మొదటి సినిమాకే సైమా అవార్డు: మిరాయ్ నటి ‘రితికా నాయక్’ గురించి తెలుసా?

హను మాన్ సినిమా భారీ విజయం సాధించిన తరువాత.. ‘తేజ సజ్జ‘ మిరాయ్ సినిమాలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినీ ప్రపంచంలో అంచనాలను అమాంతం పెంచేసింది. చాలామంది ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ‘రితికా నాయక్‘ గురించి తెలుసుకోవడానికి తెగ ఆసక్తి చూపుతున్నారు. ఇంతకీ ఈమె ఎవరు?, ఈమె బ్యాగ్రౌండ్ ఏమిటి? వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో చూసేద్దాం..

ఎవరీ రితికా నాయక్

దేశ రాజధాని ఢిల్లీలో పుట్టిన ‘రితికా నాయక్’.. ఒరియా కుటుంబానికి చెందిన యువతి. ‘శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కాలేజ్ ఫర్ ఉమెన్స్’ చదువుకున్న ఈమె 2019లో ఢిల్లీ టైమ్స్ ఫ్రెష్ పేస్ సీజన్ 12లో గెలిజిన తరువాత మోడలింగ్ ప్రారంభించింది. ప్రస్తుతం రితికా మిరాయ్ సినిమాలో నటిస్తున్నప్పటికీ.. ఇదే ఆమె మొదటి సినిమా కాదు. ఎందుకంటే 2022లో విడుదలైన అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాలో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకుంది. మొదటి సినిమాకే సైమా అవార్డును కూడా సొంతం చేసుకుంది.

అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా తరువాత హాయ్ నాన్న సినిమాలో కూడా కనిపించింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి మిరాయ్ సినిమాలో కనిపిస్తోంది. అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్‌లో క్రేజీ డిమాండ్ పెంచుకున్న ఈమె.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా.. సినిమాకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ.. అభిమానులకు దగ్గరవుతోంది.

మిరాయ్ సినిమా గురించి

ఇప్పటికే విడుదలైన మిరాయ్ సినిమా ట్రైలర్ చాలామందిని ఆకట్టుకుంది. ఈ సినిమాలో తేజ సజ్జ కథానాయకుడుగా కనిపిస్తున్నాడు. మంచి మనోజు ప్రతినాయకుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. నటి శ్రియ, జగపతిబాబు మొదలైన సీనియర్ నటులు కూడా ఈ సినిమాలో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో రితికా నాయక్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

పురాతన కాలానికి సంబంధించిన గ్రంధాలను, ఆయుధాన్ని సాధించే నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వేరే లెవెల్‌లో ఉండబోతోందని ట్రైలర్ చెప్పేస్తోంది. మంచు పర్వతాల్లో ప్రయాణం.. పెద్ద పక్షిని ఎదుర్కోవడం.. మంచు మనోజ్‌తో ఫైట్స్ వనీటివన్నీ చాలా అద్భుతంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమా గొప్ప హిట్ సాధిస్తుందని సినీ ప్రముఖులు, విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే జరిగితే యువ నటుడు తేజ సజ్జ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ యాడ్ అయినట్లే. ఈ సినిమా సెప్టెంబర్ 12న రిలీజ్ అవుతుంది.

మిరాయ్ సినిమా కోసం రూ. 60 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ సినిమా కోసం రూ. 40 కోట్ల బడ్జెట్ అనుకున్నప్పటికీ.. అది రూ. 60కోట్లకు చేరిందని చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనలు వెలువడలేదు. అంతే కాకుండా ఈ చిత్రంలో నటించిన నటీ నటులకు ఎంత ఎమ్యూనరేషన్ ఇచ్చారనే విషయాలు కూడా గోప్యంగా ఉంచారు. ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ చేస్తున్నారు. టీజీ విశ్వ ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ కంపెనీ దీనిని నిర్మిస్తోంది. మొత్తం మీద తేజ సజ్జ రెండో సినిమా తెరమీదకు వచ్చేస్తోంది. సినిమా విడుదలైన తరువాత ఎలాంటి విజయం సాధిస్తుందో తెలుసుకోవడానికి కొంతకాలం వేచి చూడాల్సిందే..

Leave a Comment