బైసన్ సినిమా విడుదలై 25 రోజులు పూర్తైన సందర్బంగా.. చిత్ర బృందం చెన్నైలో విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో డైరెక్టర్ మారి సెల్వరాజ్, నిర్మాతలు పా. రంజిత్ & అధితి ఆనంద్, హీరో ధృవ్ విక్రమ్, హీరోయిన్స్ అనుపమ పరమేశ్వరన్ & రజిష విజయన్‌లతోపాటు ఇతర నటులు అమీర్, లాల్, పశుపతి మ్యూజిక్ డైరెక్టర్ నివాస్ కే ప్రసన్న మొదలైనవారు పాల్గొన్నారు.
నెలరోజులైనా.. దూసుకెళ్తున్న బైసన్
ఇప్పుడు ఉన్నటువంటి సాంకేతికత కారణంగా సోషల్ మీడియా ఎక్కువ ప్రాచుర్యం పొందింది. దీని వల్ల కొత్తగా రిలీజ్ అవుతున్న సినిమాలు కనీసం వారం రోజులు కూడా థియేటర్లలో నిలబడటం లేదు. నిర్మాతలు కేవలం శుక్రవారం, శనివారం, ఆదివారాలను నమ్ముకుని మూవీస్ రిలీజ్ చేస్తున్నారు. ఆ మూడు రోజుల్లో మా డబ్బులు మాకు వస్తే చాలనుకుంటున్నారు. లేదా అప్పుడప్పుడు ఏదైనా పండగలు, సెలవులు వస్తే.. ఆ తరుణంలో ఒకరకంగా ఆడుతున్నాయి. ఆ తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలోకి వచ్చేస్తున్నాయి. లేదా అంతకు ముందే పైరసీకి గురవుతున్నాయి. అలాంటిది ఈ మధ్య కాలంలో డైరెక్టర్ మారి సెల్వరాజ్ దర్శకత్వంలో.. చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా వచ్చిన “బైసన్” సినిమా విడుదలై దాదాపు నెల రోజులు కావస్తోంది. ఇప్పటికి ఆ సినిమా థియేటర్లలో విజయవంతంగా కొనసాగుతోంది.
బైసన్ కలెక్షన్స్
ఎంత కలెక్షన్స్ వచ్చాయి.. దీనికి సంబంధించిన వివరాలు చూసుకుంటే.. సినిమా బడ్జెట్ ఇంచుమించు 30 కోట్ల లోపు ఉంటుందని అంచనా. అయితే కలెక్షన్స్ మాత్రం అంతకు మించి రాబడుతోంది. ఇప్పటి వరకు వచ్చిన మొత్తం.. ఇండియా గ్రాస్ కలెక్షన్స్ చూస్తే మొత్తం 55 కోట్ల వరకు కలెక్ట్ చేసిందట. అదే ఇండియా నెట్ కలెక్షన్స్ గమనిస్తే మొత్తం ఒక 47 కోట్లు రాబట్టినట్టు తెలుస్తోంది. ఓవర్సీస్‌లో దాదాపు 10 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిందని లెక్కలు చెబుతున్నాయి. ఇంకా మొత్తం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ దాదాపు 70 కోట్ల రూపాయల పైనే అని మూవీ టీమ్ లెక్కలు బయట పెట్టింది.
ధృవ్ విక్రమ్ కెరియర్ మలుపుతిప్పిన బైసన్
హీరో ధృవ్.. కెరియర్ పరంగా బైసన్ కలెక్షన్స్ గొప్ప మలుపు తిప్పే విషయం అని చెపొచ్చు. ఇప్పటి వరకు తాను చేసిన రెండు సినిమాలు చెప్పుకోతగిన ఫలితాలు ఇవ్వలేదు. అయితే బైసన్ మూవీ మాత్రం అతనికి బిగ్ బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి. ధృవ్ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. డైరెక్టర్ మారి సెల్వరాజ్ ఖాతాలో మరో విజయం చేరింది.
ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని చేయడానికి పా. రంజిత్ నీలం స్టూడియోస్ & అప్లాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు మంచి పుషప్ ఇచ్చింది. ఇప్పటికీ జనాల్లో బైసన్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రేక్షకాదరణ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఇటువంటి సినిమాలు యువతకి.. వారి నిజ జీవితంలో మానసికంగా ఒక ధృడమైన విశ్వాశాన్ని, ఆత్మ స్థైర్యాన్ని ఇస్తాయనే చెప్పాలి. ఈ సినిమాలో ధృవ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్ అద్భుతంగా నటించారు. ఇతర నటీనటులు కూడా తమదైన రీతిలో నటించి.. ప్రేక్షకులను మెప్పించారు.