డార్లింగ్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ మూవీ ట్రైలర్‌ను ‘ది బిగ్గెస్ట్ హారర్ ఫాంటసీ ఎవర్ ఇన్ ఇండియన్ సినిమా’ అనే పేరుతో.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా రిలీజ్ చేసింది. టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ కొత్త సినిమా ట్రైలర్ అభినుల్లో కొత్త ఉత్సాహాన్ని.. సినీ పరిశ్రమలో భారీ అంచనాలను పెంచేసింది.
రాజా సాబ్ రిలీజ్ డేట్
ప్రభాస్ రాజా సాబ్.. ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. విడుదలైన కొన్ని గంటల వ్యవధిలోనే.. మిలియన్ వ్యూస్ పొందిన ఈ సినిమా 2026 జనవరి 9న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ప్రభాస్ హీరో కాగా.. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్ పాత్రల్లో నటించారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రత్యేక పాత్రలో కనిపించరు. ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు.
ఆదిపురుష్ సినిమా తరువాత.. ప్రభాస్ కన్నప్ప సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఇప్పుడు రాజా సాబ్ సినిమాలో నటించారు. ఇప్పుడు విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అభిమానుల అంచనాలను సైతం దాటేసింది. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు ఒక లెక్క.. ఈ సినిమా ఓ లెక్క అనే రేంజిలో ఈ సినిమా ఉందని అభిమానులు తెగ సంతోషపడుతున్నారు.
ది రాజా సాబ్ సినిమాలో.. మళ్ళీ పాత ప్రభాస్ కనిపించారు. మిర్చి సినిమా తరువాత.. అలాంటి బాడీ లాంగ్వేజ్ గానీ డైలాగ్ డెలివరీ గానీ మళ్ళీ కనిపించలేదని చాలామంది కొంత నిరాశపడ్డారు. ఆ తరువాత వచ్చిన బాహుబలి సినిమాతో ప్రభాస్ దాదాపు మారిపోయారని అనిపించింది. కానీ ఇన్నేళ్లకు మళ్ళీ ప్రభాస్ రొమాంటిక్ లుక్‌లో కనిపించారు.
యాక్షన్, రొమాంటిక్ సినిమాల్లో కనిపించిన ప్రభాస్ ఎప్పుడూ హారర్ సినిమాల్లో కనిపించలేదు. ఇప్పుడు మొదటిసారి ప్రభాస్ హారర్ సినిమాలో కూడా కనిపించేసారు. డైరెక్టర్ మారుతి మార్క్ ఇప్పుడు విడుదలైన ట్రైలర్‌లో కనిపించింది. తనకి ఎప్పుడూ అలవాటైన కామెడీ, రొమాన్స్ తెరకెక్కించడంలో మారుతికి ఓ ప్రత్యేకమైన శైలి ఉంది. కాబట్టి రాజా సాబ్ సినిమాలో ఏది వదిలిపెట్టకుండా.. అటు కామెడీ, ఇటు రొమాన్స్ మాత్రమే కాకుండా హారర్ కూడా అందిస్తూ.. ఊర మాస్ ఫైట్ కూడా అభిమానుల కోసం అందించినట్లు ఇట్టే అర్థమైపోతుంది.
ప్రత్యేక పాత్రలో సంజయ్ దత్
రాజా సాబ్ సినిమాలో ఒక్కో పైట్ అద్భుతంగా ఉన్నట్లు తెలుస్తోంది. రొమాన్స్, కామెడీలో ప్రభాస్ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హారర్ సీన్స్ కూడా ప్రేక్షకులను భయపెట్టే విధంగా ఉన్నాయి. ప్రత్యేక పాత్రలో నటించిన సంజయ్ దత్ కూడా తనదైన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఒదిగిపోయారు.
డైరెక్టర్ మారుతి స్టైల్ ప్రభాస్.. ఈ రాజా సాబ్ సినిమాలో కనిపించారు. స్టోరీ పరంగా ఏదో బలంగా చెప్పదలచుకున్నట్లు ట్రైలట్ చెప్పకనే చెప్పేస్తోంది. ప్రభాస్ నటన గురించి చెప్పడానికి మాటల్లేవ్ అనే చెప్పాలి. ”ఇందిరా మీ బాధ.. పుట్టలో చేయి పెడితే కుట్టడానికి నేనేమైన చీమనా?, రాక్షసుణ్ణి” అనే డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోతోంది. ఇక ఈ సినిమా చూడాలంటే 2026 జనవరి 9 వరకు వేచి చూడాల్సిందే!.