నిరాడంబరంగా నిశ్చితార్థం!.. విజయ్ & రష్మికల పెళ్లి ఎప్పుడంటే?

కొన్నాళ్లుగా హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న ఎక్కడ కనిపించినా.. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని, డేటింగ్‌లో ఉన్నారని కొన్ని పుకార్లు తెరమీదకు వస్తూనే ఉన్నాయి. ఈ పుకార్లకు చెక్ పెట్టి.. వీరిరువురు నిశ్చితార్థం చేసుకున్నట్లు తాజాగా కొన్ని వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఈ వార్త నిజమేనా? ఒట్టి గాసిప్ మాత్రమేనా?.. దీనిపై విజయ్, రష్మిక ఏమైనా స్పందించారా? అనే విషయాలను ఈ కథనంలో చూసేద్దాం.

విజయ్ & రష్మికల ఎంగేజ్‌మెంట్!

నటి రష్మిక మందన్న, నటుడు విజయ్ దేవరకొండ గీత గోవిందం సినిమాలో జంటగా నటించారు. ఆ తరువాత డియర్ కామ్రేడ్ చిత్రంలో కనువిందు చేశారు. అయితే ఆ తరువాత కాలంలో వీరిద్దరిపై కొన్ని పుకార్లు రావడం మొదలయ్యాయి. దీనికి తోడు.. ఈ జంట అప్పుడప్పుడు విమానాశ్రయాల్లో కూడా కనిపించారు. దీంతో ఆ పుకార్లకు మరింత బలం వచ్చింది. అంతే కాకుండా గతంలో కూడా ఈ జంట ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అవన్నీ నిజం కాదని తెలిసిపోయింది. ఇప్పుడు తాజాగా ఇదే న్యూస్ మళ్ళీ తెరమీదకు వచ్చింది.

పెళ్లి ఎప్పుడంటే?

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇద్దరూ.. కొంతమంది సన్నిహితులతో హైదరాబాద్‌లోని విజయ్ దేవరకొండ నివాసం నిశ్చితార్థం చేసుకున్నారని సమాచారం. వీరి పెళ్లి 2026 ఫిబ్రవరిలో ఉంటుందని కూడా చెబుతున్నారు. అయితే దీనిపై విజయ్ దేవరకొండ గానీ, రష్మిక గానీ ఎవరూ అధికారికంగా స్పందించలేదు. కాబట్టి నిశ్చితార్థం నిజమా?, కాదా అనే విషయం తెలుసుకోవాలంటే.. వీరిలో ఎవరో ఒకరు స్పందించాల్సి ఉంటుంది. అప్పటివరకు ఇది ఎంతవరకు నిజం అనే విషయాన్ని స్పష్టంగా వెల్లడించలేము.

చాలాకాలంలో విజయ్, రష్మికలపై వస్తున్న పుకార్లపై.. అప్పుడప్పుడు రష్మిక స్పందించింది. కొన్ని ఇంటర్వ్యూలలో విజయ్ దేవరకొండ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా కొన్ని పండుగలకు రష్మిక.. విజయ్ ఇంట్లో కనిపించింది. విజయ్ దేవరకొండ కూడా వీరి బంధం గురించి ఎప్పుడూ బయటపెట్టలేదు. కానీ పుకార్లు మాత్రం అలా.. అలా పెరుగుతూనే ఉన్నాయి. కాగా ఇప్పుడు ఈ జంట నిశ్చితార్థం చేసుకున్న మాట నిజమే అని కొందరు సన్నిహితులు చెబుతున్నారు. కానీ నిశ్చితార్థం జరిగిందనే చెప్పే ఫోటోలు లేదా వీడియోస్ బయటకు రాలేదు. కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా ద్రువీకరించలేకపోతున్నాము.

రష్మిక మందన్న గురించి

1995 ఏప్రిల్ 5న జన్మించిన రష్మిక మందన్న 2014లో కిరిక్ పార్టీ అనే చిత్రంతో.. సినిమా రంగంలో అడుగుపెట్టింది. ఆ తరువాత కన్నడలో పునీత్ రాజ్ కుమార్ సరసన అంజనీ పుత్ర సినిమాలో కనిపించింది. తెలుగులో ఈమె మొదటి సినిమా చలో. ఆ తరువాత గీత్ గోవిందం, సరిలేరు నీకెవ్వరూ, భీష్మ, పుష్ప సినిమాల్లో కనిపించి బాగా పాపులర్ అయింది. తన నటనకుగానూ ఈమె.. ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను సైతం సొంతం చేసుకుంది.

విజయ్ దేవరకొండ గురించి

1989 మే 9న జన్మించిన విజయ్ దేవరకొండ.. నువ్విలా సినిమాతో సినిమా రంగంలోకి అడుగుపెట్టినప్పటికీ.. అర్జున్ రెడ్డి సినిమాతో తెరపైకి వచ్చాడు. ఆ తరువాత రష్మికతో నటించిన గీత గోవిందం ఇతనికి మంచి హైప్ అందించింది. ఆ తరువాత వచ్చిన సినిమాలు చెప్పుకోదగ్గ స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయాయి. ఈయన కూడా పలు అవార్డులను అందుకున్నారు.