విజయదశమి ముగిసింది.. దీపావళి వస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు ఎంపిక చేసిన కొన్ని కార్ల మీద భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది. ఇందులో మహీంద్రా, స్కోడా, మారుతి సుజుకి, వోక్స్‌వ్యాగన్, కియా మోటార్స్, హోండా మొదలైన కంపెనీలు ఉన్నాయి. ఈ కథనంలో ఏ కంపెనీ.. ఏ కారుపై.. ఎంత డిస్కౌంట్ అందిస్తుందని విషయాన్ని వివరంగా తెలుసుకుందాం.
మహీంద్రా మరాజో, ఎక్స్‌యూవీ400
దేశీయ కార్ల తయారీ సంస్థ.. మహీంద్రా అండ్ మహీంద్రా తన మరాజో కారు కొనుగోలుపై గరిష్టంగా రూ. 3 లక్షల డిస్కౌంట్ అందిస్తోంది. ఈ కారు 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ ద్వారా.. 120 హార్స్ పవర్, 300 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ కారు ధర మార్కెట్లో 14.05 లక్షల నుంచి రూ. 16.37 లక్షల వరకు ఉంటుంది. ఇది 7 సీటర్ లేదా 8 సీటర్ ఎంపికలతో అందుబాటులో ఉంది.
ఇక ఎక్స్‌యూవీ400 విషయానికి వస్తే.. దీనిపై కంపెనీ రూ. 2.5 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తుంది. ఇది 34.5 కిలోవాట్, 39.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో అందుబాటులో ఉంది. ఇది వరుసగా 375 కిమీ రేంజ్, 456 కిమీ రేంజ్ అందిస్తాయి. ఈ ఎలక్ట్రిక్ కారు ధరలు రూ. 15.49 లక్షల నుంచి రూ. 17.49 లక్షల మధ్య ఉంటుంది.
స్కోడా కుషాక్, స్లావియా
చెక్ రిపబ్లిక్ కార్ల తయారీ సంస్థ.. స్కోడా కూడా తన కుషాక్ కారుపైన రూ. 2.5 లక్షలు, స్లావియాపై రూ. 2.25 లక్షలు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ అఫర్ పరిమిత కాలం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కుషాక్ ధరలు రూ. 10.61 లక్షల నుంచి రూ. 17.43 లక్షల మధ్య ఉన్నాయి. స్లావియా ధరలు రూ. 9.99 లక్షల నుంచి రూ. 17.69 లక్షల మధ్యలో ఉన్నాయి.
వోక్స్‌వ్యాగన్ టైగన్, వర్టస్
భారతదేశంలో అధిక ప్రజాదరణ పొందిన జర్మన్ కార్ల తయారీ సంస్థ.. వోక్స్‌వ్యాగన్ కూడా తన టైగన్, వర్టస్ కార్లపై వరుసగా రూ. 1.8 లక్షలు, రూ. 1.5 లక్షలు డిస్కౌంట్ ప్రకటించింది. ఇండియన్ మార్కెట్లో టైగన్ ధర రూ. 11.39 లక్షల నుంచి రూ. 19.14 లక్షల మధ్యలో ఉంది. ఇక వర్టస్ ధరలు రూ. 11.16 లక్షల నుంచి రూ. 18.73 లక్షల మధ్య ఉన్నాయి. ఇది 1.0 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఎంపికలతో అందుబాటులో ఉంది.
కియా సెల్టోస్, కారెన్స్ క్లావిస్, సిరోస్
సౌత్ కొరియన్ కార్ల తయారీ సంస్థ అయిన కియా మోటార్స్ కూడా ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తున్న తన సిరోస్ కారుపై రూ. 1.6 లక్షలు, సెల్టోస్ కారుపై రూ. 1.47 లక్షలు, కారెన్స్ క్లావిస్ కారుపై రూ. 1.41 లక్షలు తగ్గింపు ప్రకటించింది. నిజానికి ఈ కార్లు ధరలు దేశీయ విఫణిలో రూ. 11.07 లక్షల నుంచి రూ. 20.71 లక్షలు (కియా కారెన్స్ క్లావిస్), రూ. 10.79 లక్షల నుంచి రూ. 19.8 లక్షలు (కియా సెల్టోస్), రూ. 9.82 లక్షల నుంచి రూ. 15.93 లక్షల (కియా సిరోస్) మధ్య ఉన్నాయి.
డిస్కౌంట్స్ లేదా ఆఫర్స్ అనేవి నగరాన్ని బట్టి మారే అవకాశం ఉంటుంది. కాబట్టి కచ్చితమైన డిస్కౌంట్ గురించి తెలుసుకోబడానికి సమీపంలోని కంపెనీ అధీకృత డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవడం మంచిది.