500 Govt Services Will be Available On WhatsApp: టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీనిని మనం కూడా అనుసరించి ఉత్తమ ఫలితాలను పొందాలనే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం 2025 జనవరి 30న ‘మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్’ (Mana Mitra WhatsApp Governance) ప్రారంభించింది. అయితే జూన్ 30 నుంచి ఇందులోనే 2.0 వెర్షన్ తీసుకురానున్నట్లు.. రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ‘నారా లోకేష్’ (Nara Lokesh) వెల్లడించారు.
మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ 2.0
త్వరలో అందుబాటులోకి రానున్న మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ 2.0లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సేవలు ఉంటాయి. కాబట్టి టికెట్ బుకింగ్స్, ఇతర సేవల కోసం ప్రత్యేకంగా టెక్స్ మెసేజ్ మాదిరిగా టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్లాలని చెబితే టికెట్స్ బుక్ చేస్తుంది. ఈ విషయాలను లోకేష్ శాసన సభలో స్పష్టం చేశారు.
పబ్లిక్ పరీక్ష ఫలితాలు నేరుగా మొబైల్ నెంబర్లకు
రాష్ట్రంలో పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థులు.. ఫలితాల కోసం ప్రత్యేకంగా ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పరిక్షల ఫలితాలను నేరుగా విద్యార్థుల లేదా తల్లిదండ్రుల మొబైల్ నెంబర్లకు పంపిస్తామని లోకేష్ చెప్పారు. ఇప్పటికే విద్యార్థులు తమ పరీక్షల హాల్ టికెట్స్ కూడా ఇంటి నుంచే మొబైల్ నెంబర్స్ ద్వారా పొందారు. రాబోయే నెల రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) సేవలకు సంబంధించిన వాటిని కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానే అందించనున్నట్లు వెల్లడించారు.
శాశ్వత ధ్రువీకరణ పత్రాలు
ఆరు నెలలకు ఒకసారి ధ్రువీకరణ పాత్రలను తీసుకోవాల్సిన అవసరాన్ని రద్దు చేస్తాము. శాశ్వత ధ్రువీకరణ పత్రాలు చెల్లుబాటు అయ్యేలా చట్టసవరణ చేస్తామని నారా లోకేష్ స్పష్టం చేశారు. కేంద్ర ఐటీ చట్టం ప్రకారం.. పిజికల్ డాక్యుమెంట్స్ మాదిరిగానే, ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్ కూడా చెల్లుబాటు అవుతాయి. కాబట్టి మనం దీనిని ఎందుకు ఉపయోగించుకోకూడదు?. కాబట్టి కూటమి ప్రభుత్వం దీనిని కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తుంది.
జూన్ 30 కల్లా.. 500 సేవలు
ప్రభుత్వం కనపడకూడదు, పాలన మాత్రమే కనపడాలనే సిద్ధాంతం ప్రకారం.. కూటమి ప్రభుత్వం పాలన మొత్తం ప్రజల జేబుల్లో వాట్సాప్ గవర్నెన్స్ రూపంలో అందుబాటులో ఉంటుంది. జనవరి 30న 155 సేవలతో వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఇందులో 200 సేవలు అందుబాటులో ఉన్నాయి. జూన్ 30 నాటికి 500 సేవలు అందుబాటులో ఉంటాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రజలు అడిగిన సేవలను 10 సెకన్లలో అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది.
Also Read: పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం: ఆ పదవికి నాగబాబు పేరు ఖరారు
వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభమైనప్పటి నుంచి వివిధ శాఖలలో 1.23 కోట్ల లావాదేవీలు జరిగాయి. అందులో 51 లక్షల లావాదేవీలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా జరిగాయి. దీన్నిబట్టి చూస్తే.. వాట్సాప్ గవర్నెన్స్ ప్రజలకు ఎంత చేరువయ్యిందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి రాబోయే రోజుల్లో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మరిన్ని సేవలను అందుబాటులోకి వస్తాయి. ఇది తప్పకుండా ప్రజలకు ఎంతగానో.. ఉపయోగపడుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు.