సరికొత్త 2025 స్కోడా కొడియాక్ ఇదే: ఈ కారు రేటెంతో తెలుసా?

2025 Skoda Kodiaq Launched: ఇండియన్ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త వాహనాలు లేదా అప్డేటెడ్ వాహనాలు లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే భారతీయ విఫణిలో అత్యధిక ప్రజాదరణ పొందిన ప్రముఖ చెక్ రిపబ్లికన్ బ్రాండ్ స్కోడా.. ఎట్టకేలకు తన కొడియాక్ కారును ఆధునిక హంగులతో లాంచ్ చేసింది. దేశంలో అడుగుపెట్టిన ఈ 2025 మోడల్ ధర, ఇతర వివరాలు ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో చూసేద్దాం.. రండి.

ధర & డెలివరీ

భారతదేశంలో లాంచ్ అయినా రెండవతరం కొడియాక్ కారు ధరలు రూ. 46.89 లక్షల నుంచి రూ. 48.69 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. కంపెనీ ఈ కారు కోసం ఈ రోజు నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు మే 2 నుంచి ప్రారంభం కానున్నాయి. 2025 కొడియాక్ దాని మునుపటి మోడల్ కంటే పరిమాణంలో కొంత పెద్దదిగా ఉంటుంది.

2023లో గ్లోబల్ మార్కెట్లో అడుగుపెట్టిన కొడియాక్.. 2025 భారత్ మొబిలిటీ ఆటో ఎక్స్‌పోలో భారతదేశంలో కనిపించింది. కాగా ఇప్పటికి అధికారికంగా లాంచ్ అయింది. మూడు వరుసల సీట్లు కలిగిన ఈ కారు MQB EVO ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందించబడింది. కాబట్టి ఇది అత్యద్భుతమైన డిజైన్ పొందుతుంది.

డిజైన్

2025 స్కోడా కొడియాక్ స్లికర్ లుక్ కలిగి.. ఎల్ఈడీ మ్యాట్రిక్స్ టెక్నాలజీతో కూడిన స్ల్పిట్ క్వాడ్ హెడ్‌లైట్ పొందుతుంది. సిగ్నేచర్ బటర్‌ప్లై గ్రిల్ కలిగి.. మంచి లైటింగ్ సెటప్ పొందుతోంది. ఈ కారు దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా అద్భుతమైన డిజైన్ పొందుతుంది. 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, వెనుక భాగంలో స్కోడా బ్యాడ్జింగ్, సీ ఆకారంలో కనిపించే ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్ వంటివి ఇందులో చూడవచ్చు.

మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ కారు పొడవు.. దాని మునుపటి మోడల్ కంటే 61 మిమీ పెరిగి 4758 మిమీకి చేరింది. వెడల్పు, ఎత్తు మరియు వీల్‌బేస్ వంటి వాటిలో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి ఇది వాహన వినియోగదారులకు మంచి ప్రయాణ అనుభూతిని అందిస్తుంది.

ఫీచర్స్

2025 స్కోడా కొడియాక్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇది 13 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, 10 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, హెడ్స్ అప్ డిస్‌ప్లే వంటివి పొందుతుంది. అంతే కాకుండా.. 13 స్పీకర్ ఆడియో సిస్టం, 360 డిగ్రీ కెమెరా, పవర్ అడ్జస్టబుల్ స్టీరింగ్ మరియు ఎలక్ట్రిక్ టెయిల్ గెట్ వంటివి కూడా ఉన్నాయి.

సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే.. స్కోడా కొడియాక్ కారులో తొమ్మిది ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఏబీఎస్ విత్ ఈబీడీ, హిల్ డీసెంట్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ మరియు మల్టి కొలిషన్ బ్రేక్ మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల భద్రతకు పెద్ద పీట వేస్తాయి.

Aldo Read: ఫోక్స్‌వ్యాగన్ కొత్త టిగువాన్ – ఈ కారు గురించి తెలుసుకోవాల్సిన ఐదు విషయాలు

ఇంజిన్ వివరాలు & ప్రత్యర్థులు

కొత్త స్కోడా కొడియాక్ 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 201 Bhp పవర్ మరియు 320 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఇది నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. కాబట్టి మంచి పనితీరును అందిస్తుంది. 2025 కొడియాక్ కారు మార్కెట్లో.. ఎంజీ గ్లోస్టర్, ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్, టయోటా ఫార్చ్యూనర్, జీప్ మెరిడియన్ మరియు నిస్సాన్ ఎక్స్-ట్రైల్ వంటి కార్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి ఇది అమ్మకాల పరంగా కొంత పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Leave a Comment