ఆ పాన్‌ ఇండియా హీరోతో నటించాలనుంది: మిరాయ్‌ హీరోయిన్‌

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో.. తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ‘మిరాయ్‘ సినిమాతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న రితికా నాయక్.. అవకాశమొస్తే తాను పాన్ ఇండియా స్టార్ పక్కన నటించాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టింది. దీంతో అభిమానులు కూడా అప్పుడే వారి కాంబినేషన్‌ను ఊహించేసుకుంటున్నారు. ఇంతకీ తాను (రితికా నాయక్) నటించాలనుకుంటున్న ఆ స్టార్ హీరో ఎవరనేది ఇక్కడ తెలుసుకుందాం.

పాన్ ఇండియా హీరోతో..

తేజ సజ్జ, రితికా నాయక్ నటించిన.. మిరాయ్ సినిమా మంచి హిట్ సాధించేసింది. ఇప్పటి వరకు రితికా నాయక్ అంటే తెలియనివారు కూడా ఆమె గురించి తెలుసుకోవడానికి గూగుల్‌లో తెగ సెర్చ్ చేసేస్తున్నారు. అందం, అభినయంతో తదైనా రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు తాను ‘అల్లు అర్జున్‘తో సినిమా చేయాలని ఉందని చెప్పేసింది. తాను అల్లు అర్జున్ ఫ్యాన్ అని.. తనతో నటించే అవకాశం వస్తే వదులుకోను అని.. అది చిన్న పాత్ర అయినా సరే అని మనసులో మాట చెప్పింది.

బన్నీతో నటించాలనే తన మనసులో మాట చెప్పడంతో.. అటు అల్లు అర్జున్ అభిమానులు, రితికా నాయక్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. అంతే కాకుండా వారి కాంబినేషన్‌ను కూడా ఊహించేసుకుంటున్నారు. అయితే వీరిద్దరి సినిమా వస్తుందా?, రాదా?.. వస్తే ఎప్పుడు వస్తుంది? అనే విషయాలు మాత్రం భవిష్యత్తులో తెలుస్తాయి.

రితికా నాయక్ గురించి

నిజానికి ఢిల్లీకి చెందిన రితికా నాయక్.. విశ్వక్‌సేన్‌తో కలిసి అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమాలో నటించింది. ఆ తరువాత హాయ్ నాన్న అనే సినిమాలో కనిపించింది. ఇప్పుడు మిరాయ్ సినిమాలో పాపులర్ అయిపోయింది. మూడో సినిమాకే గొప్ప ఫేమ్ తెచ్చుకున్న ఈ అమ్మడు.. ఢిల్లీ ఒడియా కుటుంబానికి చెందినట్లు తెలుస్తోంది. అక్కడే తన విద్యాభ్యాసం పూర్తి చేసింది. 2022లో తెలుగు చిత్ర సీమలో అడుగుపెట్టింది. తాను నటించిన మొదటి సినిమాకే సైమా అవార్డు సొంతం చేసుకుంది.

మిరాయ్ సినిమా & రెమ్యునరేషన్ వివరాలు

తేజ సజ్జాకు బ్లాక్ బస్టర్ అందించిన మిరాయ్ సినిమాలో.. రితికా నాయక్ మాత్రమే కాకుండా.. మంచు మనోజ్, శ్రియ, జగపతిబాబు మొదలైనవారు కూడా నటించారు. ఈ సినిమా కోసం చిత్ర బృందం రూ. 50 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. కాగా ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే వివిధ భాషల్లో రూ. 12 కోట్లు వసూలు చేసిందని టాక్. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. ఈ రోజు వీకెండ్, రేపు ఆదివారం కావడంతో మరింత మంచి కలెక్షన్స్ వస్తాయని చెబుతున్నారు.

ఇక రెమ్యునరేషన్ విషయానికి వస్తే.. తేజ సజ్జ హనుమాన్ సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్ మాత్రమే తీసుకున్నట్లు సమాచారం. హనుమాన్ సినిమాకు తేజ రూ. 2 కోట్లు తీసుకున్నట్లు టాక్. దీన్నిబట్టి చూస్తే.. తేజ సజ్జ మిరాయ్ సినిమాకు కూడా రూ. 2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా మంచు మనోజ్, శ్రియ కూడా ఒక్కొక్కరు రూ. 2 కోట్లు పారితోషికంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. రితికా నాయక్ మాత్రం రూ. 50 లక్షలు తీసుకుందని చెబుతున్నారు.

Leave a Comment