ప్రేమించడం ఆనందం, ప్రేమించబడటం అదృష్టం అంటారు. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ ఎదో ఒక వయసులో, ఎదో ఒక సందర్భంలో ప్రేమలో పడతారు. ఇందులో సామాన్యులు, సెలబ్రిటీలు అని తేడా ఉండదు. అయితే ప్రతి ప్రేమ.. పెళ్లి వరకు చేరుతుందని మాత్రం చెప్పడం అసాధ్యం. ఎందుకంటే.. పెళ్లిళ్ల వరకు చేరిన ప్రేమలు చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. ఇటీవల ఓ సదస్సులో సాయిధరమ్ తేజ్ తన బ్రేకప్ స్టోరీ చెప్పారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
2014లో మొదటి సినిమా..
పిల్లా నువ్వు లేని జీవితం అనే సినిమాతో 2014లో తెలుగు సినిమా రంగంలో అడుగు పెట్టిన సాయిధరమ్ తేజ్.. ఆ తరువాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్, విన్నర్, జవాన్, చిత్రలహరి, విరూపాక్ష మొదలైన సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు అనే సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
బ్రేకప్ స్టోరీ..
గత కొన్ని రోజులుగా సాయిధరమ్ తేజ్ ఎక్కడ కనిపించినా.. ఎక్కువ మంది అడిగే ప్రశ్న పెళ్లి ఎప్పుడు అనే. ఇటీవల హైదరాబాద్ నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో కూడా తనకు ఇదే ప్రశ్న ఎదురైంది. పెళ్లి ఎప్పుడు అన్న విషయం తాను తప్పకుండా చెబుతా అని పేర్కొన్నారు. అంతే కాకుండా తన జీవితంలో కూడా ఒక బ్రేకప్ స్టోరీ ఉందని చెప్పాడు. ఇది చాలా విషాదకరమైన బ్రేకప్ స్టోరీ అని అన్నారు.
నేను నా కాలేజీ గర్ల్‌ఫ్రెండ్‌ని ప్రేమించాను. కానీ సినిమా హిట్టయింది, తరువాత పెళ్లి చేసుకోవడానికి సిద్దమయ్యారు, ఆ అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది, ఈ అమ్మాయితో నిశ్చితార్థం జరిగిందని పుకార్లు రావడంతో.. ఆ అమ్మాయి తట్టుకోలేకపోయింది. దీంతో బ్రేకప్ అయిపోయింది. నా పెళ్లి విషయం మీద అందరూ కొంత సంయమనం వహించాల్సి ఉంది. తప్పకుండా త్వరలోనే శుభవార్త చెబుతా అని సాయిధరమ్ తేజ్ చెప్పుకొచ్చారు.
అయినవాళ్లతో సమయం గడపాలి..
టెక్నాలజీ ఎంత పెరిగినా.. తల్లిదండ్రులు తమ జీవితంలో పిల్లలకు ప్రత్యేకమైన స్థానం, సమయం ఇవ్వాలి. ఇప్పటికి కూడా నా బెస్ట్ ఫ్రెండ్ అమ్మ. నేను అమ్మతో చాలా సరదాగా ఉంటాను. నా సెకండ్ క్లాస్ లవ్ స్టోరీ కూడా అమ్మతో చెప్పను. అంత ఫ్రెండ్లీగా అమ్మతో ఉంటాను. అమ్మే నా ప్రపంచం. అమ్మతో మాత్రమే కాకుండా.. మామయ్యలు, స్నేహితులతో కూడా సమయం గడుపుతాను. కాబట్టి తప్పకుండా మన జీవితంలో అందరికీ స్థానం ఇవ్వాలి. టెక్నాలజీ మాయలో పది అందరినీ దూరం చేసుకోకూడదని సాయిధరమ్ తేజ్ చెప్పారు. అంతే కాకుండా ఈ సందర్భంగా.. తన పేరును తల్లిపేరు వచ్చేలా ”సాయిదుర్గ తేజ్”గా మార్చుకున్నాడు.
2023 విడుదలైన విరూపాక్ష సినిమా తరువాత కూడా ఓ సందర్భంలో సాయిధరమ్ తేజ్ తన బ్రేకప్ స్టోరీ పంచుకున్నాడు. గతంలో కూడా ఒక అమ్మయితే బ్రేకప్ అయిందని చెప్పాడు. అప్పటి నుంచి అమ్మాయిలంటేనే భయమేస్తుందని చెప్పాడు. మొత్తం మీద సాయిధరమ్ తేజ్ జీవితంలో చాలానే బ్రేకప్ స్టోరీలు ఉన్నాయని అందరికి తెలిసింది. ఇక ఈ మెగా హీరో పెళ్లి ఎప్పుడు అనే విషయం తెలుసుకోవడానికి అభిమానులు వేచి చూస్తున్నారు.