బైసన్ మూవీ తమిళంలో రిలీజ్ అయ్యి అతి పెద్ద విజయాన్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు అక్టోబర్ 24న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడానికి జగదాంబా ఫిలిం బ్యానర్ వాళ్ళు సిద్దమయ్యారు. అందుకు సంబంధించిన ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బైసన్ సినిమా హీరో ధృవ్ విక్రమ్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, మ్యూజిక్ డైరెక్టర్ నివాస్ కె ప్రసన్న, ఫిలిం డిస్ట్రిబ్యూటర్ అండ్ ప్రొడ్యూసర్ బాలాజి హాజరయ్యారు.
పేపర్లో రాసుకొని ప్రిపేర్ అయ్యి..
ఈ కార్యక్రమంలో.. ధృవ్ తెలుగుని పేపర్లో రాసుకొని వచ్చి బాగా ప్రిపేర్ అయ్యి మాట్లాడటం జరిగింది. అతను ఏం మాట్లాడాడనే విషయానికి వస్తే, అందరికి నమస్కారం అని చెబుతూ అలాగే మీడియా మిత్రులకి, సినీ ప్రముఖులకి, ఈవెంట్ ఆర్గనైజర్లకు చాలా థాంక్స్ అని చెప్పడం జరిగింది. దీంతో అక్కడ చప్పట్లు మొగాయి. తాను కూడా చిన్నగా నవ్వాడు. హైదరాబాద్‌లో ప్రమోట్ చేస్తున్న నా మొదటి సినిమా అని, అందుకే ఇది స్పెషల్ అని చెప్పుకొచ్చాడు. నా పేరు ధృవ్ అంటూ సరదాగా తనను తాను సభకు పరిచయం చేసుకున్నారు.
నిజంగా జరిగిన ఒక ఘటన
ఈమధ్యనే సూట్‌కేస్ కొనడం కోసం ఒక మాల్‌కు వెళ్ళానని చెబుతూ అక్కడ ఆ షాప్ ఓనరుకు హీరో ధృవ్‌కు మధ్యలో జరిగిన సంభాషణ గురించి పేర్కొన్నాడు. ఆ షాప్ ఎదురుగా కొంతమంది ధృవ్‌కు అలాగే చూస్తూ నిలబడ్డారంట దాన్ని చూసిన షాప్ ఓనర్ “వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఆ” అని అడిగితే కాదన్నాను. పోనీ మీరు ఏమైనా సినిమా యాక్టరా అని ఆ ఓనర్ అడిగారు. అప్పుడు నేను అవును అని అతనికి చెప్పాను. అతను అప్పుడు మీరు అచ్చం హీరో చియాన్ విక్రమ్ మాదిరిగా ఉన్నావని అన్నాడంట. నేను ఆయన కొడుకునే అనేసరికి వెంటనే అతను మీ నాన్న నటన అంటే చాలా ఇష్టం అని, చాలా కష్టపడి పైకి వచ్చాడని చాలా గర్వంగా, సంతోషంగా విక్రమ్ పట్ల ఎంతో ప్రేమని చూపించాడంట ఆ ఓనర్.
ఇంకా ధృవ్ మాట్లాడుతూ.. మా నాన్న ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా అన్ని రాష్ట్రాల్లో, దేశం మొత్తం మీద ఇంత పాపులరీటినీ, ప్రేమని, ఇంత అభిమానాన్ని సంపాదించడం అనేది నిజంగా చాలా అద్భుతం. నేను అందుకు చాలా గర్వపడుతున్నాను.. అని తన తండ్రి విక్రమ్ గురించి చెప్పుకొచ్చారు. ఒక కొడుకుగా నాకు అన్ని కూడా చాలా సులభంగా వచ్చేసాయి అనిపిస్తోంది. నాకు తెలుసు నేను ఏమి ఇంకా సాధించలేదని, కానీ మీ ఆదరణ, అభిమానం పొందడానికి నేను చాలా కష్టపడటానికి సిద్ధంగా ఉన్నాను.. అని హీరో ధృవ్ తన తెలుగు మాటలను చాలా ముద్దు ముద్దు చెప్పాడు. ఇది అక్కడ ఉన్న అందరినీ ఆనందలో ముంచేసింది చెప్పట్ల మోత మోగింది.
ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి
తెలుగు వాళ్ళు ఫుడ్‌ను, సినిమాని ఎంత బాగా ఎంకరేజ్ చేస్తారో నాకు బాగా తెలుసు. నాకు తెలుగులో పని చేయాలని కోరిక మరియు అందులో ఈ సినిమా.. నా మొదటి అడుగు అని నేను నమ్ముతున్నాను. బైసన్ నా జీవితంలో చాలా ముఖ్యమైన సినిమా, మీతో ఇదంతా మాట్లాడటానికి మూడు సంవత్సరాలు ఎదురు చూశాను. ఈ సమయంలో ఈ సినిమా కోసం ప్రొఫెషనల్ కబడ్డీ ఆట నేర్చుకున్నాను. నాకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి, మూవీ నచ్చితే సపోర్ట్ చేయండి. అది నాకు చాలా బలం ఇస్తుంది. నేను నాన్నగారి లాగే కష్టపడతాను. నా నుండి వందశాతం ఎఫెర్ట్ పెడతాను.