భారతదేశంలో అత్యధిక ప్రజాదరణ పొందిన ‘టీవీఎస్ జుపిటర్ 110’ ఇప్పుడు స్పెషల్ ఎడిషన్ రూపంలో లాంచ్ అయింది. దీని ధర రూ. 93,031 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). దీంతో ఇది దాని లైనప్‌లో అత్యంత ఖరీదైన స్కూటర్‌గా నిలిచింది. ఇది స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఎక్కువ కాస్మొటిక్ అప్డేట్స్ పొందింది. ఈ సరికొత్త స్కూటర్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
అత్యధిక ధర వద్ద లాంచ్ అయిన కొత్త టీవీఎస్ జుపిటర్ 110.. స్కూటర్ మొత్తం నలుపు రంగులో ఉంది. అయితే క్రోమ్ ఎగ్జాస్ట్ హీట్ షీల్డ్ మాత్రం వేరే రంగులో ఉండటం చూడవచ్చు. బ్యాడ్జ్ అనేది బ్రాంజ్ కలర్ పొంది ఉండటం చూడవచ్చు. ప్రస్తుతం అమ్మకానికి ఉన్న దాదాపు అన్ని జుపీటర్ స్కూటర్లు కూడా ఇదే కలర్ బ్యాడ్జ్ కలిగి ఉన్నాయి. మొత్తం నలుపు రంగులో.. బ్యాడ్జ్ మాత్రం వేరే రంగులో ఉండటం వల్ల ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది.
ఇంజిన్ వివరాలు
టీవీఎస్ జుపిటర్ 110 స్పెషల్ ఎడిషన్.. ప్రస్తుతం దాని విభాగంలో అత్యంత ఖరీదైన మోడల్. హోండా యాక్టివా స్మార్ట్ వేరియంట్ (రూ. 95,567) తరువాత ఇదే (జుపిటర్ 110 స్పెషల్ ఎడిషన్) ఖరీదైనదని తెలుస్తోంది. ఈ కొత్త వేరియంట్ ఆల్ బ్లాక్ ట్రీట్‌మెంట్ మినహా ఎలాంటి యాంత్రికమైన మార్పులను పొందలేదు. ఇది జుపిటర్ 110 డిస్క్ ఎస్ఎక్స్‌సీకి సమానంగా ఉంటుంది. కాగా ఇది ఫ్రంట్ డిస్క్ బ్రేక్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ డిస్‌ప్లే కూడా పొందుతుంది.
జుపిటర్ 110 స్పెషల్ ఎడిషన్ 113.3 సీసీ సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ కలిగి.. 6500 ఆర్‌పీఎమ్ వద్ద 5.9 పవర్, 5000 ఆర్‌పీఎమ్ వద్ద 9.8 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి పనితీరు స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుందని తెలుస్తోంది. ఇది సీవీటీ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది.
కొత్త టీవీఎస్ జుపిటర్ 110 స్పెషల్ ఎడిషన్.. టెలిస్కోపిక్ హైడ్రాలిక్ ఫ్రంట్ సస్పెన్షన్, వెనుక భాగంలో ట్విన్ ట్యూబ్ ఎమల్షన్ షాక్ అబ్జార్బర్ 3 స్టెప్ అడ్జస్టబుల్ పొందుతుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ఈ స్కూటర్ ముందు భాగంలో 220 మిమీ డిస్క్, వెనుక భారంతో 130 మిమీ డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి. రెండు వైపులా 90/90-12 ట్యూబ్‌లెస్ టైర్లు ఉన్నాయి. సుమారు 106 కేజీల (కర్బ్ వెయిట్) బరువున్న జుపిటర్ స్పెషల్ ఎడిషన్ సీటు 756 మిమీ పొడవు ఉంటుంది. ఇది రైడర్, పిలియన్ ఇద్దరికీ చాలా అనుకూలంగా ఉంటుంది.
ఫీచర్స్
జుపిటర్ 110 స్పెషల్ ఎడిషన్.. స్మార్ట్‌కనెక్ట్ కనెక్టివిటీ వాయిస్ అసిస్ట్, డిస్టెన్స్ టు ఎంప్టీ, ఫైండ్ మై వెహికల్, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, కాల్ అండ్ ఎస్ఎమ్ఎస్ అలర్ట్‌లతో పాటు న్యావిగేషన్ వంటి ఫీచర్స్ పొందుతుంది. పరిమాణం విషయానికి వస్తే.. ఈ స్కూటర్ పొడవు 1848 మిమీ, వెడల్పు 665 మిమీ, ఎత్తు 1158 మిమీ, వీల్‌బేస్ 1275 మిమీ, గ్రౌండ్ క్లియరెన్స్ 163 మిమీ వరకు ఉంటుంది. కాబట్టి ఇది అన్ని విధాలా చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇది రైడర్లకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.