‘మన ఊరి బండి’గా పేరుపొందిన టీవీఎస్ ఎక్స్ఎల్100 హెచ్‌డీ ఇప్పుడు సరికొత్త అప్డేట్ పొందింది. భారతదేశంలో ఎక్కువమంది గ్రామీణ ప్రజలకు ఇష్టమైన ఈ మోపెడ్.. రోజువారీ ప్రయాణానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ధర కూడా ఇతర టూవీలర్లతో పోలిస్తే కొంత తక్కువే కావడం గమనార్హం.
లేటేస్ట్ అప్డేట్ & ధరలు
టీవీఎస్ ఎక్స్ఎల్100 హెచ్‌డీ ఇప్పుడు.. అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఇదే ఇందులోని కొత్త అప్డేట్. దీని ధర రూ. 65,047 (ఎక్స్ షోరూమ్). ట్యూబ్‌లెస్ టైర్లతో.. 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందిన ఎక్స్ఎల్100 హెచ్‌డీ మెరుగైన మన్నికను అందించడం మాత్రమే కాకుండా.. భద్రతను కూడా అందిస్తుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ ఉండటం వల్ల దృశ్యమానత కూడా అద్భుతంగా ఉంటుంది. కొత్త కస్టమర్లను ఆకట్టుకోవడం భాగంగా.. ఇది లేటెస్ట్ గ్రాఫిక్స్, రీ డిజైన్డ్ టెయిల్‌లైట్స్ బ్లాక్ మఫ్లర్ పొందుతాయి. కాబట్టి ఇది చూడగానే ఆకట్టుకునేలా ఉంటుంది.
డిజైన్
కొత్త టీవీఎస్ ఎక్స్ఎల్100 హెచ్‌డీ మోపెడ్.. 2 పీస్ సీటును కలిగి.. పెద్ద ఫ్లోర్‌బోర్డ్ స్పేస్, అదనపు సౌలభ్యం కోసం మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ వంటివి కూడా పొందుతుంది. సీటు రైడర్, పిలియన్ ఇద్దరికీ అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా డంపింగ్‌తో కూడిన ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, వేరియబుల్ రేటెడ్ స్ప్రింగ్‌లతో కూడిన స్వింగ్ ఆర్మ్ రియర్ సస్పెన్షన్ వంటివి కఠినమైన భూభాగాల్లో కూడా మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.
టెక్నాలజీ విషయానికి వస్తే.. కొత్త ఎక్స్ఎల్100 హెచ్‌డీ అల్లాయ్.. ఎకో థ్రస్ట్ ఫ్యూయల్ ఇంజక్షన్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఇది సాధారణ మోపెడ్ కంటే కూడా 15 శాతం ఎక్కువ మైలేజ్ అందిస్తుంది. ఇంజిన్ ఆటోమేటిక్‌గా స్విచ్ ఆఫ్ చేసే టిల్ట్ సెన్సార్ పొందుతుంది.
ఇంజిన్ వివరాలు
టీవీఎస్ ఎక్స్ఎల్100 హెచ్‌డీ మోపెడ్ 99.7 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ ఇంజెక్టెడ్ ఇంజిన్ ద్వారా 6000 ఆర్‌పీఎమ్ వద్ద 4.3 బీహెచ్‌పీ పవర్.. 3500 ఆర్‌పీఎమ్ వద్ద 6.5 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ మోపెడ్ టాప్ స్పీడ్ గంటకు 58 కిమీ. ఇంజిన్ సెంట్రిఫ్యూగల్ వెట్ క్లచ్, చైన్ డ్రైవ్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి.. మంచి పనితీరును అందిస్తుంది. 89 కేజీల బరువున్న ఈ మోపెడ్ 150 కేజీల బరువును మోసే కెపాసిటీ కలిగి ఉంటుంది.
కలర్ ఆప్షన్స్ & వేరియంట్స్
కొత్త టీవీఎస్ ఎక్స్ఎల్100 హెచ్‌డీ మొత్తం మూడు రంగుల్లో లభిస్తుంది. అవి రెడ్, బ్లూ, గ్రే కలర్స్. ఎక్స్ఎల్100 హెచ్‌డీ మల్టిపుల్ వేరియంట్లలో లభిస్తుంది. ప్రారంభ ధర రూ. 47,754 కాగా.. టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 65,047 (ఎక్స్ షోరూమ్)
➤హెవీ డ్యూటీ: రూ. 47,754
➤హెవీ డ్యూటీ ఐ-టచ్‌స్టార్ట్: రూ. 60,405
➤హెవీ డ్యూటీ ఐ- టచ్‌స్టార్ట్ విన్ ఎడిషన్: రూ. 63,347
➤కంఫర్ట్ ఐ-టచ్‌స్టార్ట్: రూ. 63,705
➤ఎక్స్ఎల్100 హెచ్‌డీ: రూ. 65047 (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)
ఇండియన్ మార్కెట్లో టీవీఎస్ కంపెనీకి చెందిన మోపెడ్ టూవీలర్లకు డిమాండ్ ఎక్కువగానే ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్స్ లాంచ్ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఎక్స్ఎల్100 హెచ్‌డీ లాంచ్ చేయడం జరిగింది. ఇది ప్-అండగా సమయంలో మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉందని భావిస్తున్నాము.