అప్పుడు టారిఫ్స్.. ఇప్పుడు హెచ్-1బీ వీసా: ఫీజు రూ.88 లక్షలు పెంచిన ట్రంప్!

డొనాల్ట్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచంలోని చాలా దేశాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రతీకార సుంకాలతో ముప్పుతిప్పలు పెట్టిన ట్రంప్.. ఇప్పుడు హెచ్-1బీ వీసా దరఖాస్తులకు 1,00,000 డాలర్లు (రూ. 88 లక్షల కంటే ఎక్కువ) ఫీజు విధించాలని సంకల్పించారు. దీనిని వైట్ హౌస్ కూడా సమర్థిస్తూ ఒక ఫ్యాక్ట్ షీట్ రిలీజ్ చేసింది.

వైట్ హౌస్ ప్రకారం.. 2003 ఆర్ధిక సంవత్సరంలో హెచ్-1బీ వీసాలు పొందిన ఐటీ కార్మికుల వాటా 32 శాతంగా ఉండేది. ఇది ఇప్పుడు 65 శాతానికి చేరింది. హెచ్-1బీ వీసాల దుర్వినియోగం కారణంగా.. అమెరికాలో నిరుద్యోగులు పెరుగుతున్నారని చెబుతున్నారు. కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్లలో 6.1 శాతం నిరుద్యోగం, కంప్యూటర్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లలో 7.5 శాతం నిరుద్యోగం ఉందని గణాంకాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం విదేశీ కార్మికుల సంఖ్య చాలా పెరిగింది. ఇదే నిరుద్యోగం పెరగడానికి ప్రధాన కారణమైందని సమాచారం.

స్వదేశీయలు కోసం.. ట్రంప్ నిర్ణయం!

2025 ఆర్ధిక సంవత్సరంలో ఒక కంపెనీ 5189 మంది హెచ్-1బీ కార్మికులకు ఆమోదం తెలిపింది. మరో కంపెనీ 1698 హెచ్-1బీ కార్మికలు ఆమోదం తెలిపింది. ఇలా కంపెనీలు ఎవరికివారు హెచ్-1బీ వీసా కార్మికులకు ఉద్యోగాలు కల్పిస్తుంటే.. వేలాదిమంది అమెరికన్స్ ఉద్యోగాలను కోల్పోతున్నారు. దీనిని దృషిలో ఉంచుకునే.. ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్ హౌస్ స్పష్టం చేసింది.

హెచ్-1బీ వీసా రుసుమును పెంచడం వల్ల.. దేశాన్ని వీడే విదేశీయుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఇది అమెరికన్ ప్రజలకు ఉద్యోగాలను కల్పిస్తుంది. మనదేశంలో (అమెరికా) ఉండే ప్రజలు ఉద్యోగాల కోసం ఇబ్బందిపడటం ఏ మాత్రం సమంజసం కాదని వైట్ హౌస్ వెల్లడించింది. అంతే కాకుండా పెట్టుబడులు ఆకట్టుకోవడానికి కూడా ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కొత్త వాణిజ్య ఒప్పందాల గురించి ఇప్పటికే చర్చలు జరిపినట్లు కూడా వైట్ హౌస్ పేర్కొంది.

భారతీయలపై ప్రభావం!

డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న హెచ్-1బీ వీసాకు సంబంధించిన నిర్ణయం.. భారతీయులపై పెద్ద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఈ చర్య అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్న ఉద్యోగులను స్వస్థలాలు పంపిస్తుందని భావిస్తున్నారు. దీనిపై భారత ప్రభుత్వం కూడా యోచిస్తోంది. ఈ విషయంపై సంప్రదింపులు జరుపుతామని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.

ట్రంప్ చర్యపై భిన్నాభిప్రాయాలు!

నిజానికి అమెరికా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం.. తమ దేశంలోని పౌరులకు ఎంతో మేలు చేస్తుంది. తన దేశంలో నిరుద్యోగం ఉన్న సమయంలో.. అక్కడి కంపెనీలు ఇతర దేశీయులకు ఉద్యోగాలు ఇవ్వడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. దీనినే ట్రంప్ చెబుతున్నారు. అయితే ఈ నిర్ణయం వల్ల ఇతర దేశీయులకు నష్టాన్ని కలిగించవచ్చు. కానీ తమ దేశం బాగుండాలంటే.. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉండదని కొందరు నిపుణులు చెబుతున్నారు.

ట్రంప్ చర్య ఎంత సమర్ధనీయమే అయినా.. ఉద్యోగాలు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం అమెరికాలో 50 లక్షల కంటే ఎక్కువమంది భారీయులు ఉన్నట్లు చెబుతున్నారు. ఒక్క భారతీయులు మాత్రమే ఇంతమంది ఉంటే.. ఇతర దేశీయులు ఎంతమంది ఉంటారో ఊహించుకోవచ్చు. ఇంతమంది ప్రజలపై ట్రంప్ నిర్ణయం ప్రభావం చూపే అవకాశం ఉంది.

Leave a Comment