చలో సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసిన రష్మిక మందన్న.. గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు వంటి సినిమాల్లో అగ్ర హీరోల సరసన నటించడం మాత్రమే కాకుండా.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు తాజాగా హృతిక్ రోషన్ సరసన నటించడానికి సిద్దమైనట్లు సమాచారం.
క్రిష్ 4లో నేషనల్ క్రష్?
క్రిష్ 4 సినిమా విడుదలకు చిత్ర బృందం సిద్ధమవుతోంది. అయితే ఇప్పటి వరకు ఈ క్రిష్ సిరీస్ సినిమాల్లో ప్రియాంక చోప్రా నటించింది. అయితే క్రిష్ 4 సినిమాలో హీరోయిన్ ఛాన్స్ రష్మిక మందన్న కొట్టేసినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే.. ప్రియాంక చోప్రా స్థానానికే ఎసరుపెట్టినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన సమాచారం అధికారికంగా వెలువడలేదు. ప్రస్తుతానికి ఇది రూమర్ మాత్రమే.
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. హాలీవుడ్ రంగంలో స్థిరపడిపోవడం వల్ల, క్రిష్ 4 సినిమాకు ప్రత్యామ్నాయం వెతుక్కోవాల్సి వచ్చింది. దీంతో చిత్ర బృందం కన్ను నేషనల్ క్రష్ రష్మిక మందన్న మీద పడింది. అయితే ఈమెను ఇంకా ఫైనల్ చేయలేదని తెలుస్తోంది. క్రిష్ సినిమాలో ఛాన్స్ వచ్చిందంటే.. రష్మిక సినీ రంగంలో ఓ పెద్ద అడుగు ముందుకు వేసినట్లే అవుతుంది. ఇప్పటికే ఈమె కాక్టెయిల్ 2, థామ హిందీ సినిమాల్లో కూడా నటిస్తోంది. ది గర్ల్ ఫ్రెండ్ లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా రష్మిక కీలక రోల్ ప్లే చేసింది.
2027లో రిలీజ్?
ఇప్పటి వరకు యానిమల్, పుష్ప సినిమాల్లో నటించి మంచి పేరుతెచ్చుకున్న రష్మిక మందన్న.. హృతిక్ రోషన్ సరసన నటించలేదు. అయితే క్రిష్ 4 లో ఛాన్స్ వస్తే మాత్రం.. ఈ జంట తెరమీద మొదటిసారి కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్ 2026 మధ్యలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. బహుశా 2027లో రిలీజ్ అవుతుందని సమాచారం.
హృతిక్ రోషన్.. క్రిష్ 4 సినిమాలో హీరో మాత్రమే కాకుండా, దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఈ సినిమా కోసం రూ. 500 కోట్ల నుంచి రూ. 700 కోట్ల బడ్జెట్ కేటాయించనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇతర నటులను ఎంపిక చేసుకోవడానికి కూడా చిత్ర బృందం త్వరపడుతోంది.
క్రిష్ సినిమా గురించి?
సినిమా రంగంలో సంచలన విజయం సాధించిన హృతిక్ రోషన్ క్రిష్ 2006లో ప్రారంభమైంది. 2013లో క్రిష్ 3 రిలీజ్ అయ్యాయి. ఇక క్రిష్ 4 సినిమా 2017లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన ఈ సినిమా.. భారీ వసూళ్లను సొంతం చేసుకుంది. క్రిష్ 4 కూడా మంచి విజయం సాదిస్తుందని ఆశిస్తున్నాము.
రష్మిక మందన్న
2018లో చలో సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టిన రష్మిక మందన్న.. ప్రస్తుతం ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్స్ జాబితాలో ఒకరుగా ఉన్నారు. ప్రస్తుతం ఈమె ఒక్కో సినిమాకు రూ. 5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇకపోతే ఈమె క్రిష్ 4 సినిమాలో నటిస్తే.. ఈ పారితోషికం డబుల్ అయినా.. ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు.