2025 Honda Shine 125 Launched In India: రోజువారీ వినియోగానికి లేదా.. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువమంది ఇష్టపడే బైకులలో ఒకటైన ‘హోండా షైన్ 125’ (Honda Shine 125) ఇప్పుడు ఆధునిక హంగులను పొందింది. కంపెనీ ఈ బైకును ఓబీడీ2బీ (OBD2B) నియమాలకు అనుగుణంగా అప్డేట్ చేసింది. కాబట్టి ధరలలో కూడా కొంత వ్యత్యాసం ఏర్పడింది.
కొత్త ధరలు
హోండా కొత్త షైన్ 125 బైక్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఒకటి డ్రమ్ వేరియంట్, మరొకటి డిస్క్ వేరియంట్. వీటి ధరలు వరుసగా రూ. 84,493 మరియు రూ. 89,245 (ధరలు, ఎక్స్ షోరూమ్ – ఢిల్లీ). ఈ ధరలు స్టాండర్డ్ వేరియంట్ కంటే కూడా రూ. 1242 (డ్రమ్ వేరియంట్) మరియు రూ. 1994 (డిస్క్ వేరియంట్) ఎక్కువ.
కొత్త హోండా షైన్ 125 బైక్ 123.94 సీసీ ఇంజిన్.. లేటెస్ట్ OBD2B నిబంధనలకు అనుగుణంగా అప్డేట్ అయింది. ఇది 7500 rpm వద్ద 14.9 హార్స్ పవర్ మరియు 6000 rpm వద్ద 11 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది పనితీరు పరంగా స్టాండర్డ్ మోడల్ కంటే కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. కాబట్టి రోజువారీ వినియోగానికి లేదా నగర ప్రయాణానికి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని సమాచారం. ఇంధన సామర్థ్యాన్ని పెంచే ఐడెల్ స్టార్ట్ / స్టాప్ సిస్టం కూడా ఈ బైకులో ఉంటుంది.
ఇందులో కొత్తగా ఏమున్నాయంటే?
2025 హోండా షైన్ 125 లేదా కొత్త షైన్ 125 బైక్ ఇప్పుడు డిజిటల్ అనలాగ్ యూనిట్ స్థానంలో.. డిజిటల్ డ్యాష్ బోర్డు పొందుతుంది. ఇందులో రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్, డిస్టెన్స్ టు ఎంప్టీ వంటివి కనిపిస్తాయి. వీటితో పాటు.. మునుపటి బైకులోని సర్వీస్ డ్యూ ఇండికేటర్ మరియు సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ వంటి ఫీచర్స్ కూడా కొత్త బైకులో లభిస్తాయి.USB టైప్ సీ పోర్ట్ కూడా కొత్త షైన్ 125లో కనిపిస్తుంది.
అప్డేటెడ్ హోండా షైన్ 125 బైక్ యొక్క వెనుక టైర్ ఇప్పుడు 90 సెక్షన్ యూనిట్, ఇది మునుపటి 80 సెక్షన్ టైర్ స్థానంలో ఫిక్స్ చేయబడింది. ఈ బైక్ పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, జెనీ గ్రే మెటాలిక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, రెబెల్ రెడ్ మెటాలిక్, డీసెంట్ బ్లూ మెటాలిక్ మరియు పెర్ల్ సైరెన్ బ్లూ వంటి కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుండటం వల్ల.. కొనుగోలుదారులు తమకు నచ్చిన కలర్ బైక్ కొనుగోలు చేయవచ్చు.
షైన్ 125 బైక్ మార్కెట్లో టీవీఎస్ కంపెనీకి చెందిన రేడియన్ మరియు హీరో మోటోకార్ప్ సంస్థకు చెందిన సూపర్ స్ప్లెండర్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. షైన్ 125 మాత్రమే కాకుండా.. దీని ప్రత్యర్థులు కూడా మంచి డిజైన్, ఫీచర్స్ కలిగి అత్యుత్తమ పనితీరును అందిస్తాయి. కాబట్టి 2025 షైన్ 125 బైక్ అమ్మకాల పరంగా తప్పకుండా కొంత పోటీని ఎదుర్కోవాలి ఉంటుంది.
హోండా షైన్ 125 అమ్మకాలు
కంపెనీ యొక్క హోండా షైన్ బైక్.. మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి దాదాపు కోటి యూనిట్ల కంటే ఎక్కువ అమ్మకాలను పొందింది. అంటే ఈ బైకును కోటి మంచి కొనుగోలు చేశారు. దీన్ని బట్టి చూస్తే.. ఈ బైకుకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బైక్ మరింత ఆధునిక హంగులతో లాంచ్ అవ్వడంతో మరింత మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉందని భావిస్తున్నాము.
Also Read: నిమిషాల్లో అమ్ముడైపోయిన రూ.4.25 లక్షల రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇదే: దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా?
హోండా షైన్ బైకును ఎక్కువమంది ఇష్టపడి కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం.. ఈ బైక్ యొక్క సింపుల్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్, కలర్ ఆప్షన్స్ మాత్రమే కాకుండా.. మంచి మైలేజ్ కూడా. ఈ బైక్ 55 కిమీ / లీ నుంచి 65 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. అంతే కాకుండా లోడింగ్ కెపాసిటీ లేదా బరువులు మోయడానికి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కారణాల వల్లనే ఈ బైకుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.