ఆధునిక యుగంలో చదువుకోవడానికి చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే అందరూ డబ్బు ఖర్చు చేయడం అనేది కొంత కష్టమైన పనే. ఇది బాగా చదువుకునే పేద విద్యార్ధులపై ప్రభావం చూపుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు ప్రైవేట్ సంస్థలు ఉపకార వేతనాలు (స్కాలర్షిప్) అందిస్తాయి. ఇప్పుడు తాజాగా టాటా గ్రూప్‌కు చెందిన టాటా క్యాపిటల్ లిమిటెడ్ ఇంటర్మీడియట్ విద్యార్థులు కోసం ”పంక్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్” ప్రారంభించింది.
పంక్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్
2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించిన.. ఇంటర్మీడియట్ (ఫస్ట్ ఇయర్ & సెకండ్ ఇయర్) విద్యార్థులు కోసం టాటా క్యాపిటల్స్ ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభించింది. తక్కువ ఆదాయం ఉన్న పేదపిల్లల ఉన్నత చదువులకు నేను అండగా ఉన్న అని చెప్పడమే ప్రధాన ఉద్దేశ్యంగా సంస్థ దీనిని తీసుకొచ్చింది. గతంలో కూడా ఈ స్కాలర్షిప్ ద్వారా చాలామంది విద్యార్థులు లబ్దిపొందారు. ఈసారి కూడా వేలాదిమంది విద్యార్థులు దీనిద్వారా లబ్దిపొందుతారు.
ధరఖాస్తు చేసుకోవడానికి అర్హులు & లాస్ట్ డేట్!
టాటా క్యాపిటల్ పంక్ స్కాలర్షిప్ అనేది విద్యార్థులు ప్రతిభను.. అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకొచ్చారు. ఇంటర్మీడియట్ విద్యార్థులు 2025 డిసెంబర్ 26 లోపల అప్లై చేసుకోవచ్చు.
అర్హతలు
- ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు తప్పకుండా భారతీయ పౌరులై ఉండాలి.
- 2025-26 సంవత్సరంలో.. గుర్తింపు పొందిన కాలేజీలో చదువుతుండాలి. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉన్న కాలేజీలలో చదువుతున్నవారు అయి ఉండాలి.
- 10వ తరగతిలో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.
- వార్షిక ఆదాయం 2.5 లక్షల కంటే తక్కువ ఉండాలి.
- అమ్మాయిలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యంగా విద్యార్థులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.
అనర్హులు
- టాటా క్యాపిటల్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలు ఈ స్కాలర్షిప్ కోసం అప్లై చేసుకోవడానికి అనర్హులు.
- ఇప్పటికే ఇతర స్కాలర్షిప్స్ పొందుతున్నవారు అనర్హులు.
- విద్యలో సమానత్వం కోసం.. ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నవారిని ప్రోత్సహించడంలో భాగంగా ఈ నిబంధలు విధించడం జరిగింది.
స్కాలర్షిప్ వివరాలు
టాటా క్యాపిటల్ అందించే స్కాలర్షిప్ అనేది విద్యార్ధి కోర్సు ఫీజులో ఏకంగా 80 శాతం కవర్ చేస్తుంది. మార్కుల శాతం ఆధారంగా ఈ స్కాలర్షిప్ అందిస్తారు. స్కాలర్షిప్ గరిష్టంగా 91 శాతం వరకు అందిస్తారు. స్కాలర్షిప్ మొత్తం డబ్బు నేరుగా విద్యార్ధి బ్యాంక్ పడుతుంది. దీనిని విద్యార్ధి అవసరాలకు (ఫీజులు, పుస్తకాలు..) అనుగుణంగా ఉపయోగించుకోవచ్చు.
దరఖాస్తు చేయడానికి కావలసిన డాక్యుమెంట్స్
టాటా క్యాపిటల్ అందించే పంక్ స్కాలర్షిప్ కోసం అప్లై చేసుకోవడం సులభమే. అయితే తప్పకుండా కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
- స్టూడెంట్ ఆధార్ కార్డు లేదా ఇతర ఏదైనా గుర్తింపు కార్డు
- కాలేజీలో జాయిన్ అయినప్పుడు మీకిచ్చిన అడ్మిషన్ ఫారమ్
- మీరు చదువుతున్న కాలేజీలో.. మీ కోర్సుకు సంబంధించిన ఫీజు వివరాలకు సంబంధించిన పత్రాలు
- 10వ తరగతి మార్క్స్ కార్డు
- ఆదాయ ధ్రువీకరణ కోసం.. ప్రభుత్వం అందించిన ఇన్‌కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్
- బ్యాంక్ పాస్‌బుక్ కాపీ, లేటెస్ట్ కలర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో (వీటన్నింటిని పీడీఎఫ్ లేదా జేపీజే ఫార్మాట్‌లో స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఎలా అప్లై చేసుకోవాలంటే?
- పంక్ స్కాలర్షిప్ కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి విద్యార్థి లేదా అప్లై చేసేవారు.. అధికారిక టాటా క్యాపిటల్
- స్కాలర్‌షిప్ పోర్టల్ ఓపెన్ చేసిన తరువాత.. అప్లై నౌ అనే ఎంపిక మీద క్లిక్ చేయాలి.
- మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీతో రిజిస్టర్ చేసుకుని పాస్‌వర్డ్ సెట్ చేసుకుపోవాలి. తరువాత లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
- లాగిన అయిన తరువాత స్టార్ట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి.. మీ అర్హత వివరాలను ఎంటర్ చేయాలి.
- వ్యక్తిగత వివరాలు, అకడమిక్ వివరాలు, ఆదాయానికి సంబంధించిన విషయాలను ఎంటర్ చేయాలి.
- అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి.. చివరగా నియమాలను అన్నింటిని అంగీకరిస్తూ.. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఓటీపీతో వెరిఫై చేయాల్సి ఉంటుంది.
- ఇలా పూర్తి చేసిన తరువాత.. మీకు అప్లికేషన్ నెంబర్ & స్టేటస్ వంటివి రిజిస్టర్ చేసుకున్న ఎస్ఎమ్ఎస్, ఈమెయిల్ ద్వారా పొందుతారు.
- సెలక్షన్ విధానంలో.. మీ మార్కులు, ఇతరత్రా వంటివాటిని ఆధారంగా చేసుకుని షార్ట్ లిస్ట్ చేస్తారు.
- షార్ట్ లిస్ట్ చేసిన తరువాత.. డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫోన్ ఇంటర్వ్యూ వంటివి ఉంటాయి. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం 30 నుంచి 45 రోజులు పడుతుంది.