ఒక సినిమా అంటే.. (ఏ భాషలో అయినా) హీరో, హీరోయిన్స్, ఇతర సహాయక బృందాలతో పాటు.. జంతువులు, వాహనాలు కనిపిస్తుంటాయి. జంతువుల విషయం పక్కన పెడితే.. ఏ సినిమాలో అయినా అందులో కనిపించే వాహనాలు స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పాలి. ఇటీవల రిలీజ్ అయిన రణ్వీర్ సింగ్ నటించిన.. దురంధర్ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్స్ రాబడుతోంది. ఈ సినిమాలో చాలా కార్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ కార్ల గురించి.. మరిన్ని వివరాలు ఈ కథనంలో..
లెక్సస్ ఎల్ఎక్స్ 470
రెహ్మాన్ దకైత్, అతని ముఠాను వెంబడించడంలో ఎస్పీ అస్లాం చౌదరి తిరుగుతుంటారు. ఈ సమయంలో ఆయన ఎంచుకున్న కారు లెక్సస్ ఎల్ఎక్స్ 470. తెలుపు రంగులో కనిపించే ఈ కారు.. చాలామందిని ఆకట్టుకుంది.
ఈ మోడల్ కారు 1998 నుంచి 2007 మధ్య తయారైంది. గొప్ప ఆఫ్ రోడ్ కెపాసిటీ కలిగిన ఈ కారు.. అత్యంత లగ్జరీ కూడా. ఇందులో 4.7 లీటర్ వీ8 ఇంజిన్ ఉండేది. ఇది 5 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ కలిగి అత్యుత్తమ పర్ఫామెన్స్ అందిస్తుంది. దీని ధర మార్కెట్లో రూ. 50 లక్షల కంటే ఎక్కువ ఉండేదని సమాచారం. అయితే ప్రస్తుతం ఇది ఉత్పత్తి దశలో లేదు.
ల్యాండ్ రోవర్ డిఫెండర్
దురంధర్ సినిమా కనిపించిన మరో కారు ల్యాండ్ రోవర్ డిఫెండర్. అర్జున్ రాంపాల్ (మేజర్ ఇక్బాల్) సినిమాలో ఈ కారులో నుంచి కిందికి దిగిపోతుండటం చూడవచ్చు. ఇండియన్ మార్కెట్లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఎంపికలో లభిస్తుంది. దీని ధర కొంత ఎక్కువే అయినప్పటికీ.. కఠినమైన రూపంతో, వాహన ప్రేమికులను ఆకట్టుకోవడంలో విజయం సాధించింది.
ఇసుజు డీ-మ్యాక్స్
మంచి ఆఫ్ రోడింగ్ కెపాసిటీ కలిగిన.. ఇసుజు డీ-మ్యాక్స్ కారు రెహ్మాన్ డకైట్ కాన్వాయ్‌లో కనిపిస్తుంది. కఠిన భూభాగాల్లో సైతం ఇది సులభంగా ముందుకు సాగుతుంది.
భారతదేశంలో ఈ కారుకు మంచి ఆదరణ ఉంది. ఇది ఫోర్ సిలిండర్ 1.9 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ ద్వారా 162 బీహెచ్పీ పవర్, 360 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఇది మాన్యువల్ ఎంపికలో కూడా లభిస్థుంది. దీని ధర రూ. 10.55 లక్షల నుంచి రూ. 11.40 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుంది.
టాటా జెనాన్
బహుశా ఈ కారు పేరు చాలామందికి తెలుసుకుండకపోవచ్చు. ఇదొక లైఫ్ స్టైల్ పికప్ ట్రక్. ఈ కారును రెహ్మాన్ డకైట్ కాన్వాయ్‌లో ఉండటం చూడవచ్చు. సినిమాలో ఇది టాస్క్ ఫోర్స్ వాహనంగా కనిపిస్తుంది. ఎక్కువ ఛేజింగ్ చేసే సన్నివేశాల్లో చూడవచ్చు. 2008-09 ప్రాంతంలో గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయిన ఈ కారు.. భారతదేశంలో కనిపించినట్లు దాఖలాలు లేవు. ఇది కూడా కఠినమైన రహదారుల్లో ప్రయాణించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.
టయోటా ల్యాండ్ క్రూయిజర్ 60 సిరీస్
అక్షయ్ ఖన్నా పోషించిన రెహ్మాన్ బకాయిట్ పాత్ర.. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కారు 1980-90ల మధ్య తయారైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది ఉత్పత్తిలో లేదు. అయితే ఈ కారుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా.. ఇంతా కాదు. ఇది మాన్యువల్, ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌లతో పాటు.. సాలిడ్ యాక్సిల్స్, లీఫ్ స్ప్రింగ్‌లు పొందుతుంది. ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టం కలిగిన ఈ కారు.. మంచి ఆఫ్-రోడింగ్ అనుభూతిని కూడా అందిస్తుంది.