ఆ ఆఫర్ మిస్సయ్యా.. అందుకే ఇది చేశా!: అనుపమ మరమేశ్వరన్

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తెలుగు, తమిళ్, మలయాళం ఇలా.. భాషతో సంబంధం లేకుండా సినిమాల్లో నటిస్తోంది. ఈమె నటించిన మూవీస్ వరుసగా రిలీజ్ అవుతున్నాయి. విడుదలైన అన్ని చిత్రాలు ఆమె విజయాన్ని అందించాయి. ఈ సంవత్సరంలోనే దాడ్పు నాలుగు సినిమాలు విడుదల అయ్యాయి. అందులో డ్రాగన్ (తమిళం), జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ (జేఎస్‌కే – మలయాళం), కిస్కింధపురి (తెలుగు), పరదా (పాన్ ఇండియా మూవీ), మళ్ళీ ఇప్పుడు బైసన్. పరదా అనేది లేడి ఒరియేంటెడ్ సినిమా. అనుపమను ఈ సినిమా చాలా నిరాశపరిచింది. మిగిలిన సినిమాలు అన్నిగొప్ప విజయాన్ని అందుకున్నాయి. బైసన్ కూడా ఈజాబిలో ఒకటి.

అందుకే మొదటి సినిమా మిస్!

బైసన్ సినిమా ఆల్రెడీ తమిళ భాషలో మాత్రమే దాదాపు ముప్పై ఐదు కోట్లు రాబట్టిందని ప్రొడ్యూసర్స్ చెబుతున్నారు. తెలుగులో మాత్రం అక్టోబర్ 24న విడుదల అవుతోంది. ఆ సినిమా ప్రమోషన్ కోసం ఆమె హైదరాబాద్‌కు వచ్చారు. మీడియాతో బైసన్ సినిమా విశేషాలను పంచుకున్నారు.

అనుపమ బైసన్ సినిమా విశేషాలను చెప్పాలంటే.. మొదట ఆ మూవీ దర్శకుడు మారి సెల్వరాజ్ పని తీరు & ఆయన గురించి మరిన్ని అంశాలు చెప్పాల్సి ఉంటుంది అని చెప్పుకొచ్చింది. అందరూ ఆయన ఫిలిమ్స్ చూసే ఉంటారు అని, మారి మొదటి చిత్రం పరియేరుమ్ పెరుమాళ్ అనే సినిమా సమయంలో ఆమెకి ఒక పాత్రని ఆఫర్ చేశారని, కానీ అది ఆమె చేయకపోవడంతో కొంచెం బాధపద్దారట. ఎందుకంటే ఆ సమయంలో వెంటవెంటనే ఆమె వేరే సినిమాలు చేయాల్సి రావడం వల్ల పరియేరుమ్ పెరుమాళ్ చేయలేదట.

మారి సెల్వరాజ్ అభిమానిని

పరియేరుమ్ పెరుమాళ్ సినిమాతో ఆయన మూవీస్ అన్నింటికీ కూడా ఒక పెద్ద ఫ్యాన్ అయ్యిందట. వాస్తవికంగా మూలాల్లోకి వెళ్లి సినిమా తియ్యడం అనేది నిజంగా అనుపమకి బాగా నచ్చుతుంది అని చెప్పుకొచ్చింది. ఆ రోజు నుంచి మారి సెల్వరాజ్ అనే దర్శకునికి పెద్ద ఫ్యాన్ ఐపోయాను అని చెప్పుకొచ్చింది. ఆమెకి మొదటి సినిమా మిస్ అయినా కూడా మళ్ళీ పిలిచి మారి సెల్వరాజ్ బైసన్ సినిమాలో నటించడానికి అవకాశం కల్పించారని మారిపైన ఉన్న గౌరవాన్ని ఆ విధంగా తెలియపరిచారు.

ఇక షూటింగ్ అనుభవాలు గురించి చెబుతూ ప్రేమమ్ సినిమాలో నటించినప్పుడు ఒక వర్కుషాప్ చేసినట్టు ఎలా అయితే ఫీల్ అయ్యారో అలాగే ఈ బైసన్ సినిమా చేసినప్పుడు కూడా సేమ్ అదే అనుభవాన్ని కలిగించిందని ఆమె చాలా సంతోషంగా అభిప్రాయాన్ని వెళ్లబుచ్చారు. హీరోయిన్‌గా తనకు మాత్రమే కాకుండా.. బైసన్ సినిమాతో పాలుపంచుకున్న అందరికీ సరికొత్తగా ఒక అనుభూతిని కలిగించిందని ఆమె పేరక్కొన్నారు.

ప్రేమాభిమానాలు అందిస్తున్న ప్రేక్షకులు

ఇప్పుడు ఒక వారం నుంచి తమిళనాడులో సినిమా రిలీజ్ అయిన అన్ని థియేటర్లకు వెళ్ళి అక్కడ రెస్పాన్స్ ఎలా ఉందో చూస్తున్నారట. తమిళనాడులో ప్రేక్షకులు తమ ప్రేమ & అభినందనలు అందిస్తున్నారని చెప్పారు. రోజురోజుకి తమిళనాడులో మా బైసన్ సినిమా కలెక్షన్స్ పెరుగుతున్నాయని ఆనందం వ్యక్తపరిచారు. బైసన్ మూవీ తెలుగులో ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చాలామంది అనుపమను అడుగుతున్నారట. మొత్తం మీద ఈ సినిమా 2025 అక్టోబర్ 24న రిలీజ్ కాబోతోందని.. ఆమె తన స్పందనని తెలియజేశారు.