బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడే.. బిగ్‌బాస్ సీజన్ 9 రియాలిటీ షో మొదలై రెండువారాలు గడుస్తోంది. మొదటివారంలోనే కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ బయటకు వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. అయితే ఇప్పటికి బయటకు వచ్చిన సమాచారం ప్రకారం.. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయే జాబితాలో ఇద్దరిపేర్లు వినిపిస్తున్నాయి.
భారీగా తగ్గిన టీఆర్పీ రేటింగ్!
కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ వెర్షన్‌లో సాగుతున్న గేమ్.. అనుకున్నంత ఆకట్టుకునే విధంగా లేదని ప్రేక్షకులు చెబుతున్నారు. దీంతో ఈ ఏడాది టీఆర్పీ రేటింగ్ కూడా బాగా తగ్గిపోయింది. ఈ రేటింగ్ అంతకు ముందు జరిగిన అన్ని సీజన్స్ కంటే చాలా తక్కువ కావడం గమనార్హం. బిగ్‌బాస్ రియాలిటీ షోకు.. ఒకప్పుడు ఉన్నంత ఆదరణ ఇప్పుడు లేదు అని చెప్పడానికి ఇదే నిదర్శనం. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో జరుగుతున్నవన్నీ గమనించి.. హోస్ట్ నాగార్జున వారాంతంలో గట్టిగానే క్లాస్ తీసుకుంటున్నారు.
ముందుకు దూసుకెళ్తున్న సుమన్ శెట్టి
బిగ్‌బాస్ సీజన్ 9 రెండో వారంలో మొత్తం 7మంది హౌస్‌మేట్స్ నామినేషన్స్‌లో ఉన్నారు. సుమన్ శెట్టి, ఫ్లోరా షైనీ, హరిత హరీష్, డీమాన్ పవన్, భరణి, మర్యాద మనీష్ నామినేట్ అయినప్పటికీ.. ఓటింగ్ విషయంలో మాత్రం సుమన్ శెట్టి, భరణి ముందు వరుసలో ఉన్నారు. అమాయకత్వం, నిజాయితీ వంటివి సుమన్ శెట్టిని కాపాడుతున్నాయి. దీంతో ఇతడు ఓటింగ్ విషయంలో దూసుకెళ్తున్నాడు. మిగిలినవారికి కూడా కొంత పాజిటీవ్ ఓటింగ్ వచ్చింది.
మర్యాద మనీష్ అవుట్?
ఇక రెండోవారం ఎలిమినేషన్ విషయానికి వస్తే మాత్రం.. మర్యాద మనీష్, ప్రియా ఇద్దరు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికి సోషల్ మీడియా ద్వారా వెల్లడైన సమాచారం ప్రకారం.. ఈ ఇద్దరిలో మర్యాద మనీష్ రెండోవారం హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానప్పటికీ.. సోషల్ మీడియా టాక్ మాత్రం ఇదే. ఇదే జరిగితే ప్రియా సేఫ్ జోన్‌లోకి వెళ్లినట్లే అని తెలుస్తోంది.
మనీష్ ఎలిమినేటి అవ్వడానికి కారణాలు
నిజానికి కామన్ మెన్ కేటగిరిలో బిగ్‌బాస్ హౌస్‌లోకి మర్యాద మనీష్ శ్రీజ, ప్రియలకు అనుకూలంగా ఉండటం, ఇమ్మాన్యుయేల్ విషయంలో అతని వ్యతిరేఖ వైఖరి అనే తెలుస్తుంది. ఇది ఆడియన్స్‌కు నచ్చలేదు. దీంతో అతన్ని హౌస్ నుంచి బయటకు పంపించేయాలని ఫిక్స్ అయ్యారు. ఆడియన్స్ ఒకసారి అనుకుంటే.. అది జరగకుండా ఉంటుందా?, అదే మర్యాద మనీష్ కొంప ముంచిందని సమాచారం.
మర్యాద మనీష్ రెమ్యునరేషన్ ఎంతంటే?
ఇప్పటి వరకు సోషల్ మీడియా ద్వారా వెల్లడైన సమాచారం ప్రకారం.. మర్యాద మనీష్‌కు వారానికి రూ. 70వేలు ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇదే నిజమైతే ఇతడు రెండు వారాలకు రూ. 1.40 లక్షలు సంపాదించినట్లు అర్థమవుతుంది. అయితే ఏ రెమ్యునరేషన్ వివరాలు కేవలం అంచనా మాత్రమే. దీనికి సంబంధించిన విషయాలు అధికారికంగా వెల్లడికాలేదు. కాబట్టి రెమ్యునరేషన్ అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. దీని గురించి ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవాలంటే?.. మనీష్ స్పందించాల్సిందే!