మనిషి బతకడానికి కూడు, గుడ్డ, గూడు ముఖ్యం అంటారు. చాలామంది తమ జీవితంలో సొంతిల్లు కలిగి ఉండాలని కలలు కంటారు. వాటిని కొందరు నిజం చేసుకుంటారు. మరికొందరికి ఆ కల.. కలగానే మిగిలిపోతుంది. అయితే తాజాగా యాంకర్ లాస్య కొత్త ఇంట్లోకి అడుగుపెట్టింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
లాస్య గృహప్రవేశం
ప్రముఖ తెలుగు యాంకర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్.. లాస్య తన భర్త మంజునాథ్‌తో కలిసి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. ఈ గృహ ప్రవేశ వేడుకకు.. కొందరు సీరియల్ యాక్టర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ హాజరయ్యారు. ఇందులో దేత్తడి హారిక, నయని పావని, గీతూ రాయల్, నోయల్, బంచిక్ బబ్లూ మొదలైనవారు ఉన్నారు.
నోయల్ ఇన్‌స్టా పోస్ట్ & లాస్య రిప్లై
లాస్య కొత్త ఇల్లు గృహ ప్రవేశానికి సంబంధించిన ఫోటోలను.. నోయెల్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ.. ”నోయెల్, నా కొత్త ఇంటిని చూసి నువ్వు అసూయపడతావు! అని లాస్య చెప్పారు. నేను ఖచ్చితంగా జలసీగా ఫీల్ అవుతాను. దేవుడు మీకు అందమైన ఇల్లు కట్టుకునేలా ఆశీర్వదించారు. మీ జంటకు (లాస్య, మంజునాథ్) అభినందనలు అంటూ పేర్కొన్నారు. దీనికి లాస్య రిప్లై ఇస్తూ.. ”నువ్వు ఇలా అంటావని నాకు తెలుసు నోయెల్. కానీ నిజం చెప్పాలంటే.. నీ లాంటి స్నేహితులు ఉండటం అదృష్టం” అని పేర్కొన్నారు. ఇది చూసిన నెటిజన్లు లాస్య ఫ్యామిలీకి శుభాకాంక్షలు చెబుతున్నారు.
సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోవర్స్
తెలుగు టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా.. పరిచయమైన లాస్య తరువాత బాగా పాపులర్ అయింది. మంజునాథ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తరువాత కెరియర్‌కు కొంత గ్యాప్ ఇచ్చింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన జీవితంలో జరిగే.. దాదాపు అన్ని కార్యక్రమాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంది. ఈమెకు ఇన్‌స్టాలో 1.5 మిలియన్ కంటే ఎక్కువ ఫాలోవర్స్, కాగా యూట్యూబ్‌లో 1.9 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు.
యాంకర్ లాస్య బిగ్‌బాస్ సీజన్ 4లో పాల్గొంది. ఆ సమయంలో దేత్తడి హారిక, నోయల్ వంటి వారితో స్నేహం ఏర్పడింది. లాస్య బుల్లితెర మీద మాత్రమే కాకుండా.. రాజా మీరు కేక, ఎంమ్మెల్యే (మంచి లక్షణాలున్న అబ్బాయ్), స్వాతి ఐ లవ్ యూ వంటి సినిమాల్లో నటించి వెండి తెరపై కూడా కనిపించింది. అయితే ప్రస్తుతం భర్త.. తన ఇద్దరి పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతోంది. అంతే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరైంది.
తండ్రికి కారు గిఫ్ట్
గతంలో తన తల్లిదండ్రులకు కొత్త ఇల్లు కట్టించిన లాస్య.. నాలుగు నెలలకు ముందు ఫాదర్స్ డే సందర్భంగా, తన తండ్రికి టాటా ఆల్ట్రోజ్ కారును గిఫ్ట్ ఇచ్చింది. చిన్నప్పటి నుంచి నాన్న కారులో తిరిగితే చూడాలని కోరిక ఉండేదని, పెళ్లి తరువాత.. తాను (లాస్య) కొన్న కారుకి మా నన్నే ఈఎమ్ఐ కట్టారని చెప్పింది. ఇప్పుడు మా నాన్నకు కారు కొనివ్వడం నాకు చాలా ఆనందంగా ఉందని కూడా ఆమె పేర్కొన్నారు.