మొన్న నాగార్జున.. నేడు రాజ్ కుమార్: సెలబ్రిటీలు కొనేస్తున్న జర్మన్ బ్రాండ్ కారు!

సాధారణంగా సెలబ్రిటీలు.. తమకు నచ్చిన కార్లను ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తుంటారని గతంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం, తెలుసుకున్నాం. ఇప్పుడు తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు.. జపనీస్ బ్రాండ్ అయిన లెక్సస్ ఎల్ఎమ్350హెచ్ కారును కొనుగోలు చేశారు. ఈ కారు గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.. ఇక కథనంలోకి వెల్లిపోదాం..

కొత్త లెక్సస్ ఎల్ఎమ్350హెచ్

నటుడు రాజ్ కుమార్ రావు.. కొనుగోలు చేసిన లెక్సస్ ఎల్ఎమ్350హెచ్ అనేది మార్కెట్లో అత్యంత ప్రజాదరణపొందిన హైఎండ్ ఎంపీవీ. ఇప్పటీ పలువురు సెలబ్రిటీలు ఈ కారును కొనుగోలు చేసి ఉపయోగిస్తున్నారు. ఈ జాబితాలో టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున కూడా కొనుగోలు చేశారు.

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫోటోలను గమనించినట్లయితే.. ఇందులో రాజ్ కుమార్ రావు బూడిదరంగులో (సోనిక్ టైటానియం క్లాసీ షేడ్) ఉన్న కొత్త లెక్సస్ ఎల్ఎమ్350హెచ్ కారును గమనించవచ్చు. ఈ కారుకు విఐపీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ 7770 ఉండటం చూడవచ్చు. ఇదే నెంబర్ తన బెంజ్ జీఎల్ఎస్ కారుకు ఉంది.

లెక్సస్ ప్రీమియం కాదు

రాజ్ కుమార్ రావు కొనుగోలు చేసిన లెక్సస్ ఎల్ఎమ్350హెచ్ ధర రూ. 2.7 కోట్లు (ఎక్స్ షోరూమ్), అయితే ముంబై ఆన్ రోడ్ ధర రూ. 3.18 కోట్లు అని తెలుస్తోంది. ఈ ప్రీమియం కారు మంచి డిజైన్ పొందుతుంది. దీని ముందు భాగంలో పెద్ద గ్రిల్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, బంపర్‌పై నిలువుగా పేర్చినట్టు ఉండే ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్‌లు, ఎల్ఈడీ డీఆర్ఎల్ వంటివి ఉన్నాయి. ఇది నాలుగు సీట్లు, ఏడు సీట్ల కాన్ఫిగరేషన్లో అందుబాటులో ఉన్నప్పటికీ.. రాజ్ కుమార్ రావు నాలుగు సీట్లు కలిగిన వేరియంట్ కొనుగోలు చేశారు. ఈ కారులో రెండు కెప్టెన్ సీట్లు ఉంటాయి.

ఫీచర్స్ విషయానికి వస్తే.. లెక్సస్ ఎల్ఎమ్350హెచ్ కారులో రూఫ్‌పై డిమ్మబుల్ గ్లాస్ ప్యానెల్ ఉంటుంది. 48 ఇంచెస్ టీవీ, ఎయిర్‌లైన్ స్టైల్ రిక్లైనర్ సీట్లు, పీమియం సౌండ్ కోసం 23 స్పీకర్లు, ఫోల్డ్ అవుట్ టేబుల్స్, హీటెడ్ ఆర్మ్‌రెస్ట్‌లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఫ్రిజ్, రియర్ గ్లోవ్ బాక్స్‌లు, డిజిటల్ రియర్ వ్యూ మిర్రర్, అంబ్రెల్లా హోల్డర్ మొదలైనవి ఉన్నాయి. ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా ఇందులో ఉంటాయి. అంతే కాకుండా ఇది అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. తద్వారా ప్రయాణికులకు కొంత రక్షణ అందిస్తుంది.

ఇంజిన్ డీటెయిల్స్

లెక్సస్ ఎల్ఎమ్350హెచ్ లగ్జరీ కారు 2.5 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 190 హార్స్ పవర్, 240 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం కావడానికి పట్టే సమయం 8.7 సెకన్లు, కాగా దీని టాప్ స్పీడ్ 190 కిమీ/గం. దీన్నిబట్టి చూస్తే.. ఈ కారు మంచి పనితీరును అందిస్తుందని తెలుస్తోంది.

నాగార్జున లెక్సస్ కారు

అక్కినేని నాగార్జున 2024లో ఇదే బ్రాండుకు చెందిన ఎల్ఎమ్350హెచ్ కారునే కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈయన మాత్రమే కాకుండా.. ఈ కారును కలిగి ఉన్న సెలబ్రిటీల జాబితాలో షారుఖ్ ఖాన్, రణబీర్ కపూర్, హార్దిక్ పాండ్య, జాన్వి కపూర్, రాధిక మర్చెంట్ కూడా ఉన్నారు.