500 మందికే ఈ స్టైలిష్ బైక్: దీని ధర ఎంతో తెలుసా?

లగ్జరీ మోటార్‌సైకిల్స్ తయారీ సంస్థ డుకాటీ.. గ్లోబల్ మార్కెట్లో సరికొత్త స్క్రాంబ్లర్ 10వ యానివర్సరీ ఎడిషన్ లాంచ్ చేసింది. ఈ కొత్త బైక్ ధర రూ. 17.10 లక్షలు (ఎక్స్ షోరూమ్). స్క్రాంబ్లర్ బైక్ విఫణిలో అడుగుపెట్టి.. పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. కంపెనీ ఈ యానివర్సరీ ఎడిషన్ లాంచ్ చేసింది. ఇది సాధారణ స్క్రాంబ్లర్ కంటే కూడా కొంత ఎక్కువ కాస్మొటిక్ అప్డేట్స్ పొందినట్లు తెలుస్తోంది. ఈ లేటెస్ట్ బైక్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు ఈ కథనంలో చూసేద్దాం..

500 యూనిట్లు మాత్రమే!

డుకాటీ కంపెనీ.. తన 10వ యానివర్సరీ ఎడిషన్ స్క్రాంబ్లర్ బైకును తన దీర్ఘకాలిక భాగస్వామి రిజోమాతో కలిసి నిర్మించింది. చాన్నాళ్ల తరువాత రిజోమా కంపెనీ బైక్ రూపొందించడంలో ప్రత్యక్షంగా సహకరించింది. కాబట్టి దీనిని స్క్రాంబ్లర్ డుకాటీ 10వ యానివర్సరీ రిజోమా ఎడిషన్ అని పిలుస్తారు. దీనిని ప్రపంచ వ్యాప్తంగా కేవలం 500 మందికి మాత్రమే విక్రయించనున్నారు. అంటే ఇది భారతదేశంలో లిమిటెడ్ ఎడిషన్ రూపంలో మాత్రమే అందుబాటులో ఉంటుందని స్పష్టమవుతోంది. కానీ మనదేశానికి ఎన్ని యూనిట్లు కేటాయించారనే విషయాన్ని సంస్థ వెల్లడించలేదు.

స్టైలిష్ డిజైన్ కలిగిన డుకాటీ స్క్రాంబ్లర్ యానివర్సరీ ఎడిషన్.. చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇందులో మెషిన్డ్ బిల్లేట్ అల్యూమినియం అడ్జస్టబుల్ లివర్స్, బ్రేక్ అండ్ క్లచ్ రిజర్వాయర్ క్యాప్స్, ఫ్యూయల్ ఫిల్లర్, ప్యాసింజర్ ఫుట్ పెగ్‌లు ఉన్నాయి. డిజైన్ పరంగా అప్డేట్ పొందిన ఈ లేటెస్ట్ బైక్.. యాంత్రికంగా ఎటువంటి అప్డేట్స్ పొందలేదని తెలుస్తోంది.

చూడచక్కని కలర్స్

స్క్రాంబ్లర్ రిజోమా ఎడిషన్.. స్టోన్ వైట్ / మెటల్ రోజ్ అనే డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్ పొందుతుంది. విండ్‌స్క్రీన్, టైమింగ్ బెల్ట్ కవర్స్, ఫ్రేమ్ కవర్స్, ఇంజిన్ కేస్ కవర్స్, రైడర్ ఫుట్ పెగ్స్ అన్నీ కూడా మెటల్ రోజ్ రంగులో ఉంటడం చూడవచ్చు. కాగా ఫ్యూయెల్ ట్యాంక్, ఇంజిన్, ఛాసిస్ బార్ ఎండ్ మిర్రర్స్, ఎగ్జాస్ట్ సిస్టం వంటివి నలుపు రంగులో ఉండటం చూడవచ్చు.

ఇంజిన్ వివరాలు

డుకాటీ స్క్రాంబ్లర్ 10వ యానివర్సరీ ఎడిషన్ 803 సీసీ ఫోర్ స్ట్రోక్ ఎయిర్ కూల్డ్ ఎల్ ట్విన్ ఇంజిన్ పొందుతుంది. ఇది 73 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ 63.2గా ఉంటుంది. దీన్నిబట్టి చూస్తే పర్ఫామెన్స్ ఉత్తమంగానే ఉంటుందని తెలుస్తోంది. బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ ఇందులో ఉంటుంది.రైడర్ ఎయిడ్ సూట్ కూడా లభిస్తుంది.స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్ కలిగిన ఈ బైక్ బైక్ రైడర్లను ఆకట్టుకునే విధంగా తయారైందని స్పష్టంగా తెలుస్తోంది.

ఇండియన్ మార్కెట్లో డుకాటీకున్న డిమాండ్?

డుకాటీ కంపెనీ బైకులకు ఇండియన్ మార్కెట్లో పెద్దగా డిమాండ్ లేదనే తెలుస్తోంది. దీనికి కారణం అధికంగా ఉన్న ధరలే. సాధారణంగా ఖరీదైన బైకులను.. సెలబ్రిటీలు లేదా డబ్బున్నవారు మాత్రమే కొనుగోలు చేస్తారు. కాగా డుకాటీ బైకుల ధరలు ఎక్కువగా ఉండటం వల్ల.. సామాన్య ప్రజలు ఈ బ్రాండ్ బైకులను కొనుగోలు చేయడానికి వెనుకడుగు వేస్తారు. అయితే కంపెనీ బైక్ ప్రేమికులను దృష్టిలో ఉంచుకుని.. ఎప్పటికప్పుడు ఆధునిక ఉత్పత్తులను లాంచ్ చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే డుకాటీ స్క్రాంబ్లర్ 10వ యానివర్సరీ ఎడిషన్ లాంచ్ చేసింది. దీనికి ఎలాంటి ఆదరణ లభిస్తుందో తెలుసుకోవడానికి ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంటుంది.