విక్టరీ వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’: రిలీజ్ ఎప్పుడంటే?

సినిమా నటుడు విక్టరీ వెంకటేష్ & దర్శక, రచయిత త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా కోసం వారి అభిమానులు ఎప్పటినుంచో నిరీక్షిస్తున్నారు. వీరు ఇరువురు కలిసి ఒక చిత్రం చేయబోతున్నారు అనే సమాచారం ఉంది. కానీ సినిమా పేరు గానీ, షూటింగ్ ఎప్పుడు అని గానీ, రిలీజ్ విశేషాలు ఏవి కూడా స్పష్టంగా చెప్పలేదు. అయితే ఆ అనుమానాలు అన్నింటికీ ఇప్పుడు తెర తొలగిపోయింది. మొత్తానికి అధికారికంగా సినిమా పేరుని ప్రకటించారు.

త్రివిక్రమ్ సెంటిమెంట్!

త్రివిక్రమ్ కొంత కాలంగా అక్షరంతో మొదలయ్యే పదాలతో సినిమా పేర్లు పెట్టుకుంటూ వచ్చారు. ఉదాహరణకి “అత్తారింటికి దారేది, అరవింద సమేత, అఆ, అజ్ఞాతవాసి” వంటి చిత్రాలు మనం చూడచ్చు. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్‌ను పునరావృతం చేశారు. దీంతో ఈ కొత్త చిత్రం యొక్క పేరు ఆదర్శ కుటుంబం హౌస్ నెం:47 – ఏకే 47 పేరుతో పోస్టర్ రిలీజ్ చేశారు.

2026లో రిలీజ్!

విక్టరీ వెంకటేష్ & శ్రీనిధి శెట్టి లీడ్ రోల్‌లో చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హారిక & హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. వచ్చే సంవత్సరం 2026 వేసవికి మూవీని విడుదల చేయాలానే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తున్నది. మిగిలిన తారాగాణంకి సంబంధించిన విశేషాలు రాబోయే రోజుల్లో తెలియాల్సి ఉంది.

పోస్టర్ ట్రెండ్‌కు తగ్గట్టుగా ఉంది. ఆదర్శ కుటుంబం హౌస్ నెం 47 – ఏకే 47 పోస్టర్‌లో వెంకటేష్ కళ్లజోడు పెట్టుకొని చేతిలో ఒక బ్లాక్ కలర్ చిన్న బ్యాగ్ పట్టుకొని ఎడమ చేతికి బ్లాక్ వాచ్, బ్లాక్ స్లిప్పర్స్ & వైట్ ప్యాంటు, పచ్చ చొక్కా బ్లాక్ టీ షర్ట్ చేసుకుని ఒక హైవేలో తారురోడ్డుపైన నిలుచుకొని ఒక మధ్యతరగతి ఉద్యోగిలాగా కనిపిస్తున్నాడు. 2026 సమ్మర్‌లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అవుతుందని ఉంది. హైదరాబాద్‌లో సినిమా షూటింగ్ ప్రారంభించారు. 1969వ ఏట అక్కినేని నాగేశ్వరరావు, అంజలి దేవి, జయలలిత వీరి కలయికలో “ఆదర్శ కుటుంబం” అనే సినిమా వచ్చింది. ఆ చిత్రం యొక్క పేరు మళ్లీ తీసుకోవడం వెనుక కారణాలు ఏమిటి అనేది తెలియదు.

అప్పటి నుంచే సత్సంబంధాలు

త్రివిక్రమ్ శ్రీనివాస్, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో ఇంతకు ముందే కొన్ని సినిమాలు వచ్చాయి. ఆ జాబితాలో 2001లో నువ్వు నాకు నచ్చావ్, 2004లో మల్లీశ్వరి లాంటివి ఉన్నాయి. అయితే ఆ సినిమాలకు దర్శకుడిగా కాకుండా.. కథ, మాటల రచయితగా పనిచేశారు. కాబట్టి అప్పటి నుంచే వెంకీ, త్రివిక్రమ్ మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయి.

నువ్వే నువ్వే చిత్రంతో దర్శకుడు అయినప్పటి నుండి కూడా వీరి ఇరువురి నుంచి ఒక సినిమా వస్తే బాగుంటుందని ఇద్దరి అభిమానులు కూడా చాలా ఆశించారు. ఎట్టకేలకు ఇన్ని సంవత్సరాలకు ఆ కోరిక తీరబోతున్నది. వెంకటేష్ యాక్టింగ్‌కు, త్రివిక్రమ్ మాటలకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని ఫ్యాన్ బేస్ ఉంది. మరి ఈ చిత్రం ఎలా ఉండబోతుందో తెలియాలంటే వచ్చే సంవత్సరం వేసవి వరుకు వేచి చూడాలి.