్లకల్లు (ఆంధ్రప్రదేశ్) టోల్ ప్లాజాల వద్ద శాటిలైట్ విధానంతో టోల్ వసూలు చేయడం ప్రారంభించారు.

    టోల్ ఫీజు ఎలా కట్ అవుతుంది? ప్రయోజనాలేంటి?

    టోల్ ప్లాజా వద్ద వాహనం ఆగకపోయినా టోల్ ఫీజు ఎలా వసూలు అవుతుందనే సందేహం చాలా మంది వాహనదారులలో తలెత్తింది. అయితే, శాటిలైట్ టోల్ విధానంలో, వాహనం యొక్క విండ్‌షీల్డ్‌పై ఉన్న ఫాస్ట్‌ట్యాగ్ స్టిక్కర్‌ను ఉపయోగించి, GPS ద్వారా వాహనం ప్రయాణించిన దూరాన్ని లెక్కిస్తారు. దీని ఆధారంగా నిర్దిష్ట రుసుము వాహనదారుడి ఖాతా నుండి ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది.

    • సమయం ఆదా: టోల్ గేట్ల వద్ద ఆగాల్సిన పనిలేకపోవడంతో ప్రయాణ సమయం ఆదా అవుతుంది.
    • డబ్బు ఆదా: ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్ చెల్లించాల్సి రావడం వలన అనవసరపు ఖర్చు తగ్గుతుంది.
    • ట్రాఫిక్ రద్దీ తగ్గుదల: టోల్ ప్లాజాల వద్ద వాహనాలు నిలిచిపోవడం తగ్గుతుంది, తద్వారా ట్రాఫిక్ జామ్‌లు తగ్గుముఖం పడతాయి.

    భవిష్యత్ ప్రణాళికలు మరియు ప్రభుత్వ కృషి

    ప్రస్తుతం ఈ శాటిలైట్ టోల్ కలెక్షన్ విధానం దేశంలోని కొన్ని ప్రధాన మార్గాల్లో ట్రయల్ రన్‌లో ఉంది. ఈ ప్రయోగాలు విజయవంతమైతే, దేశవ్యాప్తంగా ఈ నూతన విధానాన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. అయితే, దేశం మొత్తం మీద ఇది ఎప్పుడు పూర్తిస్థాయిలో అమలులోకి వస్తుందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

    పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ, టోల్ వసూలు ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి ప్రభుత్వం ఈ GPS ఆధారిత టోల్ సేకరణను ప్రవేశపెట్టింది. దీనితో పాటు, రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి కూడా కేంద్రం అనేక చర్యలు తీసుకుంటోంది. నాణ్యమైన రోడ్ల నిర్మాణం ద్వారా ప్రమాదాల నివారణకు పెద్దపీట వేస్తూ, కోట్ల రూపాయల నిధులను వెచ్చిస్తోంది.

  • నేడు, రేపు వర్ష సూచన: ఆ జిల్లాల్లో భారీ వర్షం!

    నేడు, రేపు వర్ష సూచన: ఆ జిల్లాల్లో భారీ వర్షం!

    AP Rain Alert: అసలే ఎండాకాలం, భానుడి భగభగలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనే వేడి విపరీతంగా ఉంది, ఇక నగరాల్లో ఎండ తీవ్రత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇలాంటి సమయంలో వర్షం పడితే బాగుంటుందని అందరూ ఆశిస్తారు. ఆ ఆశలని నిజం చేయడానికే వరుణుడు కరుణించినట్లు ఉన్నాడు. ఈ రోజు, రేపు (మంగళవారం, బుధవారం) రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

    భారీ వర్షాలు, పిడుగులతో కూడిన గాలులు: ఈ జిల్లాలకు హెచ్చరిక

    వాతావరణ అనిశ్చితల కారణంగా రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. గంటకు 50 నుంచి 60 కిమీ వేగంతో వేగవంతమైన ఈదురుగాలులతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

    భారీ వర్ష సూచన ఉన్న జిల్లాలు

    అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, పల్నాడు మరియు ప్రకాశం జిల్లాలలో భారీ వర్షం కురిసే సూచనలు ఉన్నాయి.

    మోస్తరు వర్ష సూచన ఉన్న జిల్లాలు

    కాకినాడ, విశాఖపట్టణం, డా. బీ. ఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు & పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, తిరుపతి మరియు చిత్తూరు వంటి ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

    వాతావరణ శాఖ హెచ్చరికలు & అలర్ట్స్

    ఈ రోజు కూడా వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉన్నందున, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా హోర్డింగ్స్ దగ్గర, చెట్ల కింద, శిధిలావస్థలో ఉన్న భవనాల దగ్గర ఉండకూడదని హెచ్చరించారు. భారీ వర్ష సూచనల నేపథ్యంలో వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.

    కొనసాగుతున్న ఎండలు, ఉష్ణోగ్రతల వివరాలు

    వర్ష సూచన ఉన్నప్పటికీ, రాష్ట్రంలోని పలు నగరాల్లో ఎండ తీవ్రత కూడా అధికంగానే ఉంది. మంగళవారం విజయవాడలో 33 డిగ్రీలు, తిరుపతిలో 34 డిగ్రీలు మరియు విశాఖపట్టణంలో 31 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే, ఈ నగరాల్లో కూడా వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

    అకాల వర్షాల ప్రభావం: పంట నష్టం, రైతుల ఆందోళన

    ఎండాకాలంలో కురుస్తున్న ఈ అకాల వర్షాల వల్ల నష్టాలు కూడా సంభవిస్తున్నాయి. ముఖ్యంగా మామిడి రైతులపై ఈ వర్షం ప్రభావం ఎక్కువగా చూపే అవకాశం ఉంది. పిడుగులతో కూడిన గాలుల వల్ల ఇతర పంటలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం సహాయం అందించి ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.

    వర్షాల సమయంలో ప్రజలకు ముఖ్య సూచనలు

    ఎండాకాలంలో వచ్చే వర్షాలు పంట నష్టాలను కలిగించడంతో పాటు, అనుకోని ప్రమాదాలకు కూడా దారితీస్తాయి. కాబట్టి వర్షం పడే సమయంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి.

    • చెట్ల కింద, విద్యుత్ స్తంభాల కింద నిలబడకూడదు.
    • కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న పాత భవనాలు, నిర్మాణాల దగ్గర ఉండకూడదు.
    • పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినందున, వర్షం పడే సమయంలో వీలైనంత వరకు బయట తిరగకుండా ఇళ్లలోనే ఉండటం సురక్షితం.
  • టీటీడీ కీలక నిర్ణయం: వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు

    టీటీడీ కీలక నిర్ణయం: వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు

    TTD VIP Break Darshan Timing: ఇల వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమలకు వెళ్తున్న భక్తుల సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతోంది. ప్రస్తుతం వేసవి సెలవుల కారణంగా ఈ రద్దీ మరింత పెరిగింది. దీనిని దృష్టిలో ఉంచుకుని టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) యాజమాన్యం.. బ్రేక్ దర్శన వేళల్లో కొన్ని మార్పులు చేసింది. రద్దీని తగ్గించడంలో భాగంగా ఈ కొత్త మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

    కొత్త వీఐపీ బ్రేక్ దర్శన నియమాలు (జూలై 15 వరకు)

    టీటీడీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం ప్రకారం.. శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రోటోకాల్ ‘వీఐపీ’లకు మాత్రమే ఈ రోజు నుంచి (2025 మే 1) జులై 15 వరకు బ్రేక్ దర్శనాలు పరిమితం చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయం కూడా ఉదయం 5:45 గంటల నుంచి 11 గంటల వరకు పరిమితం చేశారు.

    ప్రత్యేక సేవల రోజుల్లో మినహాయింపు

    కాగా.. శ్రీవారి తిరుప్పాడ సేవ (గురువారం), అభిషేక సేవ (శుక్రవారం) నేపథ్యంలో ఈ రెండు రోజులు పాత వేళలే కొనసాగుతాయని యాజమాన్యం స్పష్టం చేసింది.

    సాధారణ భక్తుల ప్రయోజనం కోసమే ఈ మార్పులు

    నిజానికి.. సాధారణ రోజులలో కంటే కూడా సెలవుల సమయంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. అందులోనూ ఇప్పుడు వేసవి సెలవులు కావడం చేస్తే.. భక్తుల సంఖ్య మరింత పెరుగుతుంది. సాధారణ భక్తుల సంఖ్య పెరగడం వల్ల, వారికి శ్రీవారి దర్శన భాగ్యం కలిగించడానికి.. వీఐపీ దర్శనానికి సంబంధించి మార్పులు చేయడం జరిగింది.

    వీఐపీ భక్తుల సంఖ్య పెరిగితే.. సాధారణ భక్తులు తప్పకుండా కొంత ఇబ్బందిపడాల్సి వస్తుంది. దేవదేవుని దర్శనం కూడా ఆలస్యమవుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని టీటీడీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త రూల్స్ ఈ రోజు (గురువారం) నుంచి జులై 15 వరకు అమలులో ఉంటాయి. అయితే జులై 15 తరువాత ఈ రూల్స్ ఇలాగే కొనసాగుతాయా?, పాత వేళలనే అమలు చేస్తారా అనే విషయం అధికారికంగా తెలియాల్సి ఉంది. మొత్తం మీద టీటీడీ యాజమాన్యం సామాన్య భక్తులకు అనుకూలంగా కీలక మార్పులు చేసినట్లు స్పష్టమవుతోంది.

    ఇతర టీటీడీ సమాచారం & నవీకరణలు

    అక్షయ తృతీయ నాడు రద్దీ

    ఏప్రిల్ 30న అక్షయ తృతీయ సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య కొంత ఎక్కువగానే ఉంది. దేవదేవుని దర్శనం కోసం కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండానే డైరెక్ట్ క్యూలైన్ కొనసాగింది. దీంతో టోకెన్స్ లేని భక్తుల సర్వదర్శనానికి 8 గంటల సమయం పట్టింది. ఈ రోజు కూడా ఇదే రద్దీ కొనసాగే అవకాశం ఉంది.

    జూన్ నెల ఆన్‌లైన్ సేవా కోటా

    ఇదిలా ఉండగా.. శ్రీవారి సేవలో 2025 జూన్ నెలలో వివిధ సేవలకు సంబంధించిన ఆన్‌లైన్ కోటా ఏప్రిల్ 30న విడుదలైంది.

    ముఖ్యమంత్రి సూచనలు & వార్షిక బ్రహ్మోత్సవాలు

    తిరుమల తిరుపతి దేవస్థానాలు సందర్శించే భక్తులకు నాణ్యమైన సేవలను అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు కీలక సూచనలు చేశారు. అయితే టీటీడీ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ సారి 2025 సెప్టెంబర్ 16 నుంచి 24 వరకు జరుగుతాయి.