ప్రపంచంలో ఎక్కువ మోటార్ సైకిల్స్ ఉత్పత్తి చేసే దేశాల జాబితాలో భారత్ ఒకటి. ఇండియన్ మార్కెట్లో ప్రతి నెలా.. ఏదో ఒక కొత్త ఉత్పత్తి లాంచ్ అవుతూనే ఉంటుంది. ఎన్ని బైకులు దేశీయ విఫణిలో ఉన్నప్పటికీ.. క్రూయిజర్ మోటార్ సైకిళ్లకు ఓ ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. ఈ కథనంలో సరసమైన & తక్కువ ధర వద్ద లభించే ఐదు బెస్ట్ క్రూయిజర్ బైక్స్ గురించి తెలుసుకుందాం.
బజాజ్ అవెంజర్ 160 స్ట్రీట్
అవెంజర్ 160 స్ట్రీట్ బైక్.. క్రూయిజర్ బైకుల జాబితాలో ఒకటి. దీని ధర రూ. 1.11 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది దేశంలోని అత్యంత సరసమైన క్రూయిజ్ మోటార్‌సైకిల్. ఇందులోని 160 సీసీ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉత్తమ పనితీరును అందిస్తుంది. మంచి డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల.. దీనిని ఎక్కువమంది ఇష్టపడతారు. లాంగ్ రైడ్ చేయడానికి కూడా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది. అయితే ఈ పొడవు కొంత ఎక్కువగా ఉండటం వల్ల.. ఇరుకైన ప్రదేశాల్లో రైడ్ చేయడం కొంత ఇబ్బందిగా ఉంటుంది.
కవాసకి డబ్ల్యు175
క్రూయిజ్ మోటార్ సైకిల్స్ జాబితాలోని మరో బెస్ట్ మోడల్.. కవాసకి కంపెనీకి చెందిన డబ్ల్యు175. మార్కెట్లో దీనికున్న డిమాండ్ కొంత తక్కువే అయినప్పటికీ.. ఈ బైకును ఇష్టపడేవాళ్లు కూడా ఉన్నారు. దీని ధర రూ. 1.21 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైకులోని 177 సీసీ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి.. అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. తద్వారా రైడర్లకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. తక్కువ ధరలో బెస్ట్ రైడింగ్ బైక్ కావాలనుకునే వారికి.. కవాసకి డబ్ల్యు 175 ఉత్తమ ఎంపిక అనే చెప్పాలి.
టీవీఎస్ రోనిన్
ఇండియన్ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన టీవీఎస్ కంపెనీ.. లెక్కలేనన్ని మోడల్స్ దేశీయ విఫణిలో విక్రయిస్తోంది. అయితే కంపెనీ విక్రయించే అన్ని బైకుల కంటే రోనిన్ కొంత భిన్నంగా ఉంటుంది. ఈ బైక్ ధర రూ. 1.25 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైకులో 225.9 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది కూడా 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. రెట్రో డిజైన్ కలిగిన ఈ బైక్.. ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇంజిన్ పనితీరు కూడా ఉత్తమంగా ఉంటుంది. క్రూయిజ్ మోటార్ సైకిల్ విభాగంలో అందుబాటులో ఉన్న మరో బెస్ట్ మోడల్ ఈ రోనిన్.
జావా 42
ఇండియన్ మార్కెట్లో జావా బైకులకు ఒకప్పుడు మంచి డిమాండ్ ఉండేది. అయితే ఇప్పుడు ఈ బ్రాండ్ బైకులకు ఉన్న డిమాండ్ తగ్గిపోయిందనే చెప్పాలి. అయితే క్రూయిజ్ బైక్స్ విభాగంలో కంపెనీ జావా 42 మోటార్ సైకిల్ అందిస్తోంది. రూ. 1.59 లక్షల (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లభిస్తున్న ఈ బైక్.. 294.7 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. అయితే ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. డిజైన్ బాగుంటుంది. రైడర్లకు కావలసిన అన్ని ఫీచర్స్ ఈ బైకులో ఉంటాయి.
రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350
ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో.. క్రూయిజర్ మోటార్ సైకిల్స్ విభాగంలో ఎక్కువ అమ్ముడవుతున్న బైక్స్ జాబితాలో ఇది అగ్రస్థానంలో ఉంది. ఈ బైక్ ధర రూ. 2.16 లక్షలు (ఎక్స్ షోరూమ్). రెట్రో డిజైన్ కలిగి.. చూడగానే ఆకట్టుకునే డిజైన్ కలిగిన ఈ బైక్.. అత్యాధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇందులోని 349 సీసీ ఇంజిన్ 5 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి.. బెస్ట్ పర్ఫామెన్స్ అందిస్తుంది. ఇది రోజువారీ వినియోగానికి మాత్రమే కాకుండా.. లాంగ్ రైడ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి చాలామంది ఈ బైకును ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు.