బెస్ట్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్న సీరియల్ నటుడు

ప్రేమించడం సంతోషం.. ప్రేమించబటడం అదృష్టం అంటారు. ఏదైతే ఏం.. ప్రేమించినవాళ్లను పెళ్లిచేసుకోవడం అదృష్టం అంటుంటారు. అయితే ఇది అందరి జీవితంలో సాధ్యం కాకపోవచ్చు, కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. ఇందులో భాగంగానే ప్రముఖ బుల్లితెర నటుడు దర్శన్ కే రాజు తన బెస్ట్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఇన్‌స్టా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దర్శన్ రాజు & కాశిన్ పెళ్లి

తమిళ్ సీరియన్ యాక్టర్ దర్శన్.. తన బెస్ట్‌ఫ్రెండ్ కాశిన్ను పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లి అక్టోబర్ 13న.. అతి తక్కువ మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. వైవాహిక బంధంలో కొత్త జీవితంలోకి అడుగు పెట్టిన ఈ జంటకు నెటిజన్లు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

బుల్లితెర నటుడు దర్శన్ రాజు గురించి బహుశా తెలుగు ప్రజలకు తెలియకపోవచ్చు. ఎందుకంటే ఈయన తమిళ సీరియల్‌లలో నటించించారు. కట్రుకెన్న వేలి అనే సీరియర్ ద్వారా బాగా పాపులర్ అయిన దర్శన్.. అరణ్మనై కిలి, అవను మాతే శ్రావణి వంటి సీరియల్‌లలో కూడా కనిపించారు. సౌత్ ఇండియన్ హీరో అనే కన్నడ సినిమాలో ఇతడు హీరోగా కనిపించారు. అయితే ఇప్పుడు తన బెస్ట్‌ఫ్రెండ్ అయిన కాశిన్తో ఏడడుగులు వేశారు.

నెట్టింట్లో శుభాకాంక్షల వెల్లువ

మా లవ్‌బుల్ రాక్‌స్టార్ గార్జియస్ కాశిన్ పెళ్లి చేసుకున్నారు. మీ గ్రాండ్ వెడ్డింగ్‌కి ఇద్దరికీ శుభాకాంక్షలు, మీ ఇద్దరి ప్రపంచంలో అన్నీ మంచి జరగాలని కోరుకుంటున్నాను అంటూ.. దర్శన రాజు, కాశిన్ పెళ్ళికి సంబంధించిన ఫోటోలను దర్శన్ రాజు ఎక్స్‌ప్రెషన్ కింగ్ అనే ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశారు. ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో అటు నెటిజన్లు, ఇటు అభిమానులు ఈ జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతూ.. అభినందనలు తెలియజేస్తున్నారు.

స్నేహితులను పెళ్లి చేసుకున్న ఇతర సెలబ్రిటీలు

నిజానికి ప్రేమ అనేది.. స్నేహం నుంచే పుడుతుంది. మొదట మంచి స్నేహితులై.. ఆ తరువాత ప్రేమించుకోవడం అనేది సర్వసాధారణం. ప్రస్తుత కాలంలో జరుగుతున్న విషయమే. అయితే ఫ్రెండును పెళ్లిచేసుకున్నవారు గతంలో కూడా చాలామందే ఉన్నారు.

కొంతమంది టాలీవుడ్ హీరోలు.. తమతో కలిసి నటించిన నటీమణులనే పెళ్లిచేసుకున్నారు. ఈ జాబితాలో వరుణ్ తేజ్ & లావణ్య త్రిపాఠి, మహేష్ బాబు & నమ్రత, నాగార్జున & అమల, వరుణ్ సందేశ్ & వితిక, పవన్ కళ్యాణ్ & రేణూ దేశాయ్ మొదలైనవారు ఉన్నారు. వీరు కాకుండా అల్లు అర్జున్.. స్నేహ రెడ్డి ప్రారంభంలో మంచి స్నేహితులే. ఆ తరువాత పెళ్లి చేసుకున్నారు. రామ్ చరణ్ తేజ్ & ఉపాసన కూడా ఈ కోవకు చెందినవారే.

రిలయన్స్ అధినేత.. భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ రెండో తనయుడు అనంత్ అంబానీ కూడా తన చిన్ననాటి స్నేహితురాలు రాధికా మర్చంట్‌ను పెళ్లి చేసుకున్నారు. క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా.. నటి అనుష్క శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే.. స్నేహం నుంచి ప్రేమ.. ప్రేమ తరువాత పెళ్లి సర్వ సాధారణం అని స్పష్టంగా అర్థమవుతోంది.