ప్రీ-వెడ్డింగ్ అంటే ఇదేదో నిజంగా తిరువీర్‌కు మ్యారేజ్ అనుకునేరు. తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన కొత్త సినిమా పేరు ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో. ఈ చిత్రం 2025 నవంబర్ 07వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకి రానున్నది. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో.. నరేంద్ర, రోహన్ రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పప్పేట్ షో ప్రొడక్షన్ & బై 7పీఎంల పతాకంపై సందీప్ అగరం, అష్మిత రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కో-ప్రొడ్యూసర్‌గా కల్పనా వ్యవహరిస్తున్నారు.
కామెడీ & ఎమోషనల్
“ది గ్రేట్ ప్రీ – వెడ్డింగ్ షో ” మూవీ ట్రైలర్‌ను మూవీ టీమ్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇది ఎక్స్‌ట్రార్డినరీ కామెడీ మరియు కొంచం ఎమోషనల్‌గా నడిచే విధంగా కనిపిస్తుంది. తిరువీర్ ఇప్పటి వరకు పూర్తి కామెడీ మూవీలలో కనిపించలేదు.. కానీ ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఫుల్ ఫన్ ఇచ్చాడని అనిపిస్తోంది. డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ వంటివన్నీ ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతోంది.
కథ ఎలా ఉంటుందంటే?
హీరో ఒక ఫోటోగ్రాఫర్, అతనికి ఒక ఫోటో స్టూడియో ఉంటుంది. అన్ని కార్యక్రమాలకి ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉంటాడు. అలాగే పెళ్లి చేసుకోబోయే ఒక కొత్త జంట.. ప్రీ-వెడ్డింగ్ ఫోటోలు, వీడియోలు తీయ్యడం కోసమని (తిరువీర్)హీరోని సంప్రదిస్తారు. షూటింగ్ అంత అయిపోయిన తరువాత డిజిటల్ కెమెరాలో ఉండే చిప్ పోగొట్టేస్తారు. అప్పుడు ఆ ఫోటోస్ కోసం పెళ్ళికొడుకు ఫోన్ మీద ఫోన్ చేస్తూనే ఉంటాడు. అతనికి ఇస్తాను, ఇస్తాను అని అబద్దం చెప్పి మేనేజ్ చేస్తుంటాడు. ఆ సీన్స్ చాలా ఆసక్తికరంగా, ఫుల్ ఫన్నీగా అనిపిస్తాయి.
వీటన్నిటి మధ్యలో హీరో ఒక అమ్మాయితో ప్రేమలో పడుతాడు. ఆ అమ్మాయిని మెప్పించడం కోసమని తన వెంటపడటం, లేనిపోని పాట్లు పడటం అనేది చూడటానికి చాలా కామెడీగా, గమ్మత్తుగా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే పోయిన చిప్ కోసం, తను ప్రేమించిన అమ్మాయి కోసం హీరో పడే పడరాని పాట్లు ఇవన్నీ కలిపి సినిమా స్థాయిని మరింత పెంచేసాయి. ఇది ఖచ్చితంగా మంచి హిట్ ఫిలిమ్ అవుతుందని మాత్రం అర్థమవుతున్నది.
నటుడు తిరువీర్ గురించి
పలాస, జార్జి రెడ్డి, మసుధ, పరేషాన్ లాంటి ఎన్నో సినిమాల్లో తిరువీర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తను చేసిన ప్రతి సినిమా, ప్రతి పాత్రకు ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుంది. అన్ని మంచి క్యారెక్టర్స్ చేసినప్పటికి.. ప్రధాన కథానాయకుడిగా చేసినవి ఒకటి రెండే ఉన్నాయి. ఇప్పుడు ది గ్రేట్ ప్రీ – వెడ్డింగ్ షోలో లీడ్ రోల్ పోషిస్తున్నాడు. ఇది బిగ్ సక్సెస్ అవుతుంది అని కొందరు అభిప్రాయపడుతున్నారు. కాగా మననం కూడా తిరువీర్ కెరియర్‌లో మంచి విజయం సాధించాలని కోరుకుందాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో 2025 నవంబర్ 7వ (శుక్రవారం) తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఆ తరువాత ఈ సినిమా ఏ స్థాయిలో ఆడింది. దీనికి వచ్చిన కలెక్షన్స్ ఎంత అనేవి అధికారికంగా వెల్లడవుతాయి.