భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం.. సర్వమత సమ్మేళనం. కాబట్టి దేశంలోని ప్రతి రాష్ట్రానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతే.. ఆ ప్రాంతం చరిత్ర, సంస్కృతిని తెలియజేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ విషయానికి వస్తే.. ఇక్క బతుకమ్మ పండుగకు ఓ విశేషమైన ఆదరణ ఉంది. ఈ బతుకమ్మ పండుగ సెప్టెంబర్ 21న జరగనుంది. అంతకంటే ముందు తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ‘బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్ 2025‘ పేరుతో షార్ట్ ఫిల్మ్, పాటలు పోటీ నిర్వహించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నేపథ్యం & చివరి తేదీ
తెలంగాణ పండుగలు, ప్రజాపాలన, చరిత్ర, సంస్కృతీ నేపధ్యాన్ని వివరించేలా కంటెంట్ ఉండాలని.. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు పేర్కొన్నారు. ఈ పోటీలో సృజన శీలులు 40 ఏళ్ల కంటే తక్కువ వయసున్న ఎవరైనా పాల్గొనవచ్చు. ఇందులో పాల్గొనడానికి లేదా ఎంట్రీలను పంపించడానికి చివరి తేదీ 2025 సెప్టెంబర్ 30 అని వెల్లడించారు.
వీడియో & పాట నిడివి
రాష్ట్రంలోని యువకుల సృజనాత్మకతను వెలికితీయడమే ధ్యేయంగా.. ఈ బతుకున్ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలంజ్ పేరిట పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనేవారు.. తెలంగాణ సీఎం రేవంత్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి.. లేదా తెలంగాణ చరిత్ర, పండుగలకు సంబంధించిన నేపథ్యంలో షార్ట్ ఫిల్మ్స్ లేదా పాటలు రూపొందించాల్సి ఉంటుంది. అయితే కంటెస్టెంట్స్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. షార్ట్ ఫిల్మ్ నిడివి 3 నిముషాలు.. పాట నిడివి ఐదు నిమిషాలు మాత్రమే ఉండేలా చూసుకోవాలి.
వీడియోలు 4కే రిజల్యూషన్ కలిగి ఉండాలి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. షార్ట్ ఫిల్మ్ లేదా పాటలు తప్పకుండా థీమ్ అనుసరించాల్సిందే. అంతే కాకుండా మీరు చేసిన వీడియో లేదా పాట ఇప్పటివరకు ప్రదర్శించి ఉండకూడదు లేదా రిలీజ్ చేసే ఉండకూడదు. ప్రత్యేకంగా బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ కోసమే చిత్రరేకరించి ఉండాలి.
ప్రైజ్ మనీ వివరాలు ఇలా..
బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ పోటీల్లో గెలుపొందినవారికి ప్రైజ్ మనీ అందిస్తారు. మొదటి బహుమతికి రూ. 3 లక్షలు, రెండో బహుమతికి రూ. 2 లక్షలు, మూడో బహుమతిగా రూ. 1 లక్ష ప్రైజ్ మనీ అందించడం జరుగుతుంది. కన్సోలేషన్ బహుమతిగా ఐదుగురికి రూ. 20వేలు ఇవ్వడం జరుగుతుంది. అంతే కాకుండా విజేతలందరికి కూడా ప్రశంసాపత్రంతో పాటు.. జ్ఞాపికను కూడా ప్రధానం చేస్తారు. నిర్దేశిత గడువు లోపల వచ్చిన ఎంట్రీలను నిపుణులతో కూడిన జ్యూరీ వీక్షించి.. కేటగిరీలుగా ఎంపిక చేస్తారు.
యూట్యూబ్ లేదా ఇతర సోషల్ మీడియాలలో వీడియోలు చేస్తున్నవారు మరింత గుర్తింపు తెచ్చుకోవడానికి లేదా తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇదొక మంచి అవకాశం. ఈ పోటీలో గెలుపొంచినవారికి భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి లేదా సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా కొన్ని అవకాశాలు లభించే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఓ మంచి కాన్సెప్ట్ తీసుకుని.. విజయం పొందాలని ఆశిస్తున్నాము.