గండికోట గురించి ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. ఎందుకంటే అటు గొప్ప చరిత్ర.. ఇటు సినిమాలలో కూడా దీని గురించి చాలానే విని ఉంటారు. దీనికి సంబందించిన పూర్వాపరాల విషయానికి వస్తే..
చార్రిత్రాత్మక ప్రశస్తి ఉన్న గండికోట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, కడప జిల్లాలో ఉంది. ఒకప్పుడు ఈ గండికోట ప్రాంతాన్ని కాకతీయులు, విజయనగర రాజులు, బుక్కరాయలు, కుతుబ్ షాహిలు పరిపాలించిన చరిత్ర ఉన్నది. కానీ ఇప్పుడు ఇది ఒక పర్యాటక ప్రాంతంగా మారిపోయింది. బోటింగ్, రోప్ క్లింబింగ్, జిప్ లైన్ లాంటి అడ్వెంచర్ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అంతే కాకుండా అనేకరకాలుగా ప్రభుత్వ.. ప్రభుత్వేతర సంస్థలు ఆదాయ మార్గాలను అవలంబిస్తున్నాయి. ఎంతోమంది వీక్షకులకు ఇది చాలా ఆహ్లాదమైన వాతావారణాన్ని కల్పిస్తుంది. కాలయాపన చేయడం కోసం, సెలవు రోజుల్లో విద్యార్థులకు, పెద్దవాళ్లకు అందరికి కూడా ఆనందంగా గడపడానికి గండికోట అనుకూలమైన ప్రాంతం. ఇక దీనికి సంబంధించిన చారిత్రక విషయాలలోనికి మనం వెళ్లినట్లయితే..
గండికోటకు ఆ పేరెలా వచ్చిందంటే..
మొదట ఈ ప్రాంతానికి గండికోట అనే పేరు ఎలా వచ్చింది అంటే గండి అనగా వాగు అని అర్థమట.. కోట అనగా మాములుగా పెద్ద భవనాన్ని కోట అంటాము. ఈ గండి, కోట అనే రెండు స్వచ్ఛమైన తెలుగు పదాల నుంచి ఉద్భవించాయి. ఈ గొప్ప కోటని పెన్నా నది వాగుపైన నిర్మించారు. దీనినే గండికోట అని పిలుస్తారు.
కోటకు సంబంధించిన చుట్టూ ఉన్న ప్రాంతం చూస్తే చాలా పెద్దగా దాదాపు ఒక ఎనిమిది.. తొమ్మిది కిలోమీటర్లు దాకా ఉంటుంది. ఇక్కడ మాధవరాయ, రంగనాథస్వామికి చెందిన రెండు గుడులు కూడా ఉండాయి. అవి విజయనగర రాజుల పరిపాలన కాలంలో వారి యొక్క అభిరుచి తగినట్టు కట్టించుకున్నవిగా మనకు అనిపిస్తుంది. తరువాత జామీ మసీదు, దాన్యపు భవనము, చార్మినార్, ఇంకా కొన్ని కట్టాలన్నీ కూడా కుతుబ్ షాహీలు కట్టించినట్టు పురావాస్తు ఆధారాలు చెబుతున్నాయి. ఇవి చూడటానికి చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడూ కూడా నీళ్లు చాలా బాగా అందుబాటులో ఉంటాయంటే.. అప్పటి రాజులు ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నారన్నమాట.
ఏయే రాజులు ఈ కోటను పరిపాలించారంటే?
చరిత్ర ప్రకారం.. చూసుకున్నట్టయితే కాప మహారాజు అనే వ్యక్తి 12వ శాతబ్దంలో గండికోటను కట్టించినట్టు చెబుతారు. ఆ తర్వాత పదమూడో శతాబ్దంలో కాకతీయుల ప్రవేశించినప్పుడు దీని చరిత్ర స్టార్ట్ అవుతుంది. వీరి తర్వాత విజయనగర రాజులు వశపరుచుకుంటారు. ఒకటవ బుక్కరాయలు సమయంలో.. కోట మొత్తం మంచిగా తయారు చేసి అభివృద్ధి చేశారట. రంగనాథ స్వామి, మాధవరాయ రెండు ఆలయాలు వీరి టైమ్‌లోనే నిర్మించారు. తరువాత విజయనగర రాజులు ఓడిపోవడం, వారి సామ్రాజ్యం మొత్తం పతనమవడంతో అదే అదునుగా హైదరాబాద్ కుతుబ్ షాహిలు కోటను కైవసం చేసుకున్నారు (మీర్ జుమ్లా ఆధ్వర్యంలో) ఇది జరిగింది.
వీరి అనంతరం కడప నవాబులు కోటపై యుద్ధం చేసి కుతుబ్ షాహిల దగ్గర నుంచి రాజ్యాన్ని చేజిక్కించుకున్నారట. ఆ తరువాత టిప్పు సుల్తాను, హైదర్ వీరు1.. ఇద్దరు కొంతకొంత కాలం పరిపాలించిన తరువాత నిజాం ఒప్పందంలో భాగంగా గండికోట ప్రాంతాన్ని క్రీస్తుశకం 1800ల సంవత్సరములో బ్రిటిష్ వాళ్లకి అప్పగించాల్సి వచ్చిందట. వారి తరువాత కోటని ఇండియా సంరక్షిస్తున్నది. ఈ విధంగా గండికోట విశేషాలు, దాని చరిత్ర గురించి తెలుసుకున్నాము కదా.. మీలో ఎంతమంది గండికోటకు చూసారు.. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి.