2025 మహీంద్రా థార్ లాంచ్: రూ.9.99 లక్షల ధరతో..

భారతదేశంలో అతి తక్కువ కాలంలో అధిక ప్రజాదరణ పొందిన.. అత్యధిక అమ్మకాలు పొందిన మహీంద్రా థార్ ఇప్పుడు ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ అయింది. ఇది ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఇతర థార్ మోడల్స్ కంటే కూడా అనేక అప్డేట్స్ పొందింది. ఇంతకీ దీని ధర, ఇతర వివరాలు ఇక్కడ వివరంగా చూసేద్దాం..

వేరియంట్స్ & ధరలు

మహీంద్రా థార్ ఫేస్‌లిఫ్ట్ ఐదు వేరియంట్లలో లభిస్తుంది. ధరలు రూ. 9.99 లక్షల నుంచి రూ. 16.99 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. 2025 థార్ బేస్ మోడల్ ధర.. మునుపటి స్టాండర్డ్ మోడల్ (రూ. 10.32 లక్షలు) ధర కంటే రూ. 32000 తక్కువ, అయితే టాప్ మోడల్ ధర దాని.. అవుట్‌గోయింగ్ థార్ టాప్ మోడల్ (రూ.16.61 లక్షలు) కంటే రూ. 38000 తక్కువ.

డిజైన్ అప్డేట్స్

2025 మహీంద్రా థార్ ఫేస్‌లిఫ్ట్ కొత్త కలర్ (టాంగో రెడ్, బాటిల్‌షిప్ గ్రే) ఆప్షన్స్ పొందుతుంది. డ్యూయెల్ టోన్ ఫ్రంట్ బంపర్ కలిగిన ఈ కారు.. హెడ్‌లైట్స్, టెయిల్ లైట్స్ వంటి వాటితో పాటు 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఇవి చూడటానికి కొంత స్టాండర్డ్ మోడల్ మాదిరిగా అనిపిస్తుంది.

ఫీచర్స్

మహీంద్రా థార్ ఫేస్‌లిఫ్డ్ ఇంటీరియర్ కూడా అప్డేట్స్ పొందింది. కొత్త బ్లాక్ డాష్‌బోర్డ్ థీమ్, కొత్త స్టీరింగ్ వీల్, రియర్ ఏసీ వెంట్స్, డోర్ మౌంటెడ్ పవర్ విండో స్విచ్‌లు, ముందు ప్రయాణికుల కోసం స్టోరేజ్‌తో కూడిన సెంటర్ ఆర్మ్‌రెస్ట్‌లు, ఏ-పిల్లర్‌పై గ్రాబ్ హ్యాండిల్, స్టీరింగ్ దగ్గర ఫ్యూయెల్ లిడ్ ఓపెనర్ బటన్ మొదలైనవి ఉన్నాయి. అవుట్‌గోయింగ్ మోడల్‌తో పోలిస్తే.. థార్ ఫేస్‌లిఫ్ట్‌లో సేఫ్టీ కిట్‌లో రియర్ వైపర్, వాషర్, రియర్ కెమెరా వంటివి ఉన్నాయి. ఇవి కాకుండా కొత్త 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ కూడా ఉంది.

ఇంజిన్ డీటెయిల్స్

2025 మహీంద్రా థార్ ఫేస్‌లిఫ్ట్.. 2.0 లీటర్ టర్బో పెట్రోల్ (152 హార్స్ పవర్), 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ (119 హార్స్ పవర్), 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ (132 హార్స్ పవర్) ఎంపికలతో అందుబాటులో ఉంది. 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ మోడల్ ఫోర్ వీల్ డ్రైవ్ ఎంపికతో అందుబాటులో ఉంటుంది. పనితీరు పరంగా ఇది స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది.

ఇండియన్ మార్కెట్లో ప్రస్తుతం మహీంద్రా థార్.. 3 డోర్స్ వెర్షన్, 5 డోర్స్ వెర్షన్ (థార్ రాక్స్) రూపంలో అందుబాటులో ఉంది. ఇప్పుడు 3 డోర్స్ మోడల్ ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ అయింది. అంతే కాకుండా కంపెనీ దీనిని ఎలక్ట్రిక్ రూపంలో కూడా లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది.

ఒక కారును ఇన్ని విధాలుగా మార్కెట్లో లాంచ్ చేయడానికి ప్రధాన కారణం దీనికున్న డిమాండ్, కొనుగోలుదారులకు థార్ మీద ఉన్న ఆసక్తి అని తెలుస్తోంది. దేశీయ విఫణిలో మహీంద్రా థార్ ఇప్పటికే సుమారు 3 లక్షల సేల్స్ దాటినట్లు సమాచారం. కాగా ఇప్పుడు లాంచ్ అయినా 2025 థార్ కూడా కంపెనీ అమ్మకాలను పెంచడంలో సహాయపడుతుంది. కాగా థార్ ఎలక్ట్రిక్ వెర్షన్ 2026లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలకావాల్సి ఉంది.