తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో.. ఈ రోజు (అక్టోబర్ 8) డ్యూడ్ సినిమా టీమ్ తిరుపతికి చేరుకున్నారు. ఈ సినిమా ఈ నెల 17వ తేదీన దీపావళి సందర్బంగా థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే చిత్ర యూనిట్ ప్రొమోషన్స్ ప్లాన్ చేసింది.
లవ్‌టుడే, డ్రాగన్ వంటి సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో అత్యంత విజయం సాధించడంతో.. ప్రదీప్ రంగనాథ్ ఇక్కడ యువతలో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఇప్పుడు తాజాగా డ్యూడ్ సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథ్ మంచి యంగ్ లుక్ మరియు డిఫరెంట్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి కాబట్టి.. అతన్ని యూత్ ఎక్కువగా ఇష్టపడుతారు. అందుకోసమే మూవీ ప్రమోషన్ ప్రోగ్రామ్‌ను తిరుపతి నగరంలో నిర్వహించడం జరుగుతోంది.
డ్యూడ్ మూవీ టీమ్ తిరుపతి షెడ్యూల్
మొదటగా తిరుపతిలో ఉన్న ప్రెస్ అండ్ మీడియాతో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇందులో డ్యూడ్ టీమ్ పాల్గొని సినిమాకి సంబంధించిన షూటింగ్, రిలీజింగ్, పాటలు, నటీనటుల వ్యక్తిగత అంశాలతో పాటు మరిన్ని మూవీ విషయాలను మీడియాతో పంచుకుంటారు. ఆ విశేషాలు సమావేశం తరువాత మనం సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో చూడచ్చు.
విద్యార్థులతో చిట్‌చాట్
ఈ మీడియా సమావేశం అనంతరం తిరుపతిలోని కరకంబాడి రోడ్డులో ఉన్న శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో గ్రీట్ అండ్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాలేజీలో ఉన్నటువంటి ఇంజినీరింగ్ విద్యార్థులతో చిట్‌చాట్ చేస్తారు. యూత్ ఎక్కువ ఫ్యాన్స్ కాబట్టి వారిని మరింత ఉత్సహాపరచి సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేయనున్నారు. హీరో ప్రదీప్ కోసం ఎంతో విద్యార్థులు ఎదురుచూసే అవకాశం ఉంటుంది. అయితే మూవీ టీమ్ అంతా ఏ విధంగా సందడి చేస్తుందో చూడాలి అంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే.
శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రోగ్రాం అయిపోయిన తరువాత.. అక్కడ నుంచి మరో కాలేజీలో కూడా విద్యార్థులతో మూవీ టీమ్ ముచ్చటించనుంది. అది తిరుపతి – తిరుచానూరు హైవే పక్కన ఉన్న రాయలచెరువు రోడ్డులో కేసీ పేటని ఆనుకోని ఉన్న మెడ్ జీ (అన్ అకాడమీ) కాలేజీలో ఈ ఈవెంట్ నిర్వహిస్తారని సమాచారం. సాయంత్రం ఐదు గంటలకు ఈ సమావేశం జరుగుతుందని తెలుస్తోంది. మెడ్ జీ కాలేజీలో కూడా అక్కడి స్టూడెంట్స్‌తో ఫన్ క్రియేట్ చేసి సినిమా పట్ల ఆసక్తిని కలిగించే కార్యక్రమం చేయనున్నారు.
రెండు రాష్ట్రాల ఆదరణ కోసం
ఈ ఈవెంట్స్‌తో డ్యూడ్ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రల్లో అధిక ఆదరణ లభించే అవకాశం ఉంది. లవ్‌టుడే, డ్రాగన్ సినిమాలు ప్రేక్షకులను ఎంతోగానో అలరించాయి. ఆ రెండు కూడా మంచి కథా వస్తువు మరియు నటన ఉన్న సినిమాలు. కాబట్టి ప్రదీప్ రంగనాథ్ మీద హై ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఈ డ్యూడ్ కూడా అంతే కథా బలంతో నటతో ఉంటుందని ఆశిద్దాం. ఈ సినిమాలో హీరోయిన్‌గా మమిత బైజు నటించారు.